అది మలేసియాలోని ఓ అందమైన ప్రదేశం. అక్కడ హిందీ చిత్రం ‘దో లఫ్జోంకీ కహానీ’ షూటింగ్ జరుగుతోంది. హీరో, హీరోయిన్లు రణ్‌దీప్ హుడా,
అది మలేసియాలోని ఓ అందమైన ప్రదేశం. అక్కడ హిందీ చిత్రం ‘దో లఫ్జోంకీ కహానీ’ షూటింగ్ జరుగుతోంది. హీరో, హీరోయిన్లు రణ్‌దీప్ హుడా, కాజల్ అగర్వాల్‌ల మధ్య ఆ రోజు మంచి రొమాంటిక్ సీన్ ప్లాన్ చేశారు దర్శకుడు దీపక్ తిజోరి. రొమాంటిక్ సీన్ తీస్తారని కాజల్‌కి తెలుసు కానీ, అది ఏ రేంజ్ రొమాన్సో మాత్రం ఆమెకు తెలియదట. అందుకే డెరైక్టర్ ‘యాక్షన్’ అనగానే రణ్‌దీప్ హుడా సడన్‌గా తన ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని లిప్ లాక్ ఇవ్వగానే కాజల్ కంగారు పడిపోయారు.
ఎర్రబారిన మొహంతో కాసేపు షాక్‌లో ఉండిపోయారు. రణదీప్ కిస్ ఇవ్వగానే కాజల్ బిగుసుకుపోవడంతో సీన్ కూడా సరిగ్గా రాలేదు. మళ్లీ టేక్ అంటే కాజల్ ఏమంటుందోనని కథలో ముద్దు సీన్‌కి ఉన్న ప్రాధాన్యాన్ని ఆమెకు దర్శకుడు వివరించారట. మొత్తం విన్నాక, ఫ్రెష్‌గా రీటేక్ చేద్దామని కాజల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. ‘‘కాజల్ మొదటి నుంచి దక్షిణాది పరి శ్రమలో టాప్ స్టార్. సడన్‌గా హిందీలో లిప్ లాక్ సీన్లలో నటిస్తే తన ఇమేజ్‌కు భంగం కలుగుతుందని ఆమె భయం.
అందుకే సినిమా కథ విన్నప్పుడే ముద్దు సీన్లలో నటించనని కండిషన్ కూడా పెట్టారు. కానీ, లొకేషన్‌లో ఈ లవ్ స్టోరీకి కిస్సింగ్ సీన్ ఎంత టర్నింగ్ పాయింటో చెప్పేసరికి ఒప్పుకున్నారు’’ అని దర్శకుడు అన్నారు. సౌత్‌లో కాజల్ అగర్వాల్ ఇప్పటివరకూ పర్ఫెక్ట్ లిప్‌లాక్ సీన్‌లో నటించనేలేదు. ‘ఆర్య-2’, బిజినె స్ మ్యాన్ ’ సినిమాల్లో లిప్ కిస్ సీన్లు చేసినా అవి అంత ఘాటు ముద్దులు కావు.సో... మూడో హిందీ సినిమాకే కాజల్ అగర్వాల్ అదిరేటి ముద్దుతో వెండితెరను వేడెక్కించడానికి సిద్ధమవుతున్నారన్నమట!