అందులోనే ఆత్మసంతృప్తి
అందులోనే ఆత్మసంతృప్తి
Published Sun, Nov 27 2016 11:09 PM | Last Updated on Mon, Sep 4 2017 9:17 PM
దక్షిణాది అగ్ర కథానాయికలలో నటి సమంత ఒకరు.టాలీవుడ్ యువ నటుడు నాగచైతన్యను ప్రేమించి,త్వరలోనే ఆయనతో ఏడడగులు నడ వడానికి సిద్ధం అవుతున్న ఆ చెన్నై చంద్రం ప్రస్తుతం నటిగా కోలీవుడ్‌పైనే దృష్టి పెట్టినట్లున్నారు.ఆమెకు మూడు తమిళ చిత్రాలు చేతిలో ఉన్నాయి.తెలుగులో ఒక్క చిత్రం కూడా లేక పోవడం గమనార్హం.కాగా సమంతలో మరో కోణం కూడా ఉంది.అదే సామాజిక దృక్పధం.సమంత భావాలు చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటాయి కూడా. తన ప్రత్యూష ట్రస్ట్ ద్వారా పలు విధాలుగా సేవాకార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.తన సేవాకార్యక్రమాల గురించి సమంత స్పంధిస్తూ సామాజిక సేవలోనే ఆత్మసంతృప్తికి లభిసోందన్నారు.అందుకే తన సంపాధనలో ఒక భాగాన్ని పేద ప్రజలకు సాయం చేయాలని ఆశిస్తున్నానన్నారు.
ప్రతి వ్యక్తి తను సంపాధనలో కొంత భాగాన్ని నిరుపేదలకు సాయం కోసం వెచ్చించాలన్నారు.సామాజిక సేవకు చాలా మంది ఉపక్రమిస్తున్నారనీ,అలాంటి వారిలో తన పేరు చోటు చేసుకోవడం సంతోషంగా ఉందనీ అన్నారు.సమాజంలో చాలా మంది సంపాధిస్తున్నారనీ,అందులో కొందరు కోట్లలో,మరి కొందరు లక్షల్లో గడిస్తున్నారనీ అన్నారు.ఆ సంపాదన అంతా తమకే సొంతం అనుకోవడం స్వార్ధం అవుతుందన్నారు.అలాంటి డబ్బుకు విలువ,గౌరవం ఉండదనీ పేర్కొన్నారు.అదే కొంత సంపాదనను ఇతరులకు సాయం చేస్తే అందులో ప్రజాక్షేమం, సంతోషం లభిస్తుందన్నారు.
సమాజంలో చాలా మంది ప్రజలు కనీస సౌకర్యాలు కూడా లేకుండా కష్టపడుతున్నారన్నారు.అలాంటి వారిని ఆదుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.కోటి రూపాయలు సంసాధించి అంతా తనకే సొంతం అని భావించకుండా పేదలకు సాయం చేస్తేనే వారి సంసాదనకు మర్యాద ఉంటుందన్నారు.అలాంటి సాయంతో కలిగే సంతృప్తే వేరు అన్నారు.ఇతరులకు సాయం అందించడంలో సంతోషాన్ని తాను స్వయంగా అనుభవిస్తున్నానన్నారు.నిరు పేదల ఆకలి తీర్చడంలో కలిగే సంతోషం వేరెందులోనూ కలగదన్నారు.సామాజిక సేలలో తనకు ఆత్మసంతృప్తి కలగుతోందని ఇలాంటి సాయాలతో మన మీద మనకే గౌరవం పెరుగుతుందనీ చెన్నై చిన్నది సమంత అన్నారు.
Advertisement