
నగరంలో నిషేధిత ప్లాస్టిక్ కవర్లను స్వాధీనం చేసుకున్న అధికారులు
చంద్రశేఖర్‌కాలనీ నిజామబాద్ : ఇందూరు నగరంలోని వివిధ ప్రాంతాల్లో గల షాపుల్లో సోమవారం సాయంత్రం మున్సిపల్ పబ్లిక్ హెల్త్ అధికారులు స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా దాడులు చేసి నిషేధిత ప్లాస్టిక్ కవర్లు స్వాధీనం చేసుకొని జరిమానాలు విధించారు.స్థానిక అహ్మదీబజార్, గాంధీచౌక్ ఏరియాల్లో గల మద్యం షాపులు, దుస్తుల షాపులపై దాడులు చేసి నిబంధనలకు విరుద్ధంగా ప్లాస్టిక్ కవర్లు వినియోగిస్తున్న వ్యాపారులకు రూ. 11 వేల 800 జరిమానా విధించామని మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ సాజిద్ అలీ తెలిపారు. నిషేధించిన ప్లాస్టిక్ కవర్లను వ్యాపారులు వినియోగించవద్దని ఆయన ఆదేశించారు. స్పెషల్ డ్రైవ్‌లో మున్సిపల్ పబ్లిక్ హెల్త్ అసిస్టెంట్ సునీల్, జవాన్లు రాములు, లతీఫ్, శేఖర్, నరేశ్, కిరణ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment