సాక్షి, హైదరాబాద్ : మందు బాబులపై కరోనా ప్రభావం బాగానే పడింది. కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా విధించిన లాక్‌డౌన్ కారణంగా మందు షాపులను బంద్ చేయటంతో మద్యం ప్రియులు ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. మద్యం దొరక్క పిచ్చి పట్టినట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో ఎర్రగడ్డ మానసిక వికలాంగుల ఆసుపత్రికి కేసులు క్యూ కడుతున్నాయి. గత మూడు, నాలుగు రోజుల నుంచి కేసులు విపరీతంగా పెరిగాయని ఆసుపత్రి సూపరింటెండెంట్ ఉమాశంకర్ తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆసుపత్రిలో చేర్చుకున్న వారికి పూర్తిస్థాయిలో చికిత్స అందిస్తున్నామని పేర్కొన్నారు. ( మహిళకు చీరకొంగుతో మాస్క్ కట్టిన ఎంపీ )
మద్యం లేక కొందరు వ్యక్తులు వింతగా ప్రవర్తిస్తున్నారని, వ్యక్తిగతంగా గాయాలు చేసుకుంటున్నారని చెప్పారు. సోమవారం ఒక్కరోజే 100కు పైగా కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. కాగా, మద్యం దొరకడం లేదన్న బాధతో ఇప్పటివరకు 5 గురు వ్యక్తులు ఆత్మహత్య చేసుకోవటం గమనార్హం. ( కోలుకున్న తొలి కరోనా బాధితుడు )
Comments
Please login to add a commentAdd a comment