సాక్షి, హైదరాబాద్ : కరోనా వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్‌డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దీంతో కేవలం నిత్యావసరాలకు సంబంధించిన షాప్‌లు తప్ప మిగతా షాప్‌లు మూత పడ్డాయి. వైన్ షాప్‌లు కూడా మూతపడటంతో మందుబాబులు పరిస్థితి దారుణంగా తయారైంది. రోజు మద్యం సేవించడం అలవాటు ఉన్నవారికి ఒక్కసారిగా మందు దొరక్కపోవడంతో తట్టుకోలేకపోతున్నారు. మద్యానికి బానిసైన ఒక్కరిద్దరు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు.
మరోవైపు వారం రోజుల నుంచి మద్యం దొరక్కపోవడంతో మందుబాబులు వింతగా ప్రవరిస్తున్నారు. దీంతో ఆందోళనకు గురైన మందుబాబుల కుటుంబసభ్యులు.. వారిని ఎర్రగడ్డ ప్రభుత్వ మానసిక వైద్యశాలకు తీసుకువస్తున్నారు. దీంతో ఎర్రగడ్డ ఆస్పత్రికి రోజురోజుకు మందుబాబులు రాక పెరుగుతోంది. కాగా, వింతగా ప్రవరిస్తున్న మందుబాబులకు సంబంధించి రోజుకు వందకు పైగా కేసులు వస్తున్నట్టు ఆస్పత్రి సూపరింటెండెంట్ ఉమా శంకర్ తెలిపారు. (చదవండి: మత్తు లేక మరోలోకం!)
Comments
Please login to add a commentAdd a comment