హైదరాబాద్ : ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయం నుంచి తప్పించుకున్న 11మందిలో ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గురు పరారీలో వున్నారు. పట్టుబడిన ఏడుగురిని పోలీసులు బుధవారం నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు. వారిపై పోలీసులు ఐపీసీ 224, 435, 427, 353 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
కాగా భార్యను ములాఖత్‌కు అనుమతించలేదన్న కోపంతో ఓ అండర్ ట్రయల్ ఖైదీ వేసిన పథకంతో ఆస్పత్రి నుంచి చికిత్స పొందుతున్న పదకొండుమంది నిన్న తెల్లవారుజామున పరారైన విషయం తెలిసిందే. ఈ ఘటనపై రెడ్ అలర్ట్ ప్రకటించిన పోలీసులు నిన్న సాయంత్రానికి ఏడుగురిని పట్టుకోగా... మిగతావారు ముంబైలో ఉన్నట్లు ఆధారాలు సేకరించారు. పరారీలో ఉన్ను ఖురేషీ, జీవరత్న, తిరుమలేష్ కోసం వేట ముమ్మరం చేశారు.