బంజారాహిల్స్: మోతాదుకు మించి మద్యం సేవించి వాహనాలు నడిపిన ఐదుగురికి ఎర్రమంజిల్ ప్రత్యేక కోర్టు బుధవారం స్వచ్ఛభారత్‌లో పాల్గొనాలని తీర్పు చెప్పింది. ఈ మేరకు వారంతా బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆవరణను బుధవారం శుభ్రం చేశారు. శనివారం డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ వీరందరికీ కోర్టు ఈ శిక్షను విధించింది. పోలీస్ స్టేషన్లో వృధాగా పడి ఉన్న వస్తువులను ఒక చోటకు చేర్చారు. చిందరవందరగా ఉన్న సామగ్రిని క్రమపద్ధతిలో అమర్చారు. ప్రధాన రహదారి కూడలిలో ట్రాఫిక్ విధులు కూడా వారు నిర్వహించారు.