erragadda mental hospital
-
ఎర్రగడ్డ ఆస్పత్రి పైనుంచి దూకి మానసిక రోగి ఆత్మహత్య
రహమత్‌నగర్: చికిత్స నిమిత్తం ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రికి వచ్చిన ఓ వ్యక్తి ఆస్పత్రి భవనంపై నుంచి దూకి ఆత్మహత్యా యత్నానికి పాల్పడి చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బోరబండ పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి నాంపల్లి ఓంనగర్‌కు చెందిన నర్సింగరావు50) మానసిక వ్యాధితో బాధపడుతూ పదేళ్లుగా ఎర్రగడ్డ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. శుక్రవారం తన కుమారుడు దీపక్‌తో కలిసి ఆస్పత్రికి వచ్చిన నర్సింగరావు వాష్ రూంకు వెళ్తున్నట్లు కుమారుడికి చెప్పి మొదటి అంతస్తు పై నుంచి కిందికి దూకాడు. తీవ్రంగా గాయపడిన అతడిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు బోరబండ పోలీసులు పేర్కొన్నారు. -
Hyderabad: గొంతులో కోడి గుడ్డు ఇరుక్కొని వ్యక్తి మృతి
సాక్షి, హైదరాబాద్: మరణం మనిషిని ఎటు నుంచి ఆవహిస్తుందే చెప్పడం కష్టంగా మారింది. ఈ మధ్య కాలంలో అకారణ మరణాలు పెరిగిపోతున్నాయి. అప్పటి వరకు సంతోషంగా ఉన్నవారు ఉన్నట్టుండి ప్రాణాలు విడుస్తున్నారు. చిత్ర విచిత్ర కారణాలు మనిషిని చావు వరకు తీసుకెళ్తున్నాయి. గొంతులో ఆమ్లెట్, మాంసం ముక్క, కొబ్బరి ముక్క ఇరుక్కొని ప్రాణాలు విడిచిన ఘటనలు ఇటీవల చూశాం. తాజాగా ఓ వ్యక్తి నోట్లో కోడిగుడ్డు ఇరుక్కొని మృత్యువాతపడ్డాడు. ఎర్రగడ్డలోని మానసిక చికిత్సాలయంలో అనుమానాస్పద స్థితిలో ఓ రోగి మృతి చెందిన ఘటన ఎస్ఆర్నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పొట్టు తీయని గుడ్డు గొంతులో ఇరుక్కుని ఊపిరాడకపోవడం వల్లనే రోగి మృతి చెందినట్లుగా వార్తలు వైరల్ అయ్యాయి. అయితే రోగిది సహజ మరణమేనని ఆస్పత్రి వైద్యులు చెబుతున్నారు. వివరాల్లోకి వెళితే.. సంగారెడ్డి సమీపంలోని ఓ హోం నుంచి అంజి అనే వ్యక్తి సెప్టెంబర్ 5న ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయంలో చేరారు. ఆస్పత్రిలోని డీసీ వార్డులో చికిత్స పొందుతున్న అంజి ఆదివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఊపిరాడని స్థితిలో ఉన్నట్లు ట్యూటీలో ఉన్న స్టాఫ్ నర్సు లక్ష్మీ వైద్యాధికారి రఘువీర్రాజుకు సమాచారం ఇచ్చారు. దీంతో బాధితుడిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మధ్యాహ్నం 3 గంటల సమయంలో మృతి చెందాడు. పొట్టు తీయని గుడ్డును నోట్లో పెట్టుకోగా గొంతులో ఇరుక్కుని ఊపిరాడక చనిపోయినట్లు వార్తలు వెలువడగా, మానసిక చికిత్సాలయం ఆర్ఎంఓ మనోహర్ సోమవారం ఎస్ఆర్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నామని ఇన్స్పెక్టర్ సైదులు తెలిపారు. చదవండి: ఏటీఎంలో రూ.14 లక్షలు చోరీ.. సీసీ కెమెరాలకు రంగేసి -
TS: ఆస్పత్రుల్లో కరోనా కలకలం
సాక్షి, హైదరాబాద్/భద్రాద్రి : తెలంగాణలో కరోనా కేసులు వెల్లువెత్తుతున్నాయి. ఆస్పత్రుల్లోనూ కేసులు బయటపడుతున్నాయి. నిత్యం రద్దీగా ఉండే గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల్లో కరోనా కేసులు బయటపడుతుండడం చూస్తున్నాం. తాజాగా గాంధీ ఆస్పత్రిలో కరోనా కలకలం సృష్టించింది. సుమారు 120 మందికిపైగా సిబ్బందికి కరోనా సోకింది. గాంధీ ఆస్పత్రి సిబ్బంది కరోనా బారిన పడ్డారు. 120 మందికి పైగా కరోనా సోకగా.. ఇందులో 38 మంది వైద్యులు, 48 మంది పీజీ విద్యార్థులు, 35 మంది ఎంబీబీఎస్ విద్యార్థులు, ఆరుగురు ఫ్యాకల్టీ ఉన్నారు. ఈ పరిణామాలతో పేషెంట్ల ట్రీట్మెంట్ కి ఇబ్బందులు ఎదురవుతుండగా.. పేషెంట్ల బంధువుల నుంచి ఆందోళన వ్యక్తం అవుతోంది. మరోవైపు ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రిలోనూ కరోనా కేసులు బయటపడుతున్నాయి. ఇన్ పేషంట్లు గా ఉన్న 57 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. అంతేకాదు 9మంది వైద్య సిబ్బందికి కరోనా సోకింది. లక్షణాలు ఉన్న మరికొందరి ఆసుపత్రి అధికారులు టెస్టులు చేయిస్తున్నారు. భద్రాద్రిలో.. భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో లక్షణాలున్న 286 మందికి కరోనా పరీక్షలు నిర్వహించించగా.. వీళ్లలో 21 మందికి పాజిటివ్ నిర్ధారణ అయినట్లు తెలిపిన ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామకృష్ణ వెల్లడించారు. -
ఎర్రగడ్డ ఆస్పత్రికి పోటెత్తిన రోగులు
వెంగళరావునగర్: కోవిడ్–19 (కరోనా) వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లాక్డౌన్ ఫలితంగా మద్యం అందుబాటులో లేని కారణంగా మద్యానికి బానిసైన వారి పరిస్థితి రోజురోజుకూ దుర్భరంగా తయారవుతోంది. క్రమంగా మతిస్థిమితం లేని వారిలా ప్రవర్తిస్తున్నారు. ఈ క్రమంలో వారిని చికిత్స నిమిత్తం ఎర్రగడ్డలోని మానసిక వైద్యశాలకు పెద్ద ఎత్తున తీసుకొస్తున్నారు. ఎర్రగడ్డ ప్రభుత్వ మానసిక వైద్యశాలకు మంగళవారం 198 మంది ఔట్ పేషెంట్లు హాజరైనట్టు సూపరింటెండెంట్ ఉమాశంకర్ తెలిపారు. ఆస్పత్రిలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... 198 మంది ఓపీకి రాగా 101 మందికి వైద్యం చేయించి పంపించామన్నారు. మరో 97 మందిని ఎమర్జెన్సీగా గుర్తించి ఆస్పత్రిలోనే ఉంచి వైద్య సేవలను అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో మద్యం తాత్కాలికంగా నిలుపుదల చేయడంతో అనేకమంది ఇలాంటి వ్యాధులకు గురవుతున్నారని అన్నారు. మద్యానికి బానిసలైన వారికి ఒక్కసారిగా మద్యం దొరక్క పోవడం వల్ల పిచ్చిపట్టినట్టుగా వ్యవహరిస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. అయితే వారికి చికిత్సలు చేసిన అనంతరం అతి త్వరలోనే మామూలుగా ఉంటారని, పూర్తిగా దీనిని నయం చేయవచ్చని సూచించారు. మద్యాన్ని పూర్తిగా మాన్పించి వేయాలని కుటుంబ సభ్యులకు సూచిస్తున్నామని పేర్కొన్నారు. -
ఎర్రగడ్డకు పోటెత్తిన మందుబాబులు
-
లాక్డౌన్: ఎర్రగడ్డకు పోటెత్తిన మందుబాబులు
సాక్షి, హైదరాబాద్ : కరోనా వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దీంతో కేవలం నిత్యావసరాలకు సంబంధించిన షాప్‌లు తప్ప మిగతా షాప్‌లు మూత పడ్డాయి. వైన్ షాప్‌లు కూడా మూతపడటంతో మందుబాబులు పరిస్థితి దారుణంగా తయారైంది. రోజు మద్యం సేవించడం అలవాటు ఉన్నవారికి ఒక్కసారిగా మందు దొరక్కపోవడంతో తట్టుకోలేకపోతున్నారు. మద్యానికి బానిసైన ఒక్కరిద్దరు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. మరోవైపు వారం రోజుల నుంచి మద్యం దొరక్కపోవడంతో మందుబాబులు వింతగా ప్రవరిస్తున్నారు. దీంతో ఆందోళనకు గురైన మందుబాబుల కుటుంబసభ్యులు.. వారిని ఎర్రగడ్డ ప్రభుత్వ మానసిక వైద్యశాలకు తీసుకువస్తున్నారు. దీంతో ఎర్రగడ్డ ఆస్పత్రికి రోజురోజుకు మందుబాబులు రాక పెరుగుతోంది. కాగా, వింతగా ప్రవరిస్తున్న మందుబాబులకు సంబంధించి రోజుకు వందకు పైగా కేసులు వస్తున్నట్టు ఆస్పత్రి సూపరింటెండెంట్ ఉమా శంకర్ తెలిపారు. (చదవండి: మత్తు లేక మరోలోకం!) -
కరోనా : మద్యం షాపులు బంద్ చేయటంతో..
సాక్షి, హైదరాబాద్ : మందు బాబులపై కరోనా ప్రభావం బాగానే పడింది. కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా విధించిన లాక్డౌన్ కారణంగా మందు షాపులను బంద్ చేయటంతో మద్యం ప్రియులు ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. మద్యం దొరక్క పిచ్చి పట్టినట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో ఎర్రగడ్డ మానసిక వికలాంగుల ఆసుపత్రికి కేసులు క్యూ కడుతున్నాయి. గత మూడు, నాలుగు రోజుల నుంచి కేసులు విపరీతంగా పెరిగాయని ఆసుపత్రి సూపరింటెండెంట్ ఉమాశంకర్ తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆసుపత్రిలో చేర్చుకున్న వారికి పూర్తిస్థాయిలో చికిత్స అందిస్తున్నామని పేర్కొన్నారు. ( మహిళకు చీరకొంగుతో మాస్క్ కట్టిన ఎంపీ ) మద్యం లేక కొందరు వ్యక్తులు వింతగా ప్రవర్తిస్తున్నారని, వ్యక్తిగతంగా గాయాలు చేసుకుంటున్నారని చెప్పారు. సోమవారం ఒక్కరోజే 100కు పైగా కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. కాగా, మద్యం దొరకడం లేదన్న బాధతో ఇప్పటివరకు 5 గురు వ్యక్తులు ఆత్మహత్య చేసుకోవటం గమనార్హం. ( కోలుకున్న తొలి కరోనా బాధితుడు ) -
12 ఏళ్ల తర్వాత కలిశారు..
శ్రీనగర్‌కాలనీ: మతి స్థిమితం కోల్పోయిన ఓ వ్యక్తి రాష్ట్రాలు దాటి వచ్చాడు. తను ఎవరో.. ఏమిటో.. ఎక్కడి వాడో కూడా తెలియని పరిస్థితి. ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రి వైద్యుల కృషితో కోలుకున్న అతడు దాదాపు 12 ఏళ్ల తర్వాత తన కుటుంబ సభ్యులను కలుసుకున్నాడు. లేడనుకున్న వ్యక్తి తిరిగి రావడంతో ఆ కుటుంబ సభ్యుల ఆనందాన్ని అవధుల్లేవు. ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రి సూపరిడెంట్ డాక్టర్ ఉమాశంకర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ కాన్పూర్‌కు చెందిన జశ్వంత్‌కుమార్ మతిస్థిమితం కోల్పోయాడు. అనుకోని పరిస్థితుల్లో ఖమ్మం చేరాడు. అక్కడి మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు 2016 అక్బోబర్లో ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రికి తరలించారు. ఇక్కడ అందించిన వైద్యంతో కొన్ని నెలలకు కోలుకున్న అతడు.. తన పేరు జశ్వంత్‌కుమార్ అని, యూపీ అని మాత్రమే చెప్పాడు. పూర్తి వివరాలు చెప్పలేకపోవడంతో అదే విషయాన్ని ఖమ్మం మేజిస్ట్రేట్ దృష్టికి తీసుకెళ్లారు. అయితే, రోగికి సంబంధించిన వారు ఎవరూ రాకపోవడంతో ఎర్రగడ్డ ఆస్పత్రిలోనే చికిత్స అందించసాగారు. ూ మూడు నెలల క్రితం ఎర్రగడ్డ మానసిక వైద్యులు ఓ కాన్ఫరెన్స్ నిమిత్తం లక్నో వెళ్లగా.. అక్కడ పోలీసింగ్ వ్యవస్థ మెరుగైన సేవలు అందిస్తున్నట్టు తెలుసుకున్నాడు. లక్నో పోలీసుల ‘హెల్పింగ్ పోర్టల్’ ద్వారా ఇక్కడ ఉంటున్న రోగి వివరాలను చెప్పారు. దీంతో గతంలో యూపీలో నమోదైన మిస్సింగ్ కేసులను వడగట్టగా.. జస్వంత్‌కుమార్ వివరాలు వెలుగులోకి వచ్చాయి. వెంటనే అక్కడి పోలీసులతో మాట్లాడి రోగి బంధువులకు సమాచారం ఇవ్వగా.. వారు మంగళవారం ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రికి రోగి కుటుంబ సభ్యులు నలుగురు వచ్చి జశ్వంత్కుమార్ను కలిసి సంతోషం పట్టలేకపోయారు. జశ్వంత్‌కు సంబంధించిన గుర్తింపు కార్డులను పరిశీలించి ఆస్పత్రిలోని లీగల్ సెల్ ద్వారా అతడిని బంధువులకు అప్పగించారు. తమ తమ్ముడిని ఇన్నేళ్ల తర్వాత బాగుచేసి అప్పగించిన వైద్యులకు రోగి అన్న విశ్వనాథ్ వైద్య బృందాన్ని కృతజ్ఞతలు చెప్పాడు. చాలా ఆనందంగా ఉంది.. ఎర్రగడ్డలో రోగులకు అత్యాధునిక వసతులతో చికిత్స అందిస్తున్నాం. చాలామంది రోగులకు చికిత్స అనంతరం వారి బందువుల వద్దకు, కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్నాం. కానీ ఓ మతి స్థిమితం కోల్పోయిన వ్యక్తి కోలుకుని 12 ఏళ్ల తర్వాత కుటుంబ సభ్యులను చేరుకోవడం మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. రోగికి పూర్తి చికిత్స అందించాం. మా డాక్టర్లు లక్నో వెళ్లడం జస్వంత్‌కుమార్ బంధువుల వద్దకు చేర్చేలా చేసింది. – డాక్టర్ ఉమాశంకర్, ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రి సూపరింటెండెంట్ -
ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో మహిళ దారుణ హత్య
-
ఎర్రగడ్డ ఆస్పత్రిలో రోగి ఆత్మహత్య
ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయంలో ఓ రోగి ఆత్మహత్య చేసుకుంది.ప్రకాశం జిల్లా కొల్లపాలెం గ్రామానికి చెందిన హైమవతి మూడేళ్లుగా ఇక్కడి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆస్పత్రిలో 24 గంటలూ కాపలా ఉండే క్లోజ్డ్ ఫిమేల్ వార్డులో ఈమెతో పాటు మరో 77 మంది రోగులు చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉండగా సోమవారం ఉదయం ఆరు గంటల సమయంలో హైమవతి వార్డులో కిటికీ చువ్వకు చీరతో ఉరి వేసుకుంది. అందరూ ఉండగానే ఆమె ఎలా ఆత్మహత్యకు పాల్పడిందనే విషయంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎస్సార్ నగర్ పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని వివరాలు సేకరించి, దర్యాప్తు ప్రారంభించారు. -
తహశీల్దార్‌పై దాడికి యత్నం
హైదరాబాద్ : ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రి స్థలంలో ల్యాండ్ ఫర్ సేల్ అని ఓ సంస్థ నిర్వాహకులు బోర్డులు పెట్టారు.ఆసుపత్రి అధికారుల ఫిర్యాదుతో అక్కడకు వచ్చిన అమీర్‌పేట రెవెన్యూ అధికారులు బోర్డులను తొలగించగా కబ్జాదారుడు తాహాశీల్దార్ పై దాడికి యత్నించాడు. దాంతో తాహాసీల్దార్ వెంకటేశ్వర్లు ఎస్ఆర్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దాడి చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేశారు.ఇన్స్పెక్టర్ శంకర్ తెలిపిన వివరాల ప్రకారం... అనుపమ ఎంటర్‌ప్రజైస్ సంస్థ నిర్వాహాకుడు మహ్మద్ హుసేన్ శుక్రవారం మధ్యాహ్నం కొంతమందితో కలిసి ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రి ప్రధాన గేటు పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో ల్యాండ్ ఫర్ సేల్, ఇక్కడ ప్లాట్లు విక్రయిస్తున్నామని బోర్డులు పెట్టించాడు. దీనిని గమనించిన ఆసుపత్రి అధికారులు అమీర్‌పేట తాహాసీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. తాహాసీల్దార్ వెంకటేశ్వర్లు వెంటనే స్పందించి ఆర్.ఐ.ప్రదీప్, వీఆర్ఓ విజయరాజును అక్కడకు పంపి స్థలాన్ని పరిశీలించాలని సూచించారు. ఆసుపత్రికి వచ్చిన అధికారులు ఎస్ఆర్నగర్ పోలీసులకు సమాచారం అందించి ఆసుపత్రి సెక్యూరిటి సిబ్బంధితో కలిసి ప్రభుత్వ స్థలంలో వెలసిన బోర్డులను తొలగించారు.ఆ సమయంలో అక్కడే ఉన్న హుసేన్ ఆగ్రహంతో ఊగిపోతూ స్థలం తమదని వాగ్వివాదానికి దిగాడు. ఏదైనా ఉంటే ఉన్నతాధికారులతో మాట్లాడుకోవాలని అతడికి సూచించి వెళ్లిపోయారు. కొద్దిసేపటి తరువాత హుసేన్ నేరుగా తాహాసీల్దార్ కార్యాలయంకు వచ్చి ఆసుపత్రి ఆవరణలో రఘుకుల ప్రసాద్ అనే వ్యక్తికి ఐదు ఎకరాల స్థలం ఇచ్చి తమకు ఎందుకు ఇవ్వరని తాహాసీల్దార్ వెంకటేశ్వర్లుతో వాగ్వివాదానికి దిగి దౌర్జన్యానికి పాల్పడ్డాడు. తీవ్రమైన అసభ్యపదజాలంతో దూషిస్తూ కొట్టడానికి వెళ్లడంతో అక్కడే ఉన్న వీఆర్ఓ విజయరాజు, ఇతర ఉద్యోగులు అడ్డుకున్నారు. బయటకు వెళ్లాలని చెప్పినా వినిపించుకోకుండా హుసేన్ కార్యాలయంలో హంగామ సృష్టించాడు. పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు వచ్చేలోపు అక్కడినుండి వెళ్లిపోయాడు.అనంతరం వెంకటేశ్వర్లు పోలీస్ స్టేషన్‌కు వచ్చి జరిగిన గొడవను వివరించి ఫిర్యాదు చేయగా పోలీసులు అతడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కోర్డులో ఉన్న స్థల వివాదం.... ఆసుపత్రి ఆవరణలో ఉన్న 11ఎకరాల రెండు గుంటల కాళీ స్థల వివాదం కోర్టులో ఉందని అధికారులు తెలిపారు.ఇందులోని కొంత స్థలం తమదని పేర్కొంటే అమీనాబేగం, మొహ్మద్ ఖాసీం అనే వ్యక్తులు కోర్టుకు వెళ్లారని, కోర్టుకు వెళ్లిన వారిలో తాను కూడా ఉన్నానని తమపై దౌర్జన్యాని పాల్పడ్డ వ్యక్తి మహ్మద్ హుసేన్ చెపుతున్నాడని తాహాసీల్దార్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. -
ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రీ వికారాబాద్‌కే!
తరలించాలని ప్రభుత్వ నిర్ణయం? 42 ఎకరాల్లోని ఆసుపత్రి స్థలంలో ఐఏఎస్ అధికారుల గృహ సముదాయం పరిశీలనలో ఔషధ నియంత్రణ మండలి స్థలం కూడా వాస్తు దోషం వల్ల ఎర్రగడ్డ రైతు బజార్ స్థలం సేకరణకు విముఖత సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ఎర్రగడ్డలోని ఛాతీ వ్యాధుల ఆసుపత్రిని వికారాబాద్ చేరువలోని అనంతగిరికి తరలించాలని ప్రభుత్వం తీసుకున్న వివాదాస్పద నిర్ణయంపై చెలరేగిన దుమారం ఇంకా కొనసాగుతుండగానే సర్కారు మరో వివాదాస్పద నిర్ణయం తీసుకునేందుకు రంగం సిద్ధం చేసింది. ఛాతీ వ్యాధుల ఆసుపత్రిని ఆనుకునే ఉన్న ప్రభుత్వ మానసిక చికిత్సాలయాన్ని (మెంటల్ హాస్పిటల్) కూడా అనంతగిరిలోనే ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించింది. అక్కడ స్థల సేకరణ అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ మేరకు త్వరలోనే అధికారిక నిర్ణయం వెలువడనుంది. ఛాతీ వ్యాధుల ఆసుపత్రి తరలింపుతో ఏర్పడే ఖాళీస్థలంలో సచివాలయాన్ని నిర్మించాలని ప్రాథమికంగా నిర్ణయించిన ప్రభుత్వం అక్కడే ప్రభుత్వ పాలనా కార్యాలయాలతోపాటు ఉన్నతాధికారుల నివాసాలు కూడా ఏర్పాటు చేయాలనుకుంటోంది. ఛాతీ వ్యాధుల ఆసుపత్రి స్థలంలో సచివాలయం నిర్మిస్తే అధికారుల నివాస గృహసముదాయానికి స్థలం కావాలి కాబట్టి మానసిక చికిత్సాలయం తరలింపుతో ఆ స్థలాన్ని సిద్ధం చేయాలనేది సీఎం కేసీఆర్ నిర్ణయంగా తెలుస్తోంది. స్వయంగా పరిశీలించిన ముఖ్యమంత్రి... ఎర్రగడ్డలో ప్రభుత్వ ఆసుపత్రులు, ఇతర కార్యాలయాల సముదాయాలు అన్నీ పక్కపక్కనే ఉన్నాయి. అక్కడ దాదాపు 150 ఎకరాల వరకు స్థలం ఉన్నట్టు సమాచారం. ఈ విషయం తెలిసిన ముఖ్యమంత్రి కేసీఆర్ కొంతకాలంగా ఆ స్థలాన్ని ఇతరత్రా ప్రజోపయోగ నిర్మాణాలకు వినియోగించే ఆలోచనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో వారం క్రితం రోడ్లు భవనాలశాఖకు చెందిన కొందరు అధికారులతో కలసి ఆయన ఆ ప్రాంతాన్ని స్వయంగా పరిశీలించారు. వెంగళరావు నగర్ వెళ్లే రోడ్డులోని ఔషధ నియంత్రణ మండలి డీజీ కార్యాలయం నుంచి ఆయన పరిశీలిన మొదలైంది. ఆ ప్రాంగణం కూడా విశాలమైందే. దానిని ఆనుకుని కేంద్రప్రభుత్వ రంగ సంస్థ కార్యాలయం ఒకటి ఉంది. ఆ తర్వాత ఛాతీ వ్యాధుల ఆసుపత్రి, దాని పక్కన మానసిక చికిత్సాలయం, ఆ తర్వాత ఎర్రగడ్డ రైతు బజార్ ఉంది. వీటన్నింటిని ఆయన వరుసగా పరిశీలించారు. ఇందులో రైతుబజార్ వద్ద ఓ అక్రమ నిర్మాణం వల్ల వాస్తు దోషం ఉందని గుర్తించి దాన్ని పరిగణనలోకి తీసుకోలేదని సమాచారం. అది పోను తొలుత ఛాతీ ఆసుపత్రి, మానసిక చికిత్సాలయం స్థలాలను సేకరించాల్సిందిగా ఆయన అధికారులను ఆదేశించారు. ఈ రెండూ కలిపితే 102 ఎకరాల స్థలం ఉందని అధికారులు తేల్చారు. అనంతగిరిలో టీబీ (క్షయ) శానిటోరియం సిద్ధంగా ఉన్నందున ఆ ప్రాంగణానికి మర మ్మతులు చేస్తే వెంటనే టీబీ ఆసుపత్రిని తరలించేందుకు అవకాశం ఉండటంతో తొలుత దాన్ని తరలించాలని ఆదేశించారు. ఆ తర్వాత 42 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న మానసిక చికిత్సాలయాన్ని తరలించాలని ఆదేశించినట్టు తెలిసింది. ప్రస్తుతం మెంటల్ హాస్పిటల్ ఏర్పాటుకు అనంతగిరిలో ఉన్న అవకాశాలను అధికారులు పరిశీలిస్తున్నారు. దీని తరలింపుతో అందుబాటులోకి వచ్చే 42 ఎకరాలను ఐఏఎస్ అధికారుల నివాస సముదాయానికి వాడాలని సీఎం భావిస్తున్నారు. వెంగళరావు నగర్ దారిలోని ఔషధ నియంత్రణ మండలి కార్యాలయాన్ని తరలించటం ద్వారా ఆ స్థలాన్ని కూడా ఈ ప్రణాళికలో చేర్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. కాగా, శుక్రవారం జరిగే మంత్రివర్గ సమావేశంలో వీటిపై చర్చించనున్నట్టు తెలిసింది. ఇప్పటికిప్పుడు 102 ఎకరాల ఖాళీ స్థలం అందుబాటులోకి వస్తున్నందున అందులో ప్రభుత్వ పరిపాలన భవనం, అధికారుల నివాస గృహాలపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. -
పట్టించిన వాట్స్‌యాప్
=మొబైల్ అప్లికేషన్‌తో చిక్కిన ‘మెంటల్ ఖురేషీ’ =మొదటి వారంలో ‘ఎర్రగడ్డ’ నుంచి పరారీ =19 రోజుల్లో పద్దెనిమిది ప్రాంతాల్లో ‘పర్యటన’ =రెండో భార్యతో ఉన్న ఫొటోలు మొదటామెకు షేర్ =బయటి నుంచి నలుగురు సహకరించినట్లు నిర్ధారణ సాక్షి, సిటీబ్యూరో: నేరగాళ్లను పట్టుకునేందుకు వెస్ట్‌జోన్ పోలీసులకు టెక్నాలజీ బాగా ఉపకరిస్తోంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ చంద్రశేఖర్‌గౌడ్ కిడ్నాప్, హత్య మిస్టరీని ఫేస్బుక్ ఫొటోలు విప్పితే... ఎర్రగడ్డ మెంటల్ ఆస్పత్రి నుంచి పరారైన ఖైదీ ఖురేషీ జాడను మొబైల్ అప్లికేషన్ ‘వాట్స్‌యాప్’ తెలిపింది. రెండో భార్యతో ములాఖత్ అంగీకరించలేదనే కారణంగా ఈ నెల 3న తెల్లవారుజామున మరికొందరు ఖైదీలతో కలిసి ఖురేషీ ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ నుంచి తప్పించుకున్న సంగతి తెలిసిందే. ఖురేషీ ‘గ్రేట్ ఎస్కేప్’కు బయట నుంచి మరో నలుగురు సహకరించినట్లు ఆధారాలు లభించాయని పశ్చిమ మండల డీసీపీ వి.సత్యనారాయణ వెల్లడించారు. మంగళవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఖురేషీ అరెస్టును ఆయన ప్రకటించారు. నాంపల్లి చాపెల్ రోడ్లో నివసించే మహ్మద్ అహ్మద్ ఫాహుద్దీన్ ఖురేషీపై అబిడ్స్ ఠాణాలో ఆరు, నాంపల్లి పోలీసుస్టేషన్లో మరో కేసు నమోదై ఉన్నాయి. అబిడ్స్ పోలీసు రికార్డుల్లో రౌడీషీటర్‌గా ఉన్న ఖురేషీని ఆ ఠాణా పోలీసులు మాదకద్రవ్యాల కేసులో అక్టోబర్ 15న అరెస్టు చేసి జైలుకు పంపారు. మానసికస్థితి సరిగ్గా లేదన్న కారణంతో జైలు అధికారులు ఎర్రగడ్డలోని మెంటల్ ఆస్పత్రిలో చేర్చారు. ఈ నేపథ్యంలోనే ఆయన తప్పించుకున్నాడు. నిత్యం ‘రోమింగ్’లోనే... ఆస్పత్రి వద్ద నుంచి ఆటోలో తన రెండో భార్య అల్మాస్ వద్దకు వెళ్లిన ఖురేషీ.. ఆమెతో కలిసి టవేరా వాహనంలో ‘టూర్’ ప్రారంభించాడు. మొదటి భార్య ఉన్నప్పటికీ ఖురేషీ ఈ ఏడాది సెప్టెంబర్‌లో అల్మాస్‌ను పెళ్లి చేసుకున్నాడు. గడిచిన 19 రోజుల్లో వాహనాలతో పాటు విమానాలు, రైళ్లలో గుల్బర్గా, బెంగళూరు, మైసూరు, ఊటీ, అజ్మీర్, ఢిల్లీ, ముంబై, మహాబలేశ్వర్, హరిద్వార్, కాశ్మీర్, గోవా, ఆగ్రా, సిమ్లా, కులూమనాలీ, శ్రీనగర్, పటాన్‌కోట్, లడక్, విజయవాడల్లో తిరిగాడు. ఎక్కడా ఒకరోజుకు మించి బస చేయలేదు. ఈ నేపథ్యంలోనే రెండుసార్లు పోలీసుల నుంచి త్రుటిలో తప్పించుకున్నాడు. ఆగ్రాలో రెండో భార్యతో కలిసి దిగిన ఫొటోలను వాట్స్‌యాప్ ద్వారా మొదటి భార్యకు షేర్ చేశాడు. దీంతో అతడి ఆచూకీని సాంకేతికంగా కనిపెట్టిన పోలీసులు నిఘా ఉంచారు. సోమవారం సాయంత్రం విజయవాడ నుంచి టోలిచౌకి చేరుకోగా మాటు వేసిన వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్, ఎస్సార్‌నగర్ పోలీసులు పట్టుకున్నారు. సహకరించిన వారిలో చీతాపూర్ కార్పొరేటర్ ఖురేషీ తప్పించుకోవడానికి సహకరించిన వ్యక్తులు నలుగురని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. మీరాలం మండీకి చెందిన రెండోభార్య అల్మాస్‌కు ఖురేషీ పరారైన ఖైదీ అని తెలిసీ అతడితో సంచరించింది. ఈమె సోదరుడైన సయ్యద్ ముస్తాఫా అలీఖాన్ రిజ్వీ అలియాస్ ఫజల్ తరచూ ఆస్పత్రిలో ఖురేషీని క లుస్తూ అక్కడి నుంచి తప్పించుకోవడానికి సహకరించాడు. అల్మాస్ నివసిస్తున్న ఇంటి యజమాని సయ్యద్ అలీ హుస్సేన్ వీరిద్దరూ సిటీ వదిలి పారిపోవడానికి తన టవేరా వాహనాన్ని సమకూర్చాడు. కర్ణాటకలోని గుల్బర్గా జిల్లాలో ఉన్న చీతాపూర్ కార్పొరేటర్ సయ్యద్ జఫార్ సైతం రూ.25 వేల వరకు ఇచ్చి సహకరించాడు. వీరందరిపైనా చర్యలు తీసుకోవాలని నిర్ణయించిన పోలీసులు.. ఇంకా ఎవరి ప్రమేయం ఉందనేది తేల్చడానికి ఖురేషీని కస్టడీలోకి తీసుకోవాలని నిర్ణయించారు. ఆర్మ్ రెజ్లింగ్ చాంపియన్ కూడా.. ప్రస్తుతం అబిడ్స్ ఠాణాలో రౌడీషీటర్‌గా ఉన్న, ‘మెంటల్’గా ముద్రపడిన ఖురేషీలో మరో ఆసక్తికర కోణమూ ఉంది. అతను ఆర్మ్ రెజ్లింగ్‌లో చాంపియన్. ఫహద్ ఖురేషీ పేరుతో 2006 వరకు దేశ వ్యాప్తంగా జరిగిన సీనియర్ ఆర్మ్ రెజ్లింగ్ పోటీల్లో పాల్గొన్నాడు. ఎందరో మల్లయోధుల్ని మట్టికరిపించి నాలుగైదు మెడల్స్ కూడా సంపాదించాడు. 2004 ఆగస్టు 22-25 మధ్య ఒడిశాలోని పూరీలో జరిగిన 28వ సీనియర్ నేషనల్ ఆర్మ్ రెజ్లింగ్ చాంపియన్ షిప్ పోటీల్లో అత్యుత్తమన ప్రతిభ కనబరిచాడు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పటికీ యూట్యూబ్‌లో ఉన్నాయి. ఖురేషీ మానసికస్థితి పక్కాగా ఉంది ఎస్కేప్‌కు ప్లాన్ చేయడం నుంచి పట్టుబడే వరకు ఖురేషీ తీరును పరిశీలిస్తే అతడి మానసికస్థితి పక్కాగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇతడు జైలు నుంచి మెంటల్ ఆస్పత్రికి ఎందుకు వచ్చాడనేది బయటపడాలి. ఖురేషీ సైతం తనను ఆ ఆస్పత్రికి ఎందుకు పంపారో తెలియదని చెబుతున్నాడు. అందుకే గాంధీ ఆస్పత్రి వైద్యుల బృందంతో పరీక్షలు చేయిస్తున్నాం. నివేదికల్ని కోర్టుకు సమర్పించి న్యాయమూర్తి ఆదేశాల మేరకు నడుచుకుంటాం. ఖురేషీ ఆస్పత్రిలో ఉండగా ఫోను వాడాడని తెలుస్తోంది. ఈ విషయంతో పాటు అనేక కోణాల్లో విచారణ చేస్తున్నాం. ఆ రోజు తప్పించుకున్న వారిలో తిరుమలేష్ ఇప్పటికీ పరారీలోనే ఉన్నాడు. ఇతని కోసం ప్రత్యేక బృందం గాలిస్తోంది. - డీసీపీ సత్యనారాయణ -
మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఖురేషి పట్టివేత
హైదరాబాద్; మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఖురేషి ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయంలో చికిత్స పొందుతూ తప్పించుకుపోయిన ఖురేషి అనే ఖైదీని వెస్ట్ జోన్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు.అతను గుల్బర్గాలో పోలీసుల చేతికి చిక్కాడు. ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయం నుంచి పరారైన రోగుల్లో ఖురేషి అనే ఖైదీ అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి . డిసెంబర్ 2 వతేదీన ఖురేషీ ఆసుపత్రిలోని ఆక్సిజన్ సిలిండర్‌తో గోడకు రంధ్రం చేసి పరారైయ్యాడు. తరచు ఆసుపత్రి సిబ్బంది,పోలీస్ సెక్యూరిటీపై తరచుగా బెదిరింపులకు పాల్పడేవాడు. అతను తప్పించుకున్న ముందురోజు భార్యతో ములాఖత్ కు పోలీసులు నిరాకరించడంతో భయానక వాతావరణం సృష్టంచాడు. -
పట్టుబడ్డ మరో ‘ఎర్రగడ్డ’ ఖైదీ
హైదరాబాద్, సత్తుపల్లి న్యూస్‌లైన్: ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయం నుంచి సోమవారం రాత్రి పరారైన 11 మంది ఖైదీలలో మొత్తం 9 మందిని పోలీసులు బుధవారం నాటికి పట్టుకోగలిగారు. మంగళవారం సాయంత్రం వరకు 8 మందిని అరెస్టు చేయగా.. బుధవారం ఖమ్మంజిల్లా సత్తుపల్లి మండలం కిష్టాపురంలో దారావత్ జీవరత్నం అనే మరో ఖైదీని అరెస్టు చేశారు. బుధవారం కృష్ణా ఎక్స్‌ప్రెస్ రైలులో వస్తున్నట్లు జీవరత్నం తన సోదరుడికి సమాచారం అందించడంతో.. విషయం తెలుసుకున్న సత్తుపల్లి పోలీసులు కిష్టాపురం వెళ్తుండగా జీవరత్నంను అదుపులోకి తీసుకున్నారు. -
పిచ్చాస్పత్రి కేసు: నాంపల్లి కోర్టుకు ఖైదీలు
హైదరాబాద్ : ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయం నుంచి తప్పించుకున్న 11మందిలో ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గురు పరారీలో వున్నారు. పట్టుబడిన ఏడుగురిని పోలీసులు బుధవారం నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు. వారిపై పోలీసులు ఐపీసీ 224, 435, 427, 353 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా భార్యను ములాఖత్‌కు అనుమతించలేదన్న కోపంతో ఓ అండర్ ట్రయల్ ఖైదీ వేసిన పథకంతో ఆస్పత్రి నుంచి చికిత్స పొందుతున్న పదకొండుమంది నిన్న తెల్లవారుజామున పరారైన విషయం తెలిసిందే. ఈ ఘటనపై రెడ్ అలర్ట్ ప్రకటించిన పోలీసులు నిన్న సాయంత్రానికి ఏడుగురిని పట్టుకోగా... మిగతావారు ముంబైలో ఉన్నట్లు ఆధారాలు సేకరించారు. పరారీలో ఉన్ను ఖురేషీ, జీవరత్న, తిరుమలేష్ కోసం వేట ముమ్మరం చేశారు. -
ఖురేషి అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి
-
ఖురేషి అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి: ప్రమోద్‌కుమార్
ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయం నుంచి పరారైన రోగుల్లో ఖురేషి అనే ఖైదీ అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి అని ఆ ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రమోద్‌కుమార్ వెల్లడించారు. మంగళవారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... ఆసుపత్రి నుంచి గత రాత్రి 11 మంది రోగులు పరారైనట్లు ధృవీకరించారు. నిన్న రాత్రి 8 గంటల సమయంలో ఖురేషి భార్య ములాఖత్ కావాలంటూ ఆసుపత్రికి వచ్చిందని, అయితే ఆ సమయంలో ములాఖత్ నిబంధనలకు విరుద్ధమని చెప్పామని ఆయన తెలిపారు. భార్యతో ములాఖత్ నిరాకరించడంతో ఖురేషి ఆసుపత్రిలో భయానక వాతావరణం సృష్టించాడని పేర్కొన్నారు. ఖురేషీ ఆసుపత్రి సిబ్బంది,పోలీస్ సెక్యూరిటీపై తరచుగా బెదిరింపులకు పాల్పడేవాడని వివరించారు. ఆసుపత్రిలోని ఆక్సిజన్ సిలిండర్‌తో గోడకు రంధ్రం చేసి వారంత పరారయ్యారని తెలిపారు. పరారైన వారిలో ఏడుగురిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. మరో నలుగురు పరారిలో ఉన్నారన్నారు. రాత్రి సమయంలో వారిని అడ్డుకోవడానికి తమ సిబ్బంది, పోలీసులు విఫలయత్నం చేశామన్నారు. అయితే ఆసుపత్రిలో మిగిలిన 50 మంది పేషెంట్లకు ఎటువంటి హాని కలగకుండా చర్యలు తీసుకున్నట్లు వివరించారు. -
ఎర్రగడ్డ మానసిక రోగుల పరారీ
-
ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయం నుంచి 11 మంది రోగుల పరారీ
హైదరాబాద్ నగరంలోని ఎర్రగడ్డ మానసిక రోగుల చికిత్సాలయం (మెంటల్ ఆస్పత్రి)లో కలకలం చెలరేగింది. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా పదకొండు మంది మానసిక రోగులు ఆస్పత్రి నుంచి తప్పించుకున్నారు. వారిలో ఏడుగురిని పోలీసులు మళ్లీ అదుపులోకి తీసుకున్నారు. మరో నలుగురి ఆచూకీ మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. ఇక్కడి జైల్ బ్యారెక్‌లో మొత్తం 60 మంది రోగులు ఉంటారు. అక్కడినుంచే మొత్తం 11 మంది రోగులు పరారయ్యారు. ఆస్పత్రికి ఉన్న గ్రిల్స్ తొలగించుకుని మరీ వారు పరారు కావడం పట్ల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ పరారీ వెనుక ఖురేషీ అనే వ్యక్తి ప్రధాన సూత్రధారి అని తెలుస్తోంది. కాగా, ఆక్సిజన్ సిలిండర్‌తో గోడను పగుల గొట్టి పరారైనట్లు సమాచారం. అర్ధరాత్రి రెండు గంటల తర్వాత వీరంతా ఒకరి తర్వాత ఒకరిగా పరారయ్యారు. నగరంలోని పాతబస్తీకి చెందిన ఖురేషీ, వరంగల్ జిల్లాకు చెందిన జీవరత్నం, తిరుమలేష్ తదితరులున్నారు. గతంలోనూ ఆరుగురు ఇక్కడినుంచి తప్పించుకున్నారు. అంతకుముందు గుర్తుతెలియని వ్యక్తి మహిళావార్డులో ప్రవేశించారు. మొత్తమ్మీద ఇక్కడ భద్రతాపరమైన లోపాలు కనిపిస్తున్నాయి. పోలీసులకు ఫోన్లు చేసినా ఎవరూ స్పందించలేదని స్థానికులు చెబుతున్నారు. ఇక పాతబస్తీకి చెందిన ఖురేషీ అనే వ్యక్తి ఈ మొత్తం సంఘటనకు సూత్రధారి అని భావిస్తున్నారు. అతడు ఇక్కడినుంచి పారిపోయి పాతబస్తీలోని మీర్ చౌక్ వైపు వెళ్లినట్లు చెబుతున్నారు. అతడు తన రెండో భార్యను తీసుకుని ముంబై వైపు పారిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు.