మంచిర్యాల ఆస్పత్రిలో 250 పడకలు | 250 beds in good hospitals | Sakshi
Sakshi News home page

మంచిర్యాల ఆస్పత్రిలో 250 పడకలు

Published Fri, Feb 16 2018 2:30 AM | Last Updated on Tue, Oct 9 2018 5:27 PM

250 beds in good hospitals - Sakshi

ఫైల్ ఫోటో

సాక్షి, హైదరాబాద్‌: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఏరియా ఆస్పత్రి సామర్థ్యాన్ని 100 పడకల నుంచి 250 పడకలకు పెంచేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మంచిర్యాల జిల్లాలోని లక్సెట్టిపేటలోని కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ (సీహెచ్‌సీ)ను 30 పడకల నుంచి 100 పడకలకు పెంచేందుకు అనుమతినిచ్చింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి శాంతికుమారి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. మంచిర్యాల ఏరియా ఆస్పత్రికి రూ.34.15 కోట్లు, లక్సెట్టిపేట సీహెచ్‌సీకి రూ.22.50 కోట్లను కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement