![రీ ఎంట్రీపై ఆలోచించలేదు](/styles/webp/s3/article_images/2017/09/3/81402052395_625x300.jpg.webp?itok=nW0r2Rdj)
రీ ఎంట్రీపై ఆలోచించలేదు
ప్రస్తుతం బాలీవుడ్లో రీ ఎంట్రీ సీజన్ నడుస్తోంది. శ్రీదేవి, మాధురి దీక్షిత్, ఐశ్వర్యారాయ్ లాంటి టాప్ హీరోయిన్స్ అందరూ లాంగ్ గ్యాప్ తరువాత తిరిగి కెమెరా ముందుకు వస్తున్నారు. అయితే ఇదే వరుసలో కపూర్ ఫ్యామిలీ బ్యూటీ కరిష్మా కూడా రీ ఎంట్రీకి రెడీ అవుతోందని భారీ ప్రచారమే జరిగింది. ఈ వార్తలను ఖండించింది కరిష్మా.
ఇప్పట్లో రీ ఎంట్రీ ఆలోచనే లేదంటూ తేల్చేసింది కరిష్మా. ప్రస్తుతం తన పిల్లలు సమీరా, కియాన్ రాజ్ కపూర్లు చాలా చిన్న వాళ్లని, తన ఆలోచనంతా వారి గురించే అని చెబుతోంది. సినిమా అయినా మరేదైనా తనకు పిల్లల తర్వాతే అంటోంది.
ఇటీవల ఇండస్ట్రీలో వస్తున్న మార్పులను గమనిస్తున్నానంటున్న కరిష్మా, ప్రస్తుతం టాప్ హీరోయిన్స్ చేస్తున్న తరహా లేడీ ఓరియంటెడ్ కథలు తన దగ్గరకు కూడా వచ్చాయని, అయితే ఇప్పట్లో రీ ఎంట్రీ ఇచ్చే ఆలోచన లేదు కనుక ఆ సినిమాలు అంగీకరించలేదని చెప్పింది.