Complacent
-
నిరాడంబరత అంటే..?
విజ్ఞానం... సాంకేతికాభివృద్ధి వల్ల మన భౌతికమైన సుఖాన్ని పెంచే వస్తువులు ఇబ్బడిముబ్బడి గా మనకి అందుబాటులోకి వచ్చాయి. మన అవసరాలు పెరుగుతున్నాయి. పెరిగిన కొద్దీ వాటిని సమకూర్చుకోగలిగే స్థాయిలో మన ఆదాయాన్ని పెంచుకోవలసి వస్తోంది. సాంకేతిక–రంగ నిపుణులు అందించే ఫలాలను తప్పనిసరిగా పొందాల్సిందే. ఇక్కడే మన ఔచితి వ్యక్తమవ్వాలి. ప్రాధాన్యతలను తెలుసుకోవాలి. అసలు అవసరముందో లేదో వివేచన చెయ్యాలి. ఇది పరిశీలించి అప్రమత్తులమైతే నిరాడంబరతకు దగ్గరగా ఉన్నట్టే. అసాధారణ ప్రతిభ చూపిన తరువాత వచ్చే ప్రశంసలకు చిరునవ్వుతో స్పందించటం నిరాడంబరత. అద్భుతమైన ప్రతిభను ఓ కవి తన గీతంలో గాని, గాయకుడు పాటలో గాని, నర్తకి తన నాట్యంలోగాని లేదా ఏ ఇతర లలిత కళల్లో గాని చూపినపుడు ప్రజలు హర్షధ్వానాలు చేసిన క్షణాన ఎగిరెగిరి పడకుండా ఉండటం నిరాడంబరుల లక్షణం. నిరాడంబరతలో ఉన్న అనేక కోణాలలో ఇక్కడ మనకు స్ఫురించవలసింది నిగర్వం. అసామాన్యులైనా సామాన్యులవలే వర్తించటం, అందరితో కలుపుగోలుగా ఉంటూ అరమరికలు లేకుండా మాట్లాడటం నిరాడంబరుల వ్యక్తిత్వంలోని ఒక పార్శ్వమే. వారి లోని విద్వత్తు గాని, అద్వితీయమైన కళానైపుణ్యాన్ని గాని, విశేషమైన ప్రజ్ఞను గాని ఎక్కడా అసందర్భంగా.. అనుచితంగా ప్రదర్శన చేయరు. వారి వైఖరి నిండుకుండే. అట్టహాసం.. హడావిడి. వెంపర్లాట లేకుండా ఉండటమే వీరి విశిష్టత. ఆడంబరం లేకపోవటమే నిరాడంబరం. నిరాడంబరత ఇహ ప్రపంచానికే కాక ఆంతరంగిక జగత్తుకు అవసరం. నిజానికి అత్యంత ఆవశ్యకం. ఎందుకు..? నిరాడంబరత్వాన్ని మాటల్లో.. చేతల్లో చూపించే వారెందరో ఉన్నారు. అది నిస్సందేహంగా మెచ్చుకోదగ్గ విషయమే. వీరికి మనస్సు లో కూడ అదే భావన ఉండాలి. మనస్సు ఆడంబరపుటూయలలూగరాదు. ఐహిక సుఖాల వైపు మొగ్గు చూపకూడదు. నిగ్రహశక్తి కావాలి. అపుడే అద్భుత సుఖజగత్తును త్రోసిరాజనగలం. దానిని గురించి ఎవరు మాట్లాడినా.. ఎన్ని ఆకర్షణలు చూపినా అణుమాత్రమైన చలించం. ఇవి సుఖాన్ని మాత్రమే ఇస్తాయి. వీటి ప్రభావం తాత్కాలికం. శాశ్వతమైన.. అలౌకిక ఆనందాన్నిచ్చే ఉన్నతమైన ఆలోచనాసీమలో మీ మనస్సు విహరిస్తున్న వేళ ఈ బాహ్యప్రపంచపు సుఖం గురించి చింతన ఉండనే ఉండదు. అవి పొందలేకపోతున్నామనే స్పృహే ఉండదు. ఈ స్థితిలో మాట.. చేత.. మనస్సు ఏకమై నిరాడంబరత గంభీర ప్రవాహమవుతుంది. ఆ స్థితికి చేరుకున్నవాళ్లు నిస్సందేహం గా మహానుభావులే. అందుకే నిరాడంబరత అలవడటం.. వ్యక్తిత్వంలో ఓ భాగమవ్వటం చాలా కష్టమైనదని పెద్దలంటారు. అయితే, అసాధ్యం కాదు. కాని ఎంతో సాధన చేస్తేగానీ పట్టుబడని విద్య. నిరాడంబర జీవితం.. ఉన్నత ఆలోచన అనే సిద్ధాంతాన్ని పథంగా తమ జీవితాన్ని పయనింపచేసుకున్నవారు అత్యంత నిరాడంబరులు. ఆదర్శప్రాయులు.. ప్రాతః స్మరణీయులు. నిరాడంబరత కొందరికి స్వాభావికం. కానికొందరికి అభ్యాసం వల్ల అలవడుతుంది. ఈ ప్రపంచంలో ప్రతిభావ్యుత్పత్తులు.. ప్రజ్ఞ... చాలామందిలో ఉండచ్చు. మనకన్నా ప్రతిభావంతులు ఉండచ్చు. జ్ఞానంలో.. నైపుణ్యంలో అత్యద్భుత శక్తి సామర్థ్యాలున్నవారు అనేకులు ఉండవచ్చు. ఇది మదిలో పెట్టుకోవాలి. ఈ నిరంతర స్ఫురణ మనల్ని నిరాడంబరులుగానే ఉంచుతుంది. అతిశయం.. ఆవేశ కావేశాలు.. అతి విశ్వాసం మనల్ని నిరాడంబరతకు దూరం చేస్తాయి. నిరాడంబరత్వం మన ఆహార్యానికీ వర్తిస్తుంది. మనం వేసుకునే దుస్తులు మన ఆలోచనా తీరును చెపుతాయి. సమయానికి.. సందర్భానికి ఏ రకమైన ఉడుపులు వేసుకోవాలో నేర్పుతాయి. ఎంత విలువైన దుస్తులు ధరిస్తే మనకంతటి విలువ అనుకునే వారందరూ ఆడంబరులే. శుభ్రమైన... సాధారణమైన దుస్తులు ధరించి కూడ గొప్ప వ్యక్తిత్వం, ప్రజ్ఞ కలవారు లోకంలో మన్నన పొందుతారు. గొప్ప విద్యావేత్త... మేధావి ఈశ్వర చంద్ర విద్యాసాగర్ సాధారణ దుస్తులు ధరించి తను ప్రసంగించవలసిన సభకు విచ్చేసినపుడు ఆయనకు జరిగిన అనుభవం... ఆయన దానికి స్పందించిన తీరు మనకందరకు తెలుసు. మనిషికి జ్ఞానం... ఉన్నతమైన వ్యక్తిత్వం ప్రధానం. వాటికే విలువివ్వాలి. నిరాడంబరులను చూస్తే కొంతమందికి చిన్న చూపు. ఒక రకమైన ఏవగింపు. వారు పిసినారులని, జీవితాన్ని, దానిలోని సుఖాన్ని అనుభవించటం తెలియదని ఆలోచన.. మితిమీరిన పొదుపు తో ఈ దేహాన్ని కష్టపెడతారని వారి భావన. నిజానికి వీరే నిరాడంబరతలోని అందాన్ని.. ఆనందాన్ని చూడలేక అలా విమర్శ చేస్తుంటారు. ఐహిక సుఖం అశాశ్వతమైనది. అస్థిరమైనది. చంచలమైనది. నిరాడంబరత ఇచ్చేది ఆనందం. ఇదే శాశ్వతమైనది.. నిజమైనది. మనకవసరమైన వాటినే ఉంచుకోవాలి. మనం ఉపయోగించని వస్తువులను అవసరార్థులకు ఇచ్చే అలవాటు చేసుకోవాలి. అనవసరంగా కొనే అలవాటు మానుకోవాలి. ఈ పొదుపరితనమే ఒకరకమైన నిరాడంబరత్వం. నిరాడంబరత అలవరచుకోవటం వల్ల మనం సమయాన్ని వృధా కానీయం. మనకెంతో సమయం మిగులుతుంది. దీన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. మన జీవనగమనాన్ని పరిశీలించి లోపాలను సరిదిద్దుకోవచ్చు. చేయతగ్గ మంచిపనులను చేసేందుకు సమయం కేటాయించవచ్చు. చావు పుట్టుకల చట్రం నుండి బయటపడే మార్గాన్ని అన్వేషించవచ్చు. మనలోని మానవీయతను మన జీవనం లో చూపి ఈ సృష్టిలో మనిషి సర్వోన్నతుడన్న గొప్పవారి మాటలను రుజువు చేయచ్చు. మానవుడు మహనీయుడు కాగలడని వెల్లడి చేయవచ్చు. లేనివారికి.. యోగ్యులైనవారికి మన శక్తిమేరకు దానం చేయవచ్చు. ఆపన్నులకు చేయూతనివ్వవచ్చు. నిరాడంబరతను అలవరచుకుంటే దానిలో నిబిడీకృతమైన ఐశ్వర్యాన్ని పొందవచ్చు. ఏమిటా ఐశ్వర్యం..!? పొదుపరితనం.. నిర్మలత్వం... పవిత్రత..« దార్మికత...అద్భుతమైన ఆత్మసంతృప్తి...ఉన్నత ఆలోచన... సాధన... సత్యశోధన ఇలా ఎన్నో ఎన్నెన్నో. పారమార్థిక దృష్టిలో మనమెంత నిరాడంబరులమైతే అంతటి ఐశ్వర్యవంతులం. ఎవరికి తృప్తి ఉంటుందో వారే ధనవంతులు. ఈ తృప్తికి.. అంతులేని సంపద కలిగి ఉండటానికి సంబంధమే లేదు. ఈ తృప్తి ఎలా వస్తుంది.. ఎవరికి ఉంటుంది? నిరాడంబరత వల్ల... ఆ విధమైన జీవితం గడపగలిగే వారికుంటుంది. అంటే సాదాసీదా జీవన శైలి. దీనివల్ల తృప్తి వస్తుంది. ఇదే మానసిక ప్రశాంతతనిస్తుంది. ఇది గొప్ప ఆనందస్థితి. దీన్ని సాధించటానికే యోగుల దగ్గర నుండి సామాన్యుల వరకూ ప్రయత్నం చేస్తూనే ఉంటారు... వారి వారి జీవిత నేపథ్యం.. ఆలోచనా విధానం... వారికి తోచిన మార్గాలననుసరించి. గమ్యాలు వేరు, కాని లక్ష్యం ఒకటే. – బొడ్డపాటి చంద్రశేఖర్, ఆంగ్లోపన్యాసకులు -
అందులోనే ఆత్మసంతృప్తి
దక్షిణాది అగ్ర కథానాయికలలో నటి సమంత ఒకరు.టాలీవుడ్ యువ నటుడు నాగచైతన్యను ప్రేమించి,త్వరలోనే ఆయనతో ఏడడగులు నడ వడానికి సిద్ధం అవుతున్న ఆ చెన్నై చంద్రం ప్రస్తుతం నటిగా కోలీవుడ్‌పైనే దృష్టి పెట్టినట్లున్నారు.ఆమెకు మూడు తమిళ చిత్రాలు చేతిలో ఉన్నాయి.తెలుగులో ఒక్క చిత్రం కూడా లేక పోవడం గమనార్హం.కాగా సమంతలో మరో కోణం కూడా ఉంది.అదే సామాజిక దృక్పధం.సమంత భావాలు చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటాయి కూడా. తన ప్రత్యూష ట్రస్ట్ ద్వారా పలు విధాలుగా సేవాకార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.తన సేవాకార్యక్రమాల గురించి సమంత స్పంధిస్తూ సామాజిక సేవలోనే ఆత్మసంతృప్తికి లభిసోందన్నారు.అందుకే తన సంపాధనలో ఒక భాగాన్ని పేద ప్రజలకు సాయం చేయాలని ఆశిస్తున్నానన్నారు. ప్రతి వ్యక్తి తను సంపాధనలో కొంత భాగాన్ని నిరుపేదలకు సాయం కోసం వెచ్చించాలన్నారు.సామాజిక సేవకు చాలా మంది ఉపక్రమిస్తున్నారనీ,అలాంటి వారిలో తన పేరు చోటు చేసుకోవడం సంతోషంగా ఉందనీ అన్నారు.సమాజంలో చాలా మంది సంపాధిస్తున్నారనీ,అందులో కొందరు కోట్లలో,మరి కొందరు లక్షల్లో గడిస్తున్నారనీ అన్నారు.ఆ సంపాదన అంతా తమకే సొంతం అనుకోవడం స్వార్ధం అవుతుందన్నారు.అలాంటి డబ్బుకు విలువ,గౌరవం ఉండదనీ పేర్కొన్నారు.అదే కొంత సంపాదనను ఇతరులకు సాయం చేస్తే అందులో ప్రజాక్షేమం, సంతోషం లభిస్తుందన్నారు. సమాజంలో చాలా మంది ప్రజలు కనీస సౌకర్యాలు కూడా లేకుండా కష్టపడుతున్నారన్నారు.అలాంటి వారిని ఆదుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.కోటి రూపాయలు సంసాధించి అంతా తనకే సొంతం అని భావించకుండా పేదలకు సాయం చేస్తేనే వారి సంసాదనకు మర్యాద ఉంటుందన్నారు.అలాంటి సాయంతో కలిగే సంతృప్తే వేరు అన్నారు.ఇతరులకు సాయం అందించడంలో సంతోషాన్ని తాను స్వయంగా అనుభవిస్తున్నానన్నారు.నిరు పేదల ఆకలి తీర్చడంలో కలిగే సంతోషం వేరెందులోనూ కలగదన్నారు.సామాజిక సేలలో తనకు ఆత్మసంతృప్తి కలగుతోందని ఇలాంటి సాయాలతో మన మీద మనకే గౌరవం పెరుగుతుందనీ చెన్నై చిన్నది సమంత అన్నారు. -
ఆత్మతృప్తినొంద అపరాధమది యేమి?
వైనుతోడ కాస్త వగపు దీరపాడు లోకులేమి పనిలేక వదరెదరు వైనుతేయుని మాట వలపు బాట ఆత్మతృప్తి పొందడానికి ఒక్కొక్కరి మార్గం ఒక్కొక్కరిది. ‘బుడ్డి’మంతులకు మదిరాలయమే ఆత్మానంద కేంద్రం. మర్యాదస్తులతో, మందమతులతో నిండిన పాడు లోకం ‘మందు’మతులను అపార్థం చేసుకుంటుంది. వారిపై నోరు పారేసుకుంటుంది. అందుకేనేమో! విజ్ఞులు లోకులను పలుగాకులుగా అభివర్ణిస్తారు. ‘కుఛ్ తో లోగ్ కహేంగే.. లోగోంకా కామ్ హై కెహెనా..’ లోకుల్లో ప్రధానంగా రెండు రకాల మనుషులు ఉంటారు. కొందరు తాగుబోతులు, మరికొందరు వాగుబోతులు. ఇంకొందరు ఉభయచర జీవుల్లాంటి తాగి వాగుబోతులు కూడా ఉంటారు. మధువు పట్ల నిబద్ధత గల ‘బుడ్డి’మంతులతో ఎలాంటి ఇబ్బంది లేదు గానీ, వాగుబోతులతోనే ఎక్కడలేని ఇక్కట్లు ఎదురవుతాయి. ఇక తాగి వాగుబోతులైతే, మధుశాలలోనే పురాణ కాలక్షేపం ప్రారంభించి, సాటి ‘మందు’మతులకు మనశ్శాంతి లేకుండా చేస్తారు. నిబద్ధులైన ‘బుడ్డి’మంతుల కోసం ఈ వారం.. ‘మధు’రోక్తి సామ్యవాదానికి, పెట్టుబడిదారీ విధానానికి నడుమ ఉన్నదే ‘మద్య’తరగతి -నార్మన్ బ్రెన్నర్,అమెరికన్ నటుడు సెలైంట్ పంచ్ వోడ్కా : 30 మి.లీ. నిమ్మరసం : 30 మి.లీ. నారింజరసం : 60 మి.లీ. స్వీట్ అండ్ సోర్ : 60 మి.లీ. సోడా : 60 మి.లీ. -
రోగుల సేవలో తరించే... నర్సింగ్
అప్‌కమింగ్ కెరీర్ ఆత్మసంతృప్తితోపాటు అధిక వేతనాన్ని ఇచ్చే పవిత్రమైన వృత్తి.. నర్సింగ్. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన రోగిని పగలు రాత్రి కనిపెట్టుకొని ఉండి, సొంత మనిషిలా సేవలు చేసి సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా మారిస్తే కలిగే ఆనందం వెలకట్టలేనిది. నర్సింగ్ కోర్సులను అభ్యసిస్తే దేశ విదేశాల్లో భారీగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కుతుండడం నేటి యువతను ఆకర్షిస్తోంది. అందుకే ఈ కెరీర్లో అడుగుపెట్టే వారి సంఖ్య పెరుగుతోంది. ⇒ కోర్సు చేస్తే కొలువు ఖాయం భారత్‌లో నర్సుల కొరత తీవ్రంగా ఉంది. అభివృద్ధి చెందిన యూరప్ దేశాల్లో ప్రతి 150 మందికి ఒక నర్సు అందుబాటులో ఉండగా మనదేశంలో 2250 మందికి ఒకరు మాత్రమే ఉండడం గమనార్హం. వృత్తిలో అనుభవం కలిగిన నర్సులకు అమెరికా, ఇంగ్లాండ్, ఐర్లాండ్, సౌదీ అరేబియా, సింగపూర్ లాంటి దేశాల్లో విపరీతమైన డిమాండ్ ఉంది. మనదేశంలో చాలామంది విద్యార్థులు నర్సింగ్ కోర్సులు పూర్తిచేసిన వెంటనే విమానం ఎక్కేస్తున్నారు. నర్సు అంటే సాధారణంగా మహిళలే గుర్తుకొస్తారు. కానీ, ఇటీవల యువకులు సైతం ఇందులోకి అడుగుపెడుతున్నారు. పురుషుల వార్డులు, ఓటీ, ఓపీడీ, ఆర్థోపెడిక్ కేర్, క్యాజువాల్టీ, ఎమర్జెన్సీ వార్డుల్లో పురుష నర్సుల సేవలకు డిమాండ్ పెరుగుతోంది. ⇒ విధులేంటి? నర్సుల ప్రధాన విధి రోగులను కనిపెట్టుకొని ఉండడం. అవసరమైన సేవలు అందించడం. వైద్యులు సిఫార్సు చేసిన మందులు, టీకాలను వేళకు ఇవ్వడం. రోగుల్లో వస్తున్న మానసిక, శారీరక మార్పులను పసిగట్టి డాక్టర్లకు సమాచారం అందజేయాల్సి ఉంటుంది. ఔషధాలకు, చికిత్సలకు రోగుల స్పందిస్తున్న తీరును పరిశీలించాలి. తదనుగుణంగా తగిన చర్యలు తీసుకోవాలి. ఈ రంగంలో సవాళ్లు కూడా ఉంటాయి. పగలు, రాత్రి పనిచేయాల్సి ఉంటుంది. నర్సింగ్ కోర్సు చేసిన వారికి వెంటనే ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో.. హాస్పిటల్స్, నర్సింగ్ హోమ్స్, క్లినిక్స్, రెడ్ క్రాస్ సొసైటీ, నర్సింగ్ కౌన్సిళ్లు వంటి వాటిలో ఉద్యోగాలు ఉంటాయి. ఆసక్తి ఉంటే నర్సింగ్ స్కూళ్లు, కాలేజీల్లో ఫ్యాకల్టీగా పనిచేయొచ్చు. ⇒ విదేశాల్లో అవకాశాలు అపారం ‘‘సానుకూల దృక్పథం, సేవ చేయాలనే ఆలోచన ఉన్నవారికి అనువైన కెరీర్.. నర్సింగ్. ఈ వృత్తి స్టడీ, వర్కింగ్ స్టయిల్ మిగిలిన వాటితో పోల్చితే పూర్తి విభిన్నం. దీంతో దీన్ని కెరీర్‌గా ఎంచుకునేందుకు గతంలో ఎక్కువమంది ఆసక్తి చూపలేదు. ఇప్పుడు పరిస్థితి మారింది. నర్సింగ్ పూర్తిచేసిన వారికి విదేశాల్లో భారీ వేతనాలు అందుతున్నాయి. రాబోయే రోజుల్లో ఇక్కడా బోలెడన్ని ఉద్యోగాలు వస్తాయి. ప్రారంభంలో తక్కువ జీతం అందినా.. మున్ముందు పదోన్నతులు, వేతనాలు పెరిగేందుకు స్కోప్ ఉన్న కెరీర్ నర్సింగ్. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి ఇది మరింత అనుకూలంగా ఉంటుంది’’ - ఒనిలాసాలిన్స్, ప్రిన్సిపల్, అపోలో నర్సింగ్ కళాశాల, హైదరాబాద్