బ్రేక్ బదులు యాక్సిలేటర్ తొక్కడంతో షాపింగ్ మాల్ లోకి దూసుకెళ్లిన కారు
బీజింగ్ : ఒళ్లు గగుర్పొడిచే ప్రమాదం ఒకటి చైనాలో చోటు చేసుకుంది. అనూహ్యంగా ఓ షాపింగ్ కాంప్లెక్స్‌లోకి దూసుకొచ్చిన కారు అక్కడి వారి గుండెలు ఆగిపోయేలా చేసింది. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. వివరాల్లోకి వెళితే చైనాలోని రోడ్డు పక్కనే ఓ అద్దాల హోటల్ ఉంది. అందులోకి కొంతమంది అప్పుడే ప్రవేశిస్తున్నారు. ఆ సమయంలోనే అనుకోని విధంగా వారివైపు వేగంగా ఓ కారు దూసుకొచ్చిందిస్తోంది. దీంతో కొంతమంది హోటల్ లోపలికి ప్రవేశించగా.. మరికొందరు బయటకు పరుగెత్తారు.
అయినప్పటికీ కొద్ది క్షణాల్లో వేగంగా దూసుకొచ్చిన కారు హోటల్ అద్దాలను బలంగా ఢీకొట్టింది. కారు ఎవరినీ నేరుగా ఢీకొట్టనప్పటికీ ఆ ప్రమాదంలో దెబ్బతిన్న మెటల్ డిటెక్టర్ ఒకటి ఓ మహిళపై పడి గాయాల పాలయింది. ఈ ఘటన చైనాలో ఈ నెల 6న చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అయింది. ఇంతకీ విషయం ఏమిటంటే బ్రేక్ వెయ్యబోయిన ఆ కారు డ్రైవర్ యాక్సిలేటర్ తొక్కడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment