
తాగుబోతుల స్వచ్ఛ హైదరాబాద్
నాంపల్లి: పీకల దాకా మద్యం సేవించి పోలీసులకు దొరికిపోయిన తాగుబోతులు మంగళవారం నీలోఫర్ ఆస్పత్రిని శుభ్రం చేశారు. గతవారం సౌత్‌జోన్ పరిధిలో పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన 24 మందికి మూడవ మెట్రో పాలిటన్ మెజిస్ట్రేట్ ఆంజనేయులు సామాజిక సేవ చేయాలంటూ వారికి శిక్ష విధించారు.
దీంతో ట్రాఫిక్ ఏసీపీ జైపాల్ పర్యవేక్షణలో 24 మంది మంగళవారం రెడ్‌హిల్స్‌లోని నీలోఫర్ ఆస్పత్రిలో చెత్తాచెదారాన్ని ఎత్తిపోశారు. ఆస్పత్రి ప్రాంగణాన్ని పరిశుభ్రంగా మార్చారు. తాగడం వలంల జరిగే అనర్థాలను తెలియజేయడానికి ఇలాంటి శిక్షలు ఎంతో దోహదపడతాయని ట్రాఫిక్ ఏసీపీ జైపాల్ అన్నారు.