
స్నేహితుడి భార్యపై అత్యాచారం
భాగ్యనగర్‌కాలనీ(హైదరాబాద్): స్నేహితుడి భార్యపై అత్యాచారం చేసిన ఇద్దరిపై పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. కూకట్‌పల్లి ఎస్‌ఐ సురేష్ తెలిపిన మేరకు.. కూకట్‌పల్లి శివాలయం సమీపంలో నివాసం ఉంటున్న ఓ మహిళ భర్త స్వగ్రామానికి వెళ్లాడు.
ఇది గమనించిన స్నేహితులు హమీద్, రాజయ్యలు ఇంట్లోకి వచ్చి అత్యాచారానికి పాల్పడ్డారు. ఊరి నుండి వచ్చిన తన భర్తకు జరిగిన విషయాన్ని తెలపడంతో కూకట్‌పల్లి పోలీసులను అశ్రయించారు. పోలీసులు బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని నిందితుల కోసం గాలిస్తున్నారు.