సాక్షి, రాజన్న సిరిసిల్ల: తుమ్మితే ఊడిపోయేది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి అని సెటైరికల్ కామెంట్స్ చేశారు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సీఎం రేవంత్ కొడంగల్ వెళ్తే అక్కడి ప్రజలు ఉరికించి కొట్టే వాళ్లు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
సిరిసిల్లలో ఈ నెల 29న నిర్వహించనున్న దీక్ష దివాస్ కార్యక్రమ నిర్వహణపై బీఆర్ఎస్ శ్రేణులతో కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ..‘రాష్ట్రంలో ఆర్ఎస్ బ్రదర్స్ లాగా రేవంత్ రెడ్డి, బండి సంజయ్‌పై చర్చ నడుస్తోంది. జిల్లా కలెక్టర్‌ను పార్టీ మారమని సలహాలు ఇస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ వీళ్లు ఏమీ చేయలేరు. తుమ్మితే ఊడిపోయేది రేవంత్ రెడ్డి పదవి. ఎక్కడికి వెళ్ళినా రేవంత్ రెడ్డి.. కేసీఆర్ మీద తిట్ల దండకం తప్ప చేస్తున్నదేమీలేదు. దేవుళ్ల మీద ఒట్లు, కేసీఆర్ మీద తిట్లు, పథకాలకు తూట్లు.. ఇవే రేవంత్ రెడ్డి నినాదాలు.
కొడంగల్‌కు వెళితే రేవంత్ రెడ్డిని ఉరికించి కొట్టేవాళ్ళు అక్కడి ప్రజలు. రాష్ట్రం నుండి ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు గెలిస్తే కేంద్రం నుండి 8 రూపాయలు తెచ్చారా?. ఒక్కసారి తప్పు చేస్తే ఐదేళ్లు ఏళ్లు శిక్షనా అని ఒక ఆటోడ్రైవర్ నాతో అంటున్నాడు. సిరిసిల్లలో వస్త్ర పరిశ్రమ ఉంటే వేములవాడలో యారాన్ డిపో ఏర్పాటు చేస్తున్నారు. బోడిగుండుకు దెబ్బ తాకితే మోకాలుకు మందు రాస్తున్నాడు.
కేసీఆర్ దీక్షతో పార్లమెంట్ దిగివచ్చి డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసింది. కేసీఆర్ అనే మొక్కను మొలవకుండా చేస్తా అంటుండు చిట్టినాయుడు. ఊడలమర్రి చెట్టులా వ్యాపించి వృక్షంలా మన కార్యకర్తలు ఉన్నారు.బండి సంజయ్, రేవంత్ రెడ్డిల భరతం పట్టాలి. లోక్‌సభ ఎన్నికల్లో బండి సంజయ్ మీద డమ్మీ క్యాండిడేట్‌ను పెట్టి సంజయ్ గెలిచేలా చిట్టి నాయుడు చేశాడు’ అంటూ సంచలన ఆరోపణలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment