ఆత్మతృప్తినొంద అపరాధమది యేమి?
వైనుతోడ కాస్త వగపు దీరపాడు లోకులేమి పనిలేక వదరెదరు వైనుతేయుని మాట వలపు బాట
ఆత్మతృప్తి పొందడానికి ఒక్కొక్కరి మార్గం ఒక్కొక్కరిది. ‘బుడ్డి’మంతులకు మదిరాలయమే ఆత్మానంద కేంద్రం. మర్యాదస్తులతో, మందమతులతో నిండిన పాడు లోకం ‘మందు’మతులను అపార్థం చేసుకుంటుంది. వారిపై నోరు పారేసుకుంటుంది. అందుకేనేమో! విజ్ఞులు లోకులను పలుగాకులుగా అభివర్ణిస్తారు. ‘కుఛ్ తో లోగ్ కహేంగే.. లోగోంకా కామ్ హై కెహెనా..’ లోకుల్లో ప్రధానంగా రెండు రకాల మనుషులు ఉంటారు.
కొందరు తాగుబోతులు, మరికొందరు వాగుబోతులు. ఇంకొందరు ఉభయచర జీవుల్లాంటి తాగి వాగుబోతులు కూడా ఉంటారు. మధువు పట్ల నిబద్ధత గల ‘బుడ్డి’మంతులతో ఎలాంటి ఇబ్బంది లేదు గానీ, వాగుబోతులతోనే ఎక్కడలేని ఇక్కట్లు ఎదురవుతాయి. ఇక తాగి వాగుబోతులైతే, మధుశాలలోనే పురాణ కాలక్షేపం ప్రారంభించి, సాటి ‘మందు’మతులకు మనశ్శాంతి లేకుండా చేస్తారు. నిబద్ధులైన ‘బుడ్డి’మంతుల కోసం ఈ వారం..
‘మధు’రోక్తి
సామ్యవాదానికి, పెట్టుబడిదారీ విధానానికి నడుమ ఉన్నదే ‘మద్య’తరగతి
-నార్మన్ బ్రెన్నర్,అమెరికన్ నటుడు
సెలైంట్ పంచ్
వోడ్కా : 30 మి.లీ.
నిమ్మరసం : 30 మి.లీ.
నారింజరసం : 60 మి.లీ.
స్వీట్ అండ్ సోర్ : 60 మి.లీ.
సోడా : 60 మి.లీ.