నడి రోడ్డుపై యువకుల వీరంగం | drinkers gang clashes out in secunderabad | Sakshi
Sakshi News home page

నడి రోడ్డుపై యువకుల వీరంగం

Published Mon, Jul 11 2016 9:05 PM | Last Updated on Mon, Sep 4 2017 4:37 AM

నడి రోడ్డుపై యువకుల వీరంగం

నడి రోడ్డుపై యువకుల వీరంగం

హైదరాబాద్: మద్యం మత్తులో మందుబాబులు వీరంగం సృష్టించారు. పూటుగా మద్యం సేవించిన రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన నగరంలోని తుకారాంగేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ వైన్‌షాప్ ముందు సోమవారం చోటుచేసుకుంది. వైన్స్‌లో మద్యం సేవించిన ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగి, అది తీవ్ర స్థాయికి చేరుకొని దాడులకు దారితీసింది.

ఈ దాడిలో నలుగురికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement