నగర శివారులోరి ఓ ప్రాంతం
నిజామాబాద్ సిటీ: నగర శివార్లలోని బహిరంగ ప్రదేశాల్లో మందుబాబులు పగటిపూటే మద్యం సేవిస్తున్నా పట్టించుకునే వారు లేరనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. శివారు ప్రాంతాలపై పోలీసు నిఘా లేకపోవటం మద్యం ప్రియులకు బాగా కలిసివస్తోంది. శివారు ప్రాంతాల్లో పోలీసులు రాత్రివేళల్లో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నప్పటికీ పగటిపూట ఇటువైపు రావడం లేదని ఆయా కాలనీల ప్రజలంటున్నారు. నగరం చుట్టూ గల బోర్గాం(పి), మాధవ్‌నగర్, 100 ఫీట్ల రోడ్డు(వినాయక్‌నగర్), ఎల్లమ్మగుట్ట న్యూ వెంచర్, న్యాల్‌కల్‌రోడ్డు, వర్నిరోడ్డు, కంఠేశ్వర్ బైపాస్‌రోడ్డు, అర్సపల్లి శివారు, గంగాస్థాన్ ఫేస్–2 ఆర్మూర్‌రోడ్డు వంటి శివారు ప్రాంతాల్లో మద్యం సేవిస్తున్నారు. నగరం లోపల బహిరంగంగా మద్యం సేవించే వారిపై పోలీసులు సిటీ పోలీస్ యాక్టు కేసులు నమోదు చేస్తున్నప్పటికీ శివారు ప్రాంతాలపై నిఘా పెట్టక పోవటంతో మద్యం ప్రియులకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. యువకులు గుంపులు గుంపులుగా మద్యం సేవిస్తూ కొన్ని సందర్భాల్లో ఘర్షణలకు పాల్పడుతూ భయానక వాతావరణం సృష్టిస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
శివారు కాలనీల్లో ఉంటున్న తాము కొన్ని సందర్భాల్లో మధ్యాహ్నం సమయంలోనూ ఇ ళ్ల నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదంటున్నారు. మరికొంతమంది అటువైపు నుండి మరో ప్రాంతాల వైపు వెళ్లాలంటేనే జంకుతున్నారు. కొంతమంది కాలనీవాసులు వారివద్దకు వెళ్లి తమ ప్రాంతాల్లో మద్యం సేవించొద్దని చెబితే కొంతమంది వారి అభ్యర్థనల మేరకు అక్కడి నుంచి జారుకుంటుండగా, మరికొంతమంది కాలనీవాసులకే ఎదురుతిరుగుతున్నారు. మధ్నాహ్నం మొదలయ్యే విందులు సాయంత్ర వరకు కొనసాగుతుంటాయి. ఈ సమయాల్లో పోలీసులు నిఘా పెడితే మద్యం ప్రియులను రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకునే అవకాశం ఉంటుందని ఆయా కాలనీ ప్రజలంటున్నారు.
పగటిపూట పెట్రోలింగ్ నిర్వహించాలి
శివారు ప్రాంతాల్లో రాత్రివేళలో పోలీసులు పెట్రోలింగ్ చేస్తున్నారు. కానీ మధ్యాహ్నం వేళల్లో అటు వైపువెళ్లకపోవడంతో మందుబాబులు రెచ్చిపోతున్నారు. పగటిపూట శివారు ప్రాంతాల వైపు పోలీసులు గాని, ఎక్సైజ్ అధికారులు అటువైపు వెళ్లక పోవటంతో మద్యం సేవిస్తున్నారు. పగటిపూట పెట్రోలింగ్ నిర్వహించాలి.
– ప్రవీణ్, నగరవాసి
Comments
Please login to add a commentAdd a comment