lip kiss
-
సోషల్ మీడియా వేదికగా ఐశ్వర్యరాయ్‌పై..
ముంబై : సోషల్ మీడియా వేదికగా ఐశ్వర్యరాయ్‌పై ఘాటుగా స్పందిస్తున్నారు కొంతమంది నెటిజన్లు. మదర్స్ డే సందర్భంగా కూతురు ఆరాద్యను పెదాలపై ముద్దాడుతూ ఐశ్వర్యరాయ్ ఆ ఫోటోను ఇన్‌స్టాగ్రాంలో ఉంచిన విషయం తెలిసిందే. అయితే కూతురిని అలా పెదాలపై ముద్దాడటాన్ని నెటిజన్లు తప్పుబడుతున్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ సోషల్ మీడియా వేదికగా ఘాటుగా కామెంట్లు చేస్తున్నారు. అలా పిల్లలను ముద్దాటం లైంగికంగా వేధించటమే అని, పెదాలపై ముద్దాడి భారతదేశ సాంప్రదాయాన్ని చెడగొడుతున్నారని కొందరు స్పందిచగా. 5-6 సంవత్సరాల పిల్లలను బలవంతంగా ముద్దు పెట్టుకోవటం నేరమని మరి కొందరు స్పందించారు. కొందరైతే హద్దులు దాటి ‘‘చిన్న పిల్లలతో సెక్స్ మంచిది కాదని, లెస్బియన్స్’’ అంటూ స్సందించారు. ఇన్‌స్టాగ్రాంలో చేరిన వారంలోనే ఈ రకమైన స్పందన రావటం ఐశ్వర్యరాయ్‌కి ఓ చేదు అనుభవమే. ఐశ్వర్యరాయ్ అభిమానులు మాత్రం తల్లి తన కూతుర్ని అలా పెదాలపై ముద్దాడటంలో తప్పేమిలేదంటున్నారు. తల్లి ప్రేమలో కూడా బూతును వెతుకుతున్న వారిని ఏం చేసినా పాపం లేదంటున్నారు. స్వేచ్ఛ ఉంది కదా అని ఇష్టమొచ్చినట్లు కామెంట్లు చేయటం సరికాదని హితవు పలుకుతున్నారు. -
కొత్త కోడలిపై మామ వికృతచర్య.. విమర్శలు
బీజింగ్: కోడలిని కూతురిలా చూసుకోవాల్సిన ఓ మామ కుమారుడి వివాహ రిసెప్షన్లో చేసిన వికృత చేష్టపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అతడికి బుద్ధి జ్ఞానం లేదా, వావి వరుసలు లేవా అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన ఇటీవల చైనాలో చోటుచేసుకుంది. తూర్పు చైనా జియాంగ్జౌ ప్రావిన్స్‌లో ఇటీవల ఓ యువ జంట వివాహం చేసుకుంది. యాంచెంగ్‌లోని వుజౌ అంతర్జాతీయ ఫంక్షన్ హాలులో రిసెప్షన్ నిర్వహించారు. వరుడి తండ్రి తన కొత్త కోడలంటూ అందరికీ కుమారుడి భార్యను పరిచయం చేస్తున్నాడు. అంతలోనే ఏమైందో తెలియదు కానీ, కుమారుడు, బంధువుల ఎదుటే కొత్త కోడలితో వికృతంగా ప్రవర్తించాడు. బలవంతంగా ఆమెను పట్టుకుని పెదాలను ముద్దాడాడు. ఆమె వద్దూ అంటూ దూరం జరుపుతున్నా ఆ పెద్దాయన మాత్రం విచిత్రంగా ప్రవర్తించాడు. దీంతో వధువు బంధువులు, స్నేహితులు వరుడి కుటుంబంతో గొడవకు దిగారు. కొందరు పెద్దలు సర్దిచెప్పగా ఎలాగోలా చివరికి గొడవ సద్దుమణిగింది. కానీ కోడలితో ఆ పెద్దాయన వికృతంగా ప్రవర్తిస్తున్నప్పుడు ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతోంది. కుమారుడి భార్యను కూతురిగా చూసుకోవాలంటూ నెటిజన్లు ఆ పెద్దాయనకు గడ్డి పెడుతున్నారు. మరికొందరు మాత్రం తాగిన మత్తులో ఉన్నా.. ఎవరితో ఉన్నాం, ఏం చేస్తున్నామన్న సోయిలేకుండా ప్రవర్తించిన పెద్దాయనకి బుద్ధి చెప్పాలని కామెంట్ చేస్తున్నారు. -
ముద్దుతో ఇన్ని లాభాలంటే వద్దంటారా..!
సినిమాలో లిప్ లాక్ ఉందంటే చాలు.. ఆ మూవీపై టాక్ పెరిగిపోతుంది. అందరి దృష్టిని లిప్ లాక్ అనే పదం ఆకర్షిస్తుంది. కానీ లిప్ లాక్, లేక మామూలు చుంబనం వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని ఎన్నో రీసెర్చ్ లలో తేలింది. ఈ ముద్దుల వల్ల గుండెకు, ఊపిరితిత్తులకే కాదు ఓవరాల్ గా మన ఆరోగ్యానికి ఎంతో తోడ్పడుతుందన్న విషయం తెలిసిందే. ఈ విషయం తెలిసే ఇటీవల ‘కిసెంజర్’ అనే పరికరాన్ని లండన్ లోని సిటీ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు రూపొందించారు. ఎదుటివారికి ఫోన్ ద్వారా ఈ పరికరంతో ముద్దు పంపితే.. అవతలి వ్యక్తి అదే అనుభూతిని పొందుతారు. లిప్ కిస్/కిస్ వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే.. లిప్ కిస్ మనల్ని ఒత్తిడిని దూరం చేస్తుంది. ముద్దు పెట్టుకునేటప్పుడు ఆక్సిటోసిన్ హార్మోన్ విడుదలయి మనసును ఎంతో ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది. ఎండార్ఫిన్ హార్మోన్ అయితే మంచి అనుభూతిని ఇస్తుంది. కేలరీలను కరిగిస్తుంది. ఒక నిమిషం పాటు గాఢంగా చుంబిస్తే 26 కేలరీలు కరుగుతాయి. కొవ్వును తగ్గించడంతో పాటుగా బీపీని నియంత్రిస్తుంది. గుండెకు రక్తప్రసరణ బాగా జరిగేందుకు ముద్దు దోహదం చేస్తుంది. తలనొప్పి లాంటి సమస్య నుంచి కాస్త ఉపశమనం లభిస్తుంది లిప్ కిస్ చేయాలంటే 34 ముఖ కండరాలు కదలాల్సిందే. వీటి కదలికలతో ముఖంపై చర్మానికి ఎక్సర్ సైజ్ అవుతుంది శ్వాసక్రియకు సంబంధించిన సమస్యలను దూరం చేస్తుంది. దంతాలకు మేలు చేస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. మనలో పునరుత్తేజాన్ని కలిగిస్తుంది. భాగస్వామితో ఎలాంటి కలహాలు లేకుండా సంసారం సాఫీగా సాగేందుకు దోహదం చేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచడంలో ప్రధాన పోత్ర పోషిస్తుంది ప్రతిరోజు ఉదయం ముద్దుపెట్టుకునే వారి ఆయుష్షు మరో ఐదేళ్లు పెరిగే అవకాశాలున్నాయని గతంలో కొందరు నిపుణులు తెలిపారు. -
ఈ ముద్దు చాలా ముఖ్యం!
అది మలేసియాలోని ఓ అందమైన ప్రదేశం. అక్కడ హిందీ చిత్రం ‘దో లఫ్జోంకీ కహానీ’ షూటింగ్ జరుగుతోంది. హీరో, హీరోయిన్లు రణ్‌దీప్ హుడా, కాజల్ అగర్వాల్‌ల మధ్య ఆ రోజు మంచి రొమాంటిక్ సీన్ ప్లాన్ చేశారు దర్శకుడు దీపక్ తిజోరి. రొమాంటిక్ సీన్ తీస్తారని కాజల్‌కి తెలుసు కానీ, అది ఏ రేంజ్ రొమాన్సో మాత్రం ఆమెకు తెలియదట. అందుకే డెరైక్టర్ ‘యాక్షన్’ అనగానే రణ్‌దీప్ హుడా సడన్‌గా తన ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని లిప్ లాక్ ఇవ్వగానే కాజల్ కంగారు పడిపోయారు. ఎర్రబారిన మొహంతో కాసేపు షాక్‌లో ఉండిపోయారు. రణదీప్ కిస్ ఇవ్వగానే కాజల్ బిగుసుకుపోవడంతో సీన్ కూడా సరిగ్గా రాలేదు. మళ్లీ టేక్ అంటే కాజల్ ఏమంటుందోనని కథలో ముద్దు సీన్‌కి ఉన్న ప్రాధాన్యాన్ని ఆమెకు దర్శకుడు వివరించారట. మొత్తం విన్నాక, ఫ్రెష్‌గా రీటేక్ చేద్దామని కాజల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. ‘‘కాజల్ మొదటి నుంచి దక్షిణాది పరి శ్రమలో టాప్ స్టార్. సడన్‌గా హిందీలో లిప్ లాక్ సీన్లలో నటిస్తే తన ఇమేజ్‌కు భంగం కలుగుతుందని ఆమె భయం. అందుకే సినిమా కథ విన్నప్పుడే ముద్దు సీన్లలో నటించనని కండిషన్ కూడా పెట్టారు. కానీ, లొకేషన్లో ఈ లవ్ స్టోరీకి కిస్సింగ్ సీన్ ఎంత టర్నింగ్ పాయింటో చెప్పేసరికి ఒప్పుకున్నారు’’ అని దర్శకుడు అన్నారు. సౌత్‌లో కాజల్ అగర్వాల్ ఇప్పటివరకూ పర్ఫెక్ట్ లిప్‌లాక్ సీన్లో నటించనేలేదు. ‘ఆర్య-2’, బిజినె స్ మ్యాన్ ’ సినిమాల్లో లిప్ కిస్ సీన్లు చేసినా అవి అంత ఘాటు ముద్దులు కావు.సో... మూడో హిందీ సినిమాకే కాజల్ అగర్వాల్ అదిరేటి ముద్దుతో వెండితెరను వేడెక్కించడానికి సిద్ధమవుతున్నారన్నమట! -
డాలర్స్ కాలనీ న్యూ మూవీ స్టిల్స్
-
ము.. ముద్దంటే చేదే..!
-
ప్రిన్స్ లిప్‌కిస్...
తెలుగులో లిప్‌కిస్‌లు సర్వసాధారణమైపోతున్నాయి. ‘డాలర్స్ కాలనీ’ సినిమా కోసం ఇటీవలే హీరో హీరోయిన్లు ప్రిన్స్, నిఖితా పవార్‌పై లిప్‌కిస్ చిత్రీకరించారు. శ్రీ చంద్ ముల్లా దర్శకత్వంలో ఎస్. రత్నమయ్య, టి. గణపతిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికి 70 శాతం షూటింగ్ పూర్తయిందని, ఈ నెలాఖరుకల్లా మిగిలిన పని పూర్తి చేసి, మే చివరి వారంలో చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాతలు తెలిపారు. ఇది రొమాంటిక్ హారర్ చిత్రమని, ప్రిన్స్ కొత్తలుక్‌తో కనిపిస్తారని దర్శకుడు పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: మల్లిక్ ఎమ్.వి.కె., కెమెరా: ఎ.సుధాకర్‌రెడ్డి.