హైదరాబాద్, సత్తుపల్లి న్యూస్‌లైన్: ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయం నుంచి సోమవారం రాత్రి పరారైన 11 మంది ఖైదీలలో మొత్తం 9 మందిని పోలీసులు బుధవారం నాటికి పట్టుకోగలిగారు. మంగళవారం సాయంత్రం వరకు 8 మందిని అరెస్టు చేయగా.. బుధవారం ఖమ్మంజిల్లా సత్తుపల్లి మండలం కిష్టాపురంలో దారావత్ జీవరత్నం అనే మరో ఖైదీని అరెస్టు చేశారు. బుధవారం కృష్ణా ఎక్స్‌ప్రెస్ రైలులో వస్తున్నట్లు జీవరత్నం తన సోదరుడికి సమాచారం అందించడంతో.. విషయం తెలుసుకున్న సత్తుపల్లి పోలీసులు కిష్టాపురం వెళ్తుండగా జీవరత్నంను అదుపులోకి తీసుకున్నారు.