కొత్త కోడలిపై మామ వికృతచర్య.. విమర్శలు | Father In Law Was Trolled Who Kisses His daughter in law | Sakshi
Sakshi News home page

కొత్త కోడలిపై మామ వికృతచర్య.. విమర్శలు

Published Fri, Mar 2 2018 1:15 PM | Last Updated on Thu, Aug 16 2018 4:36 PM

Father In Law Was Trolled Who Kisses His daughter in law - Sakshi

బీజింగ్: కోడలిని కూతురిలా చూసుకోవాల్సిన ఓ మామ కుమారుడి వివాహ రిసెప్షన్‌లో చేసిన వికృత చేష్టపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అతడికి బుద్ధి జ్ఞానం లేదా, వావి వరుసలు లేవా అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన ఇటీవల చైనాలో చోటుచేసుకుంది.

తూర్పు చైనా జియాంగ్జౌ ప్రావిన్స్‌లో ఇటీవల ఓ యువ జంట వివాహం చేసుకుంది. యాంచెంగ్‌లోని వుజౌ అంతర్జాతీయ ఫంక్షన్‌ హాలులో రిసెప్షన్‌ నిర్వహించారు. వరుడి తండ్రి తన కొత్త కోడలంటూ అందరికీ కుమారుడి భార్యను పరిచయం చేస్తున్నాడు. అంతలోనే ఏమైందో తెలియదు కానీ, కుమారుడు, బంధువుల ఎదుటే కొత్త కోడలితో వికృతంగా ప్రవర్తించాడు. బలవంతంగా ఆమెను పట్టుకుని పెదాలను ముద్దాడాడు. ఆమె వద్దూ అంటూ దూరం జరుపుతున్నా ఆ పెద్దాయన మాత్రం విచిత్రంగా ప్రవర్తించాడు. దీంతో వధువు బంధువులు, స్నేహితులు వరుడి కుటుంబంతో గొడవకు దిగారు.

కొందరు పెద్దలు సర్దిచెప్పగా ఎలాగోలా చివరికి గొడవ సద్దుమణిగింది. కానీ కోడలితో ఆ పెద్దాయన వికృతంగా ప్రవర్తిస్తున్నప్పుడు ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతోంది. కుమారుడి భార్యను కూతురిగా చూసుకోవాలంటూ నెటిజన్లు ఆ పెద్దాయనకు గడ్డి పెడుతున్నారు. మరికొందరు మాత్రం తాగిన మత్తులో ఉన్నా.. ఎవరితో ఉన్నాం, ఏం చేస్తున్నామన్న సోయిలేకుండా ప్రవర్తించిన పెద్దాయనకి బుద్ధి చెప్పాలని కామెంట్ చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement