Aunty Network: 3 Women Gossiping Amid Heavy Rain Below - Sakshi
Sakshi News home page

Aunty Network: హోరు వానలో..  కూర్చుని ముచ్చట్లు పెట్టిన ఆంటీలు.. 

Published Fri, Jul 21 2023 2:06 PM | Last Updated on Fri, Jul 21 2023 2:13 PM

Aunty Network Viral Video 3 Women Gossiping Heavy Rain - Sakshi

Viral Video: హోరువాన కురుస్తుంటే వెంటనే ఏ చెట్టు కిందకో గూడు కిందకో పరిగెడతాం. కానీ ఇక్కడో కాలనీలోని మహిళలు జోరుగా వాన పడుతుంటే ఏమాత్రం పట్టించుకోకుండా తీరికగా కబుర్లు చెబుతూ కనిపంచారు. ఈ దృశ్యాన్ని ఎవరో వీడియో తీసి ఇంటర్నెట్లో పోస్ట్ చేయడంతో నిముషాల్లో వైరల్ అయ్యింది.

దేశ వ్యాప్తంగా హోరువానలు జోరుగా కురుస్తున్నాయి. ఎక్కడపెడితే అక్కడ వరదలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. ఉత్తర భారతదేశంలో చాలా ప్రాంతాలైతే వర్షం ఉధృతికి చెల్లాచెదురయ్యాయి. ఒకపక్క దేశంలో ఇంతటి విపత్కర పరిస్థితులు నెలకొంటూ ఉంటే.. ఓ కాలనీలోని అపార్ట్మెంట్ వారు మాత్రం ఈ వర్షాలు మనల్నేమి చేస్తాయిలే వదినా..? అంటూ సీరియల్ కబుర్లు చెప్పుకుంటూ వర్షంలో ఒళ్ళు మర్చిపోయి తడుస్తూ కనిపించారు. 

సాధారణంగా ఆడవాళ్ళ గుంపు ఒకచోట చేరిందంటే ఆ ముచ్చట అంత తొందరగా తేలదని అంటూ ఉంటారు. ఈ దృశ్యాన్ని చూస్తే అది నిజమేనేమో అనిపించక మానదు. వీడియోలో ముగ్గురు ఆడవాళ్లు కింద కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటే.. ఇద్దరు మాత్రం వెనుక బెంచి మీద కూర్చుని మాట్లాడుకుంటున్నారు.. ఒక చిన్న పిల్లాడైతే చెంగు  చెంగున దూకుతూ అక్కడే ఆడుకుంటున్నాడు. 

ఇది కూడా చదవండి: అది ఒకప్పటి వీడియో, రాజీనామా చేసేది లేదు.. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement