
మద్యం కోసం తొక్కిసలాట
విజయవాడ: ‘‘కొత్త సినిమా టికెట్ అయినా దొరుకుతుంది కానీ.. కొత్త వైన్ షాప్‌ల్లో మద్యం దొరకడం లేదు..’’ ఇది విజవాడలోని మందు బాబుల ఆవేదన. ఆదివారం కావడంతో మందుబాబులు బారుల ముందు క్యూ కట్టారు. కొత్త మద్యం పాలసీ కారణంగా ఏపీలో వైన్ షాప్‌లు మద్యం ప్రియులతో కిటకిటలాడుతున్నాయి. మద్యం కొరత ఎక్కువ ఉందని తెలిసి ఎక్కడ అయిపోతుందోనని మందు బాబులు ఎగబడి మరీ కొంటున్నారు.
విజయవాడలోని బందరు రోడ్డు వద్ద ఉన్న మనోరమ సెంటర్ లోని వైన్ షాప్ వద్ద ఒక్కసారిగా వచ్చిన మద్యం కొనుగోలుదారులతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. మద్యం కోసం తోపులాటలతో గందరగోళ పరిస్తితులు నెలకొన్నాయి. పోలీసులు రంగ ప్రవేశం చేసి మందుబాబులను అదుపు చేస్తున్నారు. లైన్‌లో వచ్చిన వారికే మందు విక్రయిస్తారని వైన్‌షాప్ యజమానులు చెబుతున్నారు.