బస్పును నడుపుతున్న పెళ్లి కూతురు
బీజింగ్ : సాధరణంగా మన దేశంలో వివాహ సమయంలో పెళ్లి కూతురిను ప్రత్యేకంగా మండపానికి తీసుకోస్తారు. కొన్ని చోట్ల బుట్టలో కూర్చోబెట్టి తీసుకువస్తే మరికొన్ని చోట్ల గుర్రంపై కూర్చొబెట్టి ఊరేగింపుగా తీసుకొస్తారు. కానీ చైనాకు చెందిన ఓ పెళ్లి కూతురు మాత్రం ఇలా కాకుండా కాస్తా వెరైటీగా పెళ్లి మండపానికి వచ్చింది. ఏంటా వెరైటీ అంటే...పెళ్లి కూతురు స్వయంగా బస్సును నడుపుతూ మండపానికి రావడమే కాక దారిలో పెళ్లి కొడుకును కూడా పికప్ చేసుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తుంది.
ఈ వీడియోలో రంగురంగుల బెలూన్లతో, ‘హాపీ కపూల్’ అని రాసి వున్న బస్సులో పెళ్లి కూతురు డ్రైవర్ స్థానంలో కూర్చుని ఉంది. అందమైన తెల్లని పెళ్లి గౌను ధరించి, దర్జాగా డ్రైవర్ స్థానంలో కూర్చుని బస్సును నడుపుతుండగా, ఆమె పక్కనే చేతిలో పూల బొకేను పట్టుకుని పెళ్లి కుమారుడు కుర్చుని ఉన్నాడు. ఈ విషయం గురించి పెళ్లి కూతురు ‘నా పెళ్లి వేడుక పర్యావరణహితంగా జరగాలనుకున్నాను. అందుకే కారుకు బదులు బస్సులో వివాహ వేదిక వద్దకు చేరుకోవాలని అనుకున్నాను. ఎందుకంటే బస్సు తక్కువ కార్బన్ డై ఆక్సైడ్‌ను విడుదల చేస్తుందని తెలిపింది. మరో ఆసక్తికర అంశం ఏంటంటే ఈ పెళ్లి కూతురు స్వయంగా బస్సు డ్రైవర్ మాత్రమే కాక..ఆమె నడిపిన బస్సుకు స్వయంగా యజమాని కూడా ఆమె. ఈ వీడియో చూసిన నెటిజన్లు పెళ్లి కూతురు ఐడియాను తెగ పొగుడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment