హైదరాబాద్ : ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రి స్థలంలో ల్యాండ్ ఫర్ సేల్ అని ఓ సంస్థ నిర్వాహకులు బోర్డులు పెట్టారు.ఆసుపత్రి అధికారుల ఫిర్యాదుతో అక్కడకు వచ్చిన అమీర్‌పేట రెవెన్యూ అధికారులు బోర్డులను తొలగించగా కబ్జాదారుడు తాహాశీల్దార్ పై దాడికి యత్నించాడు. దాంతో తాహాసీల్దార్ వెంకటేశ్వర్లు ఎస్‌ఆర్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దాడి చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేశారు.ఇన్స్‌పెక్టర్ శంకర్ తెలిపిన వివరాల ప్రకారం... అనుపమ ఎంటర్‌ప్రజైస్ సంస్థ నిర్వాహాకుడు మహ్మద్ హుసేన్ శుక్రవారం మధ్యాహ్నం కొంతమందితో కలిసి ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రి ప్రధాన గేటు పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో ల్యాండ్ ఫర్ సేల్, ఇక్కడ ప్లాట్లు విక్రయిస్తున్నామని బోర్డులు పెట్టించాడు. దీనిని గమనించిన ఆసుపత్రి అధికారులు అమీర్‌పేట తాహాసీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. తాహాసీల్దార్ వెంకటేశ్వర్లు వెంటనే స్పందించి ఆర్.ఐ.ప్రదీప్, వీఆర్‌ఓ విజయరాజును అక్కడకు పంపి స్థలాన్ని పరిశీలించాలని సూచించారు.
ఆసుపత్రికి వచ్చిన అధికారులు ఎస్‌ఆర్‌నగర్ పోలీసులకు సమాచారం అందించి ఆసుపత్రి సెక్యూరిటి సిబ్బంధితో కలిసి ప్రభుత్వ స్థలంలో వెలసిన బోర్డులను తొలగించారు.ఆ సమయంలో అక్కడే ఉన్న హుసేన్ ఆగ్రహంతో ఊగిపోతూ స్థలం తమదని వాగ్వివాదానికి దిగాడు. ఏదైనా ఉంటే ఉన్నతాధికారులతో మాట్లాడుకోవాలని అతడికి సూచించి వెళ్లిపోయారు. కొద్దిసేపటి తరువాత హుసేన్ నేరుగా తాహాసీల్దార్ కార్యాలయంకు వచ్చి ఆసుపత్రి ఆవరణలో రఘుకుల ప్రసాద్ అనే వ్యక్తికి ఐదు ఎకరాల స్థలం ఇచ్చి తమకు ఎందుకు ఇవ్వరని తాహాసీల్దార్ వెంకటేశ్వర్లుతో వాగ్వివాదానికి దిగి దౌర్జన్యానికి పాల్పడ్డాడు. తీవ్రమైన అసభ్యపదజాలంతో దూషిస్తూ కొట్టడానికి వెళ్లడంతో అక్కడే ఉన్న వీఆర్‌ఓ విజయరాజు, ఇతర ఉద్యోగులు అడ్డుకున్నారు. బయటకు వెళ్లాలని చెప్పినా వినిపించుకోకుండా హుసేన్ కార్యాలయంలో హంగామ సృష్టించాడు.
పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు వచ్చేలోపు అక్కడినుండి వెళ్లిపోయాడు.అనంతరం వెంకటేశ్వర్లు పోలీస్ స్టేషన్‌కు వచ్చి జరిగిన గొడవను వివరించి ఫిర్యాదు చేయగా పోలీసులు అతడిపై పలు సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కోర్డులో ఉన్న స్థల వివాదం.... ఆసుపత్రి ఆవరణలో ఉన్న 11ఎకరాల రెండు గుంటల కాళీ స్థల వివాదం కోర్టులో ఉందని అధికారులు తెలిపారు.ఇందులోని కొంత స్థలం తమదని పేర్కొంటే అమీనాబేగం, మొహ్మద్ ఖాసీం అనే వ్యక్తులు కోర్టుకు వెళ్లారని, కోర్టుకు వెళ్లిన వారిలో తాను కూడా ఉన్నానని తమపై దౌర్జన్యాని పాల్పడ్డ వ్యక్తి మహ్మద్ హుసేన్ చెపుతున్నాడని తాహాసీల్దార్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
తహశీల్దార్‌పై దాడికి యత్నం
Published Fri, Apr 24 2015 9:38 PM | Last Updated on Sun, Sep 3 2017 12:49 AM
Advertisement
Advertisement