ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, మంచిర్యాల: శిక్షల విధించడంలోనూ ఈమధ్య కొందరు న్యాయమూర్తులు వైవిధ్యతను కనబరుస్తున్నారు. నేరానికి తగ్గట్లు శిక్ష విధించి.. వాటికి పాల్పడుతున్నవాళ్లలో మార్పునకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా మంచిర్యాలలో మందుబాబులకు విధించిన శిక్ష చర్చనీయాంశంగా మారింది.
తాగి ఊగితే పర్వాలేదు. కానీ, రోడ్ల మీదకు చేరి పబ్లిక్ న్యూసెన్స్‌కు పాల్పడుతుంటారు కొందరు. అలా తాగి రచ్చ చేసిన 13 మందికి.. వాళ్ల రిమ్మ దిగిపోయేలా జిల్లా పస్ట్ క్లాస్ కోర్టు భలే శిక్ష విధించింది. రెండు రోజుల హాస్పిటల్ క్లీన్ చేయాలని, అలాగే మాతాశిశు ఆసుపత్రిలో రెండు రోజుల పాటు సేవలందించాలని ఆదేశించింది. దీంతో వాళ్లు కంగుతినగా.. ఆదేశాలను పాటించని పక్షంలో.. జైలు శిక్ష, జరిమానా తప్పదని వారించినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment