సాక్షి, హైదరాబాద్: తుకారాంగేట్ పోలీసులు సెల్‌ఫోన్ చోరీ కేసులో అదుపులోకి తీసుకున్న ఆమూరి చిరంజీవిని ఈ నెల 25వ తేదీన తీవ్రంగా చిత్రహింసలకు గురిచేయడం వల్లనే మృతి చెందాడని మానవ హక్కుల వేదిక ఆరోపించింది. ఈ మేరకు తమ నిజనిర్ధారణలో వెల్లడైనట్లు మానవ హక్కుల వేదిక ఉభయ రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యుడు ఎస్.జీవన్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.
మృతుడి కుటుంబానికి రూ. 50 లక్షల పరిహారం అందజేయాలని, బాధ్యులైన పోలీసులను వెంటనే సస్పెండ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మృతుడి భార్య మంజులకు ఉద్యోగం కల్పించి పిల్లలను రెసిడెన్షియల్ పాఠశాలలో చేరి్పంచాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment