![Aishwarya Rai Being Trolled For Kissing Daughter On Lips - Sakshi](/styles/webp/s3/article_images/2018/05/17/aiswarya.jpg.webp?itok=70jwtvW6)
ముంబై : సోషల్ మీడియా వేదికగా ఐశ్వర్యరాయ్‌పై ఘాటుగా స్పందిస్తున్నారు కొంతమంది నెటిజన్లు. మదర్స్ డే సందర్భంగా కూతురు ఆరాద్యను పెదాలపై ముద్దాడుతూ ఐశ్వర్యరాయ్ ఆ ఫోటోను ఇన్‌స్టాగ్రాంలో ఉంచిన విషయం తెలిసిందే. అయితే కూతురిని అలా పెదాలపై ముద్దాడటాన్ని నెటిజన్లు తప్పుబడుతున్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ సోషల్ మీడియా వేదికగా ఘాటుగా కామెంట్లు చేస్తున్నారు.
అలా పిల్లలను ముద్దాటం లైంగికంగా వేధించటమే అని, పెదాలపై ముద్దాడి భారతదేశ సాంప్రదాయాన్ని చెడగొడుతున్నారని కొందరు స్పందిచగా. 5-6 సంవత్సరాల పిల్లలను బలవంతంగా ముద్దు పెట్టుకోవటం నేరమని మరి కొందరు స్పందించారు. కొందరైతే హద్దులు దాటి ‘‘చిన్న పిల్లలతో సెక్స్ మంచిది కాదని, లెస్బియన్స్’’ అంటూ స్సందించారు. ఇన్‌స్టాగ్రాంలో చేరిన వారంలోనే ఈ రకమైన స్పందన రావటం ఐశ్వర్యరాయ్‌కి ఓ చేదు అనుభవమే.
ఐశ్వర్యరాయ్ అభిమానులు మాత్రం తల్లి తన కూతుర్ని అలా పెదాలపై ముద్దాడటంలో తప్పేమిలేదంటున్నారు. తల్లి ప్రేమలో కూడా బూతును వెతుకుతున్న వారిని ఏం చేసినా పాపం లేదంటున్నారు. స్వేచ్ఛ ఉంది కదా అని ఇష్టమొచ్చినట్లు కామెంట్లు చేయటం సరికాదని హితవు పలుకుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment