thukaram gate
-
పోలీసుల చిత్రహింసల వల్లే చిరంజీవి మృతి
సాక్షి, హైదరాబాద్: తుకారాంగేట్ పోలీసులు సెల్‌ఫోన్ చోరీ కేసులో అదుపులోకి తీసుకున్న ఆమూరి చిరంజీవిని ఈ నెల 25వ తేదీన తీవ్రంగా చిత్రహింసలకు గురిచేయడం వల్లనే మృతి చెందాడని మానవ హక్కుల వేదిక ఆరోపించింది. ఈ మేరకు తమ నిజనిర్ధారణలో వెల్లడైనట్లు మానవ హక్కుల వేదిక ఉభయ రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యుడు ఎస్.జీవన్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. మృతుడి కుటుంబానికి రూ. 50 లక్షల పరిహారం అందజేయాలని, బాధ్యులైన పోలీసులను వెంటనే సస్పెండ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మృతుడి భార్య మంజులకు ఉద్యోగం కల్పించి పిల్లలను రెసిడెన్షియల్ పాఠశాలలో చేరి్పంచాలని కోరారు. -
తండ్రీ కూతురు అదృశ్యం
అడ్డగుట్ట: తండ్రి, కూతురు అదృశ్యమైన ఘటన తుకారాంగేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ ఎల్లప్ప తెలిపిన వివరాల ప్రకారం.. వినోభానగర్‌కు చెందిన సింగెపల్లి మంజునాథ్(33) వంట పని చేస్తుంటాడు. ఈ నెల 23న తన కూతురు చైతన్య(13)ను తీసుకొని అడ్డగుట్టలోని తన బంధువుల ఇంటికి వెళ్లాడు. రెండు రోజులు అక్కడే ఉన్నాడు. 25వ తేదీన ఇంట్లో ఎవరికీ చెప్పకుండా తన కూతురిని తీసుకొని బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఆచూకీ తెలియకపోవడంతో మంజునాథ్ కుటుంబ సభ్యులు సోమవారం రాత్రి తుకారాంగేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గృహిణి అదృశ్యం అంబర్‌పేట: భర్తతో చిన్నపాటి ఘర్షణ చోటు చేసుకోవడంతో మనోవేదనకు గురైన ఓ వివాహిత అదృశ్యమైంది. ఈ ఘటన మంగళవారం అంబర్‌పేట పోలీసుస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ రవీందర్ కథనం ప్రకారం.. బాగ్ అంబర్‌పేట మల్లిఖార్జుననగర్‌లో నివసించే యేసు, శాంతకుమారి(39) భార్యాభర్తలు. వీరికి ముగ్గురు పిల్లలు. ఈనెల 28న భార్యాభర్తల మధ్య స్వల్ప వివాదం చోటు చేసుకుంది. దీంతో మనస్థాపానికి గురైన శాంతకుమారి ఈనెల 29న ఆసుపత్రికి వెళుతున్నానని ఇంట్లో నుంచి వెళ్లి తిరిగి రాలేదు. ఆందోళన చెందిన యేసు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. చదవండి: తాగి తందనాలు.. భార్య హోటల్లో పనిచేస్తుండటంతో -
బావల వేధింపులే కారణం..
అడ్డగుట్ట: తుకారాంగేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో అదృశ్యమై హుస్సేన్ సాగర్‌లో శవమై తేలిన మౌనిక(రాణి) ఆత్మహత్య కేసులో మిస్టరీ వీడింది. మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు ఆమె స్నేహితులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారం రోజుల పాటు పలు కోణాల్లో విచారించారు. కాల్ డేటా, సీసీ ఫుటేజీలను పరిశీలించగా మౌనిక ఆత్మహత్యకు ఆమె కుటుంబసభ్యుల్లో ఇద్దరు బావలు, ఇద్దరు అన్నలే కారణమని తేలింది. తుకారాంగేట్ ఇన్స్పెక్టర్ ఎల్లప్ప కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి... బుద్ధానగర్ ప్రాంతానికి చెందిన మాచర్ల అంజయ్య కుమార్తె మౌనిక మారేడుపల్లిలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది. గత నెల 21న ఉదయం కాలేజీకి వెళ్లిన మౌనిక తిరిగి రాలేదు. దీంతో ఆమె సోదరుడు సాయికుమార్ తుకారాంగేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా 23న రాంగోపాల్‌పేట్ పీఎస్ పరిధిలోని హుస్సేన్ సాగర్‌లో మౌనిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న లేక్‌పోలీసులు మృతదేహాన్ని ‘గాంధీ’ మార్చురీకి తరలించారు. దీనిపై సమాచారం అందడంతో తుకారాంగేట్ పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. ఇదిలా ఉండగా తమ కుమార్తె ఆత్మహత్యపై విచారణ చేపట్టాలని కోరుతూ మృతురాలి కుటుంబసభ్యులు మృతదేహంతో పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు మృతురాలు మౌనిక చనిపోయే ముందు తన స్నేహితులు ముగ్గురికి ఫోన్ చేసి మాట్లాడినట్లు గుర్తించారు. సదరు యువకులను స్టేషన్‌కు పిలిపించి విచారించారు. అయితే ఈ కేసుతో వారికి సంబంధం లేదని తేలడంతో వారిని వదిలేశారు. కాగా మౌనిక ఆత్మహత్యకు కొద్ది సేపటి ముందు తన స్నేహితుడికి ఫోన్ చేసి బావలు, అన్నలు తనను వేధిస్తున్నారని, దీంతో తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పినట్లు గుర్తించారు.. దీంతో ఆమె బావలు వడ్డె సోమశేఖర్, ఆంథోనితో పాటు అన్నలు శివకుమార్, సాయికుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఇద్దరు బావల శారీరకంగా వేధిస్తుండగా, అన్నల మానసిక వేధింపుల కారణంగానే మౌనిక ఆత్మహత్యకు పాల్పడినట్లు వెల్లడించారు. నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. -
అదృశ్యమైన యువతి ట్యాంక్‌బండ్‌లో శవమై..
సాక్షి, అడ్డగుట్ట : తుకారాంగేట్‌లో అదృశ్యమైన యువతి హుస్సేన్ సాగర్‌లో శవమై తేలింది. గాంధీ మార్చురీలో భద్రపరిచిన యువతి మృతదేహాన్ని కుటుంబసభ్యులు ఆలస్యంగా గుర్తించడంతో వారికి అప్పగించారు. వివరాల్లోకి వెళితే బుద్ధానగర్‌కు చెందిన అంజయ్య కుమార్తె రాణి(18) వెస్ట్‌మారేడ్‌పల్లిలోని వెస్లీ కాలేజీలో ఇంటర్ చదువుతోంది. గత నెల 21న కాలేజీకి వెళ్లిన రాణి తిరిగి ఇంటికి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు ఆమె కోసం గాలించినా ఫలితం లేకపోవడంతో గత నెల 22న తుకారాంగేట్ పోలీస్‌స్టేసన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. 23న హుస్సేన్ సాగర్‌లో మృతదేహం.... హుస్సేన్ సాగర్‌లో 23న గుర్తు తెలియని మృతదేహం లభ్యం కావడంతో కుటుంబ సభ్యుల ఆచూకీ కోసం రాంగోపాల్‌పేట్ పోలీసులు మృతదేహాన్ని గాంధీ మార్చురీలో భద్రపరిచారు. మరుసటిరోజు పేపర్లో వార్త చూసిన తుకారాంగేట్ పోలీసులు ఆమె కుటుంబసభ్యులను మార్చురీకి తీసుకెళ్లి మృతదేహాన్ని చూపించారు. అయితే మృతదేహం పూర్తిగా ఉబ్బిపోయి ఉండడంతో వారు గుర్తు పట్టలేకపోయారు. అయితే, రోజులు గడుస్తున్నా మృతురాలి ఆచూకీ తెలియకపోవడంతో మరోసారి మృతదేహాన్ని పరిశీలించాలని పోలీసులు అంజయ్య కుటుంబ సభ్యులకు సూచించారు. సోమవారం గాంధీ మార్చురీకి వచి్చన వారు పుట్టు మచ్చలు, పట్టీల ఆధారంగా మృతురాలు రాణిగా గుర్తించారు. మంగళవారం పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగిస్తామని పోలీసులు తెలిపారు. రాణి మృతదేహం.. రాణి(ఫైల్) -
నడి రోడ్డుపై యువకుల వీరంగం
-
నడి రోడ్డుపై యువకుల వీరంగం
హైదరాబాద్: మద్యం మత్తులో మందుబాబులు వీరంగం సృష్టించారు. పూటుగా మద్యం సేవించిన రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన నగరంలోని తుకారాంగేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ వైన్‌షాప్ ముందు సోమవారం చోటుచేసుకుంది. వైన్స్‌లో మద్యం సేవించిన ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగి, అది తీవ్ర స్థాయికి చేరుకొని దాడులకు దారితీసింది. ఈ దాడిలో నలుగురికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.