కాజల్ అనుమానస్పద మృతి.. ప్రియుడిపై అనుమానం | Live in Relationship Woman Kajal Suspicious Death Hanamkonda | Sakshi
Sakshi News home page

కాజల్ అనుమానస్పద మృతి.. ఆటో డ్రైవర్‌పై అనుమానం

Published Wed, Aug 9 2023 11:37 AM | Last Updated on Wed, Aug 9 2023 12:05 PM

Live in Relationship Woman Kajal Suspicious Death Hanamkonda - Sakshi

సాక్షి, వరంగల్‌: హనుమకొండ బొక్కలగడ్డలో యువతి కాజల్ అనుమానస్పద మృతి కలకలం సృష్టిస్తోంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన ఆందోళన కలిగిస్తోంది. ప్రియుడే హత్య చేసినట్లు  కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. 

ఆటో డ్రైవర్ అబ్బాస్ తో సహజీవనం చేసే యువతి కాజల్ జూలై 12న మృతి చెందగా కుటుంబసభ్యులు పూడ్చి పెట్టారు. ఆలస్యంగా మేల్కొన్న కాజల్ తల్లి షరనార్జన్ బిడ్డ మృతిపై అనుమానం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

విచారణ చేపట్టిన పోలీసులు 20 రోజుల క్రితం పూడ్చిపెట్టిన కాజల్ మృతదేహాన్ని వెలికితీసి ఫోరెన్సిక్ వైద్య బృందం, తహశీల్దార్ సమక్షంలో పోస్ట్ మార్టం నిర్వహించారు. పోస్టుమార్టం నివేదిక ప్రకారం చర్యలు చేపడతామని పోలీసులు తెలిపారు. 

కూలీ పనితో కుటుంబాన్ని పోషించుకునే కాజల్ ను అబ్బాస్ లోబర్చుకుని హత్య చేసి అనుమానం రాకుండా అనారోగ్యంతో మృతి చెందినట్లు నమ్మించాడని కాజల్ తల్లి ఆరోపించారు.
(చదవండి: బావా కలవాలని ఉంది.. అని మెసేజ్‌ పెట్టి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement