colony people
-
Viral Video: ఆంటీలు ముచ్చట్లు పెడితే అట్లుంటది మరి..
Viral Video: హోరువాన కురుస్తుంటే వెంటనే ఏ చెట్టు కిందకో గూడు కిందకో పరిగెడతాం. కానీ ఇక్కడో కాలనీలోని మహిళలు జోరుగా వాన పడుతుంటే ఏమాత్రం పట్టించుకోకుండా తీరికగా కబుర్లు చెబుతూ కనిపంచారు. ఈ దృశ్యాన్ని ఎవరో వీడియో తీసి ఇంటర్నెట్లో పోస్ట్ చేయడంతో నిముషాల్లో వైరల్ అయ్యింది. దేశ వ్యాప్తంగా హోరువానలు జోరుగా కురుస్తున్నాయి. ఎక్కడపెడితే అక్కడ వరదలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. ఉత్తర భారతదేశంలో చాలా ప్రాంతాలైతే వర్షం ఉధృతికి చెల్లాచెదురయ్యాయి. ఒకపక్క దేశంలో ఇంతటి విపత్కర పరిస్థితులు నెలకొంటూ ఉంటే.. ఓ కాలనీలోని అపార్ట్మెంట్ వారు మాత్రం ఈ వర్షాలు మనల్నేమి చేస్తాయిలే వదినా..? అంటూ సీరియల్ కబుర్లు చెప్పుకుంటూ వర్షంలో ఒళ్ళు మర్చిపోయి తడుస్తూ కనిపించారు. సాధారణంగా ఆడవాళ్ళ గుంపు ఒకచోట చేరిందంటే ఆ ముచ్చట అంత తొందరగా తేలదని అంటూ ఉంటారు. ఈ దృశ్యాన్ని చూస్తే అది నిజమేనేమో అనిపించక మానదు. వీడియోలో ముగ్గురు ఆడవాళ్లు కింద కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటే.. ఇద్దరు మాత్రం వెనుక బెంచి మీద కూర్చుని మాట్లాడుకుంటున్నారు.. ఒక చిన్న పిల్లాడైతే చెంగు చెంగున దూకుతూ అక్కడే ఆడుకుంటున్నాడు. Tez baarish bhi iss prakar ke data transfer ko nahi rok sakti 👏pic.twitter.com/r3kaGXxwx2 — SwatKat💃 (@swatic12) July 20, 2023 ఇది కూడా చదవండి: అది ఒకప్పటి వీడియో, రాజీనామా చేసేది లేదు.. -
Haiti: రాజకీయ స్థిరత్వం లేని నెత్తుటి నేల
లాటిన్ అమెరికాలో భాగంగా.. కరేబియన్ దీవుల్లో వలస పాలన నుంచి విముక్తి పొందిన తొలి దేశంగా హైతీకి ఓ గుర్తింపు ఉంది. అయితే స్వేచ్ఛా దేశం అనేపేరే తప్పించి.. ఏనాడూ ఆ గడ్డ ప్రశాంతంగా ఉండింది లేదు. హింస, దురాక్రమణలు, రాజకీయ సంక్షోభం, ప్రజల తిరుగుబాటు, అణచివేతలు, పేదరికం, తిరుగుబాటుదారుల మారణ హోమాలు హైతీని నెత్తుటి నేలగా మార్చేశాయి. తాజాగా ఏకంగా అధ్యక్షుడు జోవెనెల్ మోయిస్ హత్యతో ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. వెబ్‌డెస్క్: ఆఫ్రికన్ జాతులతో విరజిల్లుతున్న కరేబియన్ సముద్రపు హిస్పనియోల దీవుల్లో.. ఇటలీ నావికాన్వేషకుడు క్రిస్టోఫర్ కొలంబస్ అడుగుపెట్టాడు. ఆ తర్వాత ఈ భూభాగంలో స్పెయిన్ కాలనీలు వెలిశాయి. రెండు వందల ఏళ్ల తర్వాత పశ్చిమం వైపు సగ భాగాన్ని ఫ్రాన్స్ చేజిక్కిచ్చుకుంది. అప్పటి నుంచి వాళ్లను బానిసలుగా మార్చుకుని షుగర్, రమ్, కాఫీ ఉత్పత్తులను ఫ్రాన్స్‌కు అక్రమంగా తరలించడం మొదలుపెట్టారు. ఆ సమయంలో వాళ్లు దారుణమైన హింసను చవిచూశారు. 1801లో.. టౌస్సెయింట్ లోవెర్టర్ తిరుగుబాటుతో బానిసత్వాన్ని రద్దు చేశారు. ఆపై 1804లో ఫ్రాన్స్ నుంచి విముక్తి పొంది హైతీ స్వతంత్ర్య దేశంగా ఆవిర్భవించింది. బానిస బతుకుల విముక్తి కోసం పోరాడిన జీన్ జాక్వెస్ డెస్సాలైన్స్ తొలి అధ్యక్షుడు అయ్యాడు. కానీ, రెండేళ్లకే అతన్ని దారుణంగా హత్య చేశారు(వాళ్లెవరో ఇప్పటిదాకా తెలియదు). ఆపై వంద సంవత్సరాలపాటు అంతర్యుద్దంతో నలిగిపోయిన హైతీలో 1915లో అమెరికా సైన్యం అడుగుపెట్టింది. అయితే 1943లో తమ దళాలను వెనక్కి తీసుకున్నప్పటికీ.. ఇప్పటికీ ఆర్థిక, రాజకీయ అంశాల్లో జోక్యం చేసుకుంటూ వస్తోంది. దాయాదిగా పొరుగు దేశం! పొరగున ఉండే డొమినికన్ రిపబ్లిక్‌తో 1937లో హైతీకి శత్రుత్వం మొదలైంది. సరిహద్దు విషయంలో జరిగిన గొడవలతో అప్పటి డొమినికా నియంతాధ్యక్షుడు టట్రుజిల్లో నర మేధానికి ఆదేశాలిచ్చాడు. దీంతో సరిహద్దులో నివసిస్తున్న హైతీ ప్రజల్ని.. డొమినికా సైన్యం ఊచకోత కోసింది. ఆ తర్వాత కాల్పులు తగ్గుముఖం పట్టినప్పటికీ .. సరిహద్దు ఒప్పందాలు మాత్రం కొనసాగుతున్నాయి. సైన్యం తిరుగుబాటులు 1957లో హైతీ రాజకీయ సంక్షోభం తారాస్థాయికి చేరుకుంది. దీంతో అప్పటి సైన్యాధ్యక్షుడు ఫ్రాన్కోయిస్ పాపా డాక్ డువెలైర్.. మిలిటరీ సాయంతో అధికార పీఠాన్ని చేజిక్కించుకున్నాడు. ఆ పాలనలో మానవ హక్కుల ఉల్లంఘన ఎవరూ ఊహించని స్థాయిలో జరిగింది. చివరికి అంతర్జాతీయ సమాజం విమర్శలకు తలొగ్గి, టోంటోన్ మాకౌట్స్ రహస్య బృందాలకు భయపడి డువెలైర్ కొంచెం తగ్గాడు. 1964లో తనను తాను అధ్యక్షుడిగా అధికారికంగా ప్రకటించుకున్నాడు. అతని మరణం తర్వాత కొడుకు జీన్ కౌడ్(బేబీ డాక్) అధ్యక్షుడు అయ్యాడు. అతని పాలనలో ప్రజలు నరకం అనుభవించారు. ఆ వేధింపులు తట్టుకోలేక ఫ్లోరిడాకు పడవల్లో పారిపోయే ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయాణాల్లో వేల మంది మృత్యువాత పడ్డారు. ఎన్నికలు.. పేదరిక ప్రభావం వరుస తిరుగుబాట్లు, ప్రజల నిరసన ప్రభావంతో బేబీ డాక్.. 1986లో ఫ్రాన్స్‌కు శరణార్థికి పారిపోవడంతో లెఫ్టినెంట్ జనరల్ హెన్రీ నాంపి పాలనను చేపట్టాడు. రెండేళ్లకు జనరల్ ప్రాస్పర్ అవిరిల్ తానే నిజమైన అధ్యక్షుడినని ప్రకటించుకోగా.. అంతర్జాతీయ సమాజం ఒత్తిడితో రాజీనామా చేసి తొలిసారి ఎన్నికలు నిర్వహించారు. అయితే పేదల పెన్నిధిగా పేరున్న వామపక్ష నేత జీన్ బెర్ట్రాండ్ అర్టిస్టిడె ఆ ఎన్నికల్లో గెలవగా.. ఆ మరుసటి ఏడాది(1991)లో హింస చెలరేగడంతో అతన్ని పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది. మూడేళ్ల పాటు ఆ మారణకాండలు అలాగే కొనసాగడంతో.. 1994లో అమెరికా జోక్యం చేసుకుంది. తమ సైన్యాన్ని దించి హైతీ మిలిటరీ చర్యల్ని అణచివేసి.. తిరిగి అర్టిస్టిడ్ను అధ్యక్షుడిగా నియమించి శాంతి స్థాపనకు ప్రయత్నించింది. అప్పటి రాజకీయ అస్థిరత్వం నడుమే అధ్యక్షుడిగా కొనసాగినప్పటికీ.. 2004లో మళ్లీ హింస చెలరేగడంతో అర్టిస్టిడ్ దేశం విడిచి పారిపోయాడు. దీంతో మరోసారి ఎన్నికలు జరగ్గా.. ప్రెవెల్ నెగ్గాడు. ఆపై నిరసనలు, ఆహార కొరత, కలరా.. 2010లో భారీ భూకంపాలతో రెండున్నర లక్షల మంది దుర్మరణం పాలవ్వడంతో హైతీ ఘోరంగా కుదేలు అయ్యింది. కోలుకున్నట్లే అనిపించి.. వరుస విషాదాలతో కొలుకున్న హైతీకి.. 2011 ఎన్నికల్లో మైకేల్ మార్టెల్లీ గెలవడంతో ఆశలు చిగురించాయి. అయితే ఆ ఆనందం ఏడాది కూడా నిలవలేదు. పేదరికం, ఆర్థిక సంక్షోభం, పైగా అవినీతి ఆరోపణలతో ప్రభుత్వ వ్యతిరేక పోరాటాలు మొదలయ్యాయి. దీంతో మార్టెల్లీ రాజీనామా చేయాల్సి వచ్చింది. 2017లో అరటి పండ్ల వ్యాపారిగా ఉన్న జోవెనెల్ మోయిస్.. రాజకీయాల్లోకి అడుగుపెట్టి బ్రహ్మండమైన మెజార్టీతో గెలుపొందాడు. అయితే అధికార దుర్వినియోగంతో ఎన్నికలకు సిద్ధపడకపోకపోవడంతో.. మరోసారి వ్యతిరేక గళం వినిపించింది హైతీ గడ్డపై. ఈ ఏడాది మొదట్లో నియంతృత్వం వద్దంటూ లక్షల మంది నిరసన కార్యక్రమాలు చేపట్టారు. చంపిందెవరు? హైతీ అధ్యక్షుడు జోవెనెల్ మోయిస్ అతిదారుణంగా హత్య చేసిన వాళ్ల గురించి రకరకాల కథనాలు వెలువడ్డాయి. నిందితులు కాల్పుల సమయంలో స్పానిష్, ఇంగ్లీష్ భాషల్లో మాట్లాడారని పోలీసులు ధృవీకరించుకున్నారు. ఇక ఇది ఫ్రాన్స్ చేయించిన హత్య అని, కాదు అమెరికా చేయించిన హత్య అని, డొమెనికా సీక్రెట్ గ్రూప్ చేయించిన పని అని.. ఇలా ఆరోపణలు వినవస్తున్నాయి. అయితే ఆయా దేశాలు మాత్రం ఆరోపణల్ని.. మోయిస్ హత్యను ముక్తకంఠంతో ఖండించాయి. ఇక హత్యకు పాల్పడిన ముఠాగా అనుమానిస్తున్న ముగ్గురిని ఇప్పటికే హైతీ భద్రతా దళాలు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టాయి. తీవ్రంగా గాయపడిన మోయిస్ భార్య మార్టైన్ మోయిస్ స్పృహలోకి వస్తే.. ఈ హత్యకు సంబంధించిన వివరాలేవైనా తెలుస్తాయని భద్రతా దళాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం ప్రధానిగా ఉన్న క్లౌండ్ జోసెఫ్.. తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలు చేపట్టాడు. -
మేం భారతీయులమే.. మా కాలనీ పేరుమార్చండి!
నోయిడా : గ్రేటర్ నోయిడాలోని ఓ కాలనీ వాసులంతా తమ వీధి పేరు మార్చాలని ప్రధాని మోదీకి లేఖ రాశారు. వివరాల్లోకి వెళ్తే.. నోయిడాలోని ఓ వీధి పేరు ‘‘పాకిస్థాన్ వాలీ గలీ’’ అని ఉండటంతో తామంతా పాకిస్థానీయులనే భావన ఈ ప్రాంతంలో ఏర్పడిందని, తక్షణమే తమ ప్రాంతం పేరు మార్చాలని ప్రధాని మోదీకి లేఖ రాశారు. అలాగే ఆ రాష్ట్ర సీఎం యోగీ ఆదిత్యనాథ్‌కు సైతం ఈ విషయమై అభ్యర్థించారు. మొత్తం కాలనీలో 70 కుటుంబాలు నివసిస్తుండగా, వీరంతా ఏడు దశాబ్దాల క్రితం దేశ విభజన సమయంలో భారత్ వచ్చేసి నోయిడాలో స్థిరపడిపోయారు. అయితే వీరందరినీ నేటికీ పాకిస్థానీయులుగా గుర్తించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పాకిస్థాన్ వాలీ గలీ అనే పేరు పడటంతో తమకు విద్య, ఉద్యోగాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, తామంతా భారతీయులమేనని కాలనీ వాసులు వాపోతున్నారు. -
బడి భాగ్యం లేదు
పైఫొటోలో కన్పిస్తున్న మహిళ ఉరవకొండ పట్టణంలోని శివరామిరెడ్డి కాలనీకి చెందిన చిట్టెమ్మ. ఈమెకు ముగ్గురు సంతానం. తమలాగా పిల్లలు కూలీ పనులకు వెళ్లకుండా చదువుకోవాలన్న తపన ఉంది. కానీ ఊరికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాలనీ నుంచి పిల్లలను పంపడం కష్టంగా మారింది. గత్యంతరం లేక బడి మాన్పించింది. ప్రభుత్వం కాలనీలో పాఠశాలకు స్థలం కేటాయించింది. తాత్కాలికంగా షెడ్డు ఏర్పాటు చేసి, విద్యావలంటీర్‌ను నియమిస్తేనైనా తమ పిల్లలు చదువుకుంటారని అభిప్రాయ పడుతోంది. మేం బడికి వెళ్లం అని మారాం చేసే పిల్లలను చూశాం.. బడికి పంపేది లేదనే తల్లిదండ్రులనూ చూసి ఉంటాం.. అందుకు భిన్నంగా మా పిల్లలను చదివిస్తాం..బడి చూపండి అని తల్లిదండ్రులు.. బడికిపోతామని పిల్లలు’ వేడుకుంటున్నా..ఉరవకొండ పట్టణానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న శివరామిరెడ్డి కాలనీవాసులకు ‘బడి’ భాగ్యం కలగలేదు. పలక, బలపం పట్టి భుజానికి సంచి వేసుకొని బడి బాట పట్టాల్సిన చిన్నారులెందరో ఊరిబయట మగ్గుతున్నా పట్టించుకునేవారు లేరు. ఉరవకొండ: పట్టణంలోని బళ్లారి బైపాస్ వద్ద ప్రభుత్వ డిగ్రీ కళాశాల వెనుక వైపు ఉన్న శివరామిరెడ్డి కాలనీ 20 ఏళ్ల క్రితం ఏర్పడింది. కాలనీలో సంచారజాతులు, బుడగజంగం, జోగి, పిచ్చికుంట్ల, ఎరికల కులస్తులకుసంబంధించి 350 కుటుంబాలున్నాయి. వీరికి ప్రభుత్వం స్థలాలు మంజురు చేయించడంతో పాటు రేషన్‌కార్డులు, ఆధార్‌కార్డులు మంజూరు చేసింది. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కలిగి ఉన్నారు. పట్టణానికి మూడు కిలోమీటర్ల దూరంలో కాలనీ ఉంది. కాలనీలో రోడ్లు, తాగునీరు, విద్యుత్ సౌకర్యం లాంటి మౌలిక వసతులూ అంతంతమాత్రంగానే ఉన్నాయి. కాలనీలో దాదాపు ఐదేళ్ల నుంచి 15 ఏళ్లలోపు 280 మంది పిల్లలున్నారు. ఇక్కడ ప్రభుత్వ పాఠశాల లేదు. దీంతో మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న పాఠశాలకు పిల్లలను అతికష్టం మీద పంపేవారు. పిల్లలు పాఠశాలకు వెళ్లాలంటే రద్దీగా ఉన్న 42వ జాతీయ రహదారి దాటుకొని వెళ్లాలి. గతేడాది పాఠశాలకు వెళ్లడానికి వెళ్తున్న ఇద్దరు చిన్నారులను ద్విచక్రవాహనం ఢీకొని తీవ్ర గాయాలపాలయ్యారు. దీంతో కాలనీవాసులు తమ పిల్లలను బడికి పంపాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. కలెక్టర్ చొరవతో పాఠశాల మంజూరు శివరామిరెడ్డి కాలనీవాసుల అవస్థలు గుర్తించి వందలాది పిల్లల భవిష్యత్ కోసం అప్పటి కలెక్టర్ కోన శశిధర్ తాత్కాలిక భవనంలో ప్రభుత్వ పాఠశాల నిర్వహించాలని ఆదేశించారు. దీంతో పాటు వెంటనే ఒక విద్యావలంటీర్‌ను నియమించారు. కాలనీలో పాఠశాల నిర్మాణానికి 13 సెంట్ల స్థలం కూడా కేటాయించారు. దీంతో మండల విద్యాశాఖ అధికారులు ఒక గదిలో పాఠశాలను తాత్కలికంగా ప్రారంభించారు. అయితే పాఠశాల కేవలం నాలుగు నెలలు మాత్రమే నిర్వహించి అధికారులు చేతులు దులుపుకున్నారు. దీంతో పిల్లల చదువుకు చెదలు పట్టింది. కన్నెత్తి చూడని అధికారులు అయ్యా తమ పిల్లలను బడికి పంపి చదివించాలని అనుకుంటున్నాం. వారిని చదివించాలా లేక భిక్షమెత్తుకోవడానికి పంపాలా అంటూ పిల్లల తల్లిదండ్రులు అధికారుల ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా విద్యాధికారుల నుంచి ప్రజాప్రతినిధులు, మండల అధికారులకు శివరామిరెడ్డి కాలనీవాసులు అనేక మార్లు తమ పిల్లలను చదివించాలని మొరపెట్టుకున్నా వారి బాధలు ఒక్కరూ పట్టించుకోలేదు. -
న్యాయం కోసం... ఆందోళన
రెవెన్యూ అధికారుల తీరుతో థామస్‌పేట కాలనీవాసులపై పోలీసులు కేసులు నమోదు చేయడం...కేసు నమోదైన వారిలో ఒకరు మృతి చెందడం...తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. మృతదేహంతో తహసీల్దార్ కార్యాలయాన్ని కాలనీవాసులు ముట్టడించడంతో పరిస్థితి చేయి దాటిపోతుందన్న తరుణంలో అధికారులు దిగొచ్చారు. కాలనీవాసుల డిమాండ్‌కు తలొగ్గారు. హామీలతో ఆందోళనకారులు శాంతించారు. వివరాల్లోకి వెళ్తే... నెల్లిమర్ల: నగర పంచాయతీ పరిధి థామస్‌పేట కాలనీవాసులు అదే కాలనీకి చెందిన ఓ మృతదేహంతో తహసీల్దార్ కార్యాలయం ముందు శుక్రవారం ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని లేకుంటే ఇక్కడి నుంచి కదలేది లేదని భీష్మించుకు కూర్చోవడంతో అధికారులు దిగొచ్చారు. తమ కాలనీకి చెందిన 27 మందిపై అక్రమంగా బనాయించిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ థామస్‌పేట కాలనీ వాసులు శుక్రవారం ఆందోళన చేపట్టారు. న్యాయస్థానం పరిధిలో ఉన్న థామస్‌పేట కాలనీలో చాలా కాలంగా నివసిస్తున్న నిరుపేదలు శిథిలమైన, కాలిపోయిన ఇళ్ల స్థానంలో రేకుల షెడ్లు నిర్మించుకునేందుకు ఎయిమ్స్ విద్యా సంస్థల అధినేత కడగళ ఆనంద్‌కుమార్ తన కృషితో ఉత్తర్వులు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఖాళీగా ఉన్న స్థలాల్లో సైతం ఇళ్లు నిర్మించుకుంటున్నారనే నెపంతో వారం రోజుల కిందట తహసీల్దార్ చిన్నారావు 27 మందిపై కేసులు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. దీంతో పోలీసులు 27 మందిపై కేసులు నమోదు చేశారు. కేసులు నమోదైన బాధితుల్లో ఒకరైన రెడ్డి గురునాయుడు తీవ్ర ఆందోళనకు గురై గురువారం రాత్రి మృతి చెందారు. ఆగ్రహించిన కాలనీ వాసులు గురునాయుడు మృతదేహంలో శుక్రవారం ఉదయం 7 గంటలకే తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. ఆందోళనకు దిగారు. అధికారుల తీరును తప్పుబడుతూ నినదించారు. కాలనీ వాసులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని, గురునాయుడు మృతికి కారణమైన రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు తీవ్ర స్థాయిలో ఆందోళన చేయడంతో డీఆర్ఓ సునీల్‌కుమార్, సీఐ లక్ష్మణరావు వచ్చి ఆందోళనకారులతో మాట్లాడారు. నమోదు చేసిన కేసులపై పునః విచారణ చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే ఉన్న ఇళ్ల స్థానంలో నిర్మించుకుంటున్న వారిపై కేసులు తొలగిస్తామన్నారు. దీంతో ఆందోళనకారులు శాంతించారు. మృతుని కుటుంబాన్ని ఆదుకోవాలని కడగళ ఆనంద్‌కుమార్ అధికారులను కోరారు. వీరి ఆందోళనకు వైఎస్సార్ సీపీ నేతలు పెనుమత్స సాంబశివరాజు, చెనమల్లు వెంకటరమణ, జానా ప్రసాద్, పతివాడ సత్యనారాయణ, రేగాన శ్రీనివాసరావు, టీడీపీ నేతలు రవిశేఖర్, లెంక అప్పలనాయుడు, రెడ్డి వేణు, కింతాడ కళావతి తదితరులు మద్దతుగా నిలిచారు. -
మధ్యాహ్నమైతే ఏంటి?
నిజామాబాద్ సిటీ: నగర శివార్లలోని బహిరంగ ప్రదేశాల్లో మందుబాబులు పగటిపూటే మద్యం సేవిస్తున్నా పట్టించుకునే వారు లేరనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. శివారు ప్రాంతాలపై పోలీసు నిఘా లేకపోవటం మద్యం ప్రియులకు బాగా కలిసివస్తోంది. శివారు ప్రాంతాల్లో పోలీసులు రాత్రివేళల్లో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నప్పటికీ పగటిపూట ఇటువైపు రావడం లేదని ఆయా కాలనీల ప్రజలంటున్నారు. నగరం చుట్టూ గల బోర్గాం(పి), మాధవ్‌నగర్, 100 ఫీట్ల రోడ్డు(వినాయక్‌నగర్), ఎల్లమ్మగుట్ట న్యూ వెంచర్, న్యాల్‌కల్‌రోడ్డు, వర్నిరోడ్డు, కంఠేశ్వర్ బైపాస్‌రోడ్డు, అర్సపల్లి శివారు, గంగాస్థాన్ ఫేస్–2 ఆర్మూర్రోడ్డు వంటి శివారు ప్రాంతాల్లో మద్యం సేవిస్తున్నారు. నగరం లోపల బహిరంగంగా మద్యం సేవించే వారిపై పోలీసులు సిటీ పోలీస్ యాక్టు కేసులు నమోదు చేస్తున్నప్పటికీ శివారు ప్రాంతాలపై నిఘా పెట్టక పోవటంతో మద్యం ప్రియులకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. యువకులు గుంపులు గుంపులుగా మద్యం సేవిస్తూ కొన్ని సందర్భాల్లో ఘర్షణలకు పాల్పడుతూ భయానక వాతావరణం సృష్టిస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శివారు కాలనీల్లో ఉంటున్న తాము కొన్ని సందర్భాల్లో మధ్యాహ్నం సమయంలోనూ ఇ ళ్ల నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదంటున్నారు. మరికొంతమంది అటువైపు నుండి మరో ప్రాంతాల వైపు వెళ్లాలంటేనే జంకుతున్నారు. కొంతమంది కాలనీవాసులు వారివద్దకు వెళ్లి తమ ప్రాంతాల్లో మద్యం సేవించొద్దని చెబితే కొంతమంది వారి అభ్యర్థనల మేరకు అక్కడి నుంచి జారుకుంటుండగా, మరికొంతమంది కాలనీవాసులకే ఎదురుతిరుగుతున్నారు. మధ్నాహ్నం మొదలయ్యే విందులు సాయంత్ర వరకు కొనసాగుతుంటాయి. ఈ సమయాల్లో పోలీసులు నిఘా పెడితే మద్యం ప్రియులను రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకునే అవకాశం ఉంటుందని ఆయా కాలనీ ప్రజలంటున్నారు. పగటిపూట పెట్రోలింగ్ నిర్వహించాలి శివారు ప్రాంతాల్లో రాత్రివేళలో పోలీసులు పెట్రోలింగ్ చేస్తున్నారు. కానీ మధ్యాహ్నం వేళల్లో అటు వైపువెళ్లకపోవడంతో మందుబాబులు రెచ్చిపోతున్నారు. పగటిపూట శివారు ప్రాంతాల వైపు పోలీసులు గాని, ఎక్సైజ్ అధికారులు అటువైపు వెళ్లక పోవటంతో మద్యం సేవిస్తున్నారు. పగటిపూట పెట్రోలింగ్ నిర్వహించాలి. – ప్రవీణ్, నగరవాసి -
ఉప్పల్ ఎమ్మెల్యేపై కాలనీ్ వాసుల ఫిర్యాదు
-
పోలీస్ స్టేషన్ ఎదుటే కాలనీవాసుల బాహాబాహి
-
పన్ను కట్టలేదని నీరు బంద్
ఇళ్ల పన్నులు కట్టలేదని ఎస్సీ కాలనీ మొత్తానికి మంచినీటి సరఫరా నిలిపివేశారు. కాలనీలో ఓవర్‌హెడ్ ట్యాంకు ఉన్నా అది నిరుపయోగంగా ఉంది. బోరుబావిలో నీటిమట్టం అడుగంటింది. దీంతో బిందెడు నీటి కోసం మహిళలు పొలాల్లోకి వెళ్లి బోర్ల వద్ద నుంచి మోసుకుని తెచ్చుకోవాల్సి వస్తోంది. ఓట్లు వేసి గెలిపించినందుకు మాకిచ్చే వరం ఇదేనా అంటూ సర్పంచ్‌పై కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దుర్గి, న్యూస్‌లైన్: ఇంటి పన్ను చెల్లించలేదని దుర్గి గ్రామ సర్పంచ్ వారం రోజులుగా ఎస్సీ కాలనీకి నీటి సరఫరా నిలిపి వేశారు. సుమారు 300 మంది ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు నివాసం ఉంటున్న ఈ కాలనీలో వేసవిలో నీటి సరఫరా అంతంత మాత్రంగానే జరుగుతోంది. ఓవర్ హెడ్ ట్యాంక్ ఉన్నా అది నిరుపయోగంగా ఉండడంతో ధర్మవరం గ్రామం నుంచి సరఫరా అయ్యే మంచి నీరు కూడా లభ్యం కావడం లేదు. దీంతో కాలనీ వాసులు సమీపాన ఉన్న పంట పొలాల నుంచి నీటిని తెచ్చుకోవాల్సి వస్తోంది. అర్ధరాత్రి, అపరాత్రి అని లేకుండా పొలాల్లోకి వెళ్లి బోర్ల వద్ద నుంచి బిందెల్లో నీళ్లు మోసుకుతెచ్చుకోవాల్సి వస్తోందని కాలనీ మహిళలు వాపోతున్నారు. కాలనీకి వచ్చిన గ్రామ సర్పంచ్ రమణ గోపాల్‌ను ఈ విషయమై ప్రశ్నించగా, కాలనీవాసులు ఇంటి పన్ను చెల్లించడం లేదని, అందువల్లనే నీటి సరఫరా ఆపివేశామని చెప్పారన్నారు. ఎన్నికల్లో ఓట్లు వేసి గెలిపించినందుకు ఇదా మీరు మాకిచ్చే కానుక అంటూ కాలనీ వాసులు సర్పంచ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై గ్రామ పంచాయతీ కార్యదర్శి షేక్ ముస్తఫాను న్యూస్‌లైన్ ప్రశ్నించగా విద్యుత్ అంతరాయం కారణంగా గ్రామంలో నీటిసరఫరాలో ఇబ్బందులు ఏర్పడ్డాయని, త్వరలో కాలనీకి నీటి సరఫరా అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. బిందెడు నీటికోసం పొలాల్లోకి వెళుతున్నాం బిందెడు నీటి కోసం పంటపొలాలకు వెళ్లాల్సి వస్తోంది. ఇంటి పన్ను చెల్లించనిదే నీటి సరఫరా చేయడం కుదరదని గ్రామ సర్పంచ్ హెచ్చరిస్తున్నాడు. అధికారులు స్పందించి నీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలి. -అందుగుల పున్నమ్మ పట్టించుకునే నాథుడే లేడు ఎన్నికల్లో ఓట్లు వేసిన విశ్వాసాన్ని మరచి సర్పంచ్ మాట్లాడడం హేయం. వందల కుటుంబాలు జీవనం సాగి స్తుంటే పట్టించుకున్న నాథుడే కరువయ్యారు. నీటి ట్యాంక్ నిర్మించినా ఫలితం శూన్యంగా మారింది. -బొజ్జం ఎస్తేరమ్మ ఓవర్ హెడ్ ట్యాంక్ ఉన్నా ఫలితం లేదు కాలనీలో ఏర్పాటు చేసిన ఓవర్ హెడ్ ట్యాంక్ వలన ఫలితం లేకుండా పోయింది. బోరుబావి ఏర్పాటు చేసినా నీటిమట్టం అడుగంటింది. అప్పటి నుంచి కాలనీకి జమ్మి వద్దనుంచి నీటి సరఫరా చేసినా కాలనీ వాసులు నీటి కోసం ఇబ్బందులకు గురి కాక తప్పటం లేదు. - చాట్ల ప్రభావతి