aradhya bachchan
-
ఐశ్వర్య- అభిషేక్ విడాకుల రూమర్స్.. ఆ వీడియోలతో చెక్ పెట్టిన దంపతులు!
సినీ సెలబ్రిటీలపై రూమర్స్ రావడం ఈ రోజుల్లో అయితే సర్వసాధారణమైపోయింది. ముఖ్యంగా డేటింగ్, డివోర్స్ గురించి ఎక్కువగా వింటుంటాం. ఈ సోషల్ మీడియా యుగంలో రూమర్స్ రాకెట్ వేగంతో నెట్టింట వైరలవుతున్నాయి. అలా గత కొన్ని నెలలుగా పలువురు సినీతారలపై కూడా ఏదో ఒక సందర్భంలో రూమర్స్ వస్తూనే ఉన్నాయి. అలా ఈ ఏడాది ప్రముఖ బాలీవుడ్ జంట ఐశ్వర్వరాయ్- అభిషేక్ బచ్చన్ కూడా ఒకరు.వీరిద్దరిపై గత కొన్ని నెలలుగా విడాకులు తీసుకోబోతున్నారంటూ వార్తలొచ్చాయి. పెళ్లి, బర్త్ డే వేడుకల్లో ఐశ్వర్య సింగిల్‌గా కనిపించడంతో అవీ మరింత బలపడ్డాయి. కానీ వాటిపై ఇప్పటివరకు ఎవరూ కూడా స్పందించలేదు. తమపై వస్తున్న రూమర్స్‌పై క్లారిటీ కూడా ఇవ్వలేదు.అయితే గతనెల ఐశ్వర్యరాయ్- అభిషేక్ బచ్చన్ ముద్దుల కూతురు 13వ బర్త్ డే సెలబ్రేట్ చేసుకుంది. ఈ పార్టీలో ఆమె తండ్రి అభిషేక్ బచ్చన్ కూడా హాజరయ్యారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. అయితే ఈ పార్టీకి డెకరేషన్ చేసిన జతిన్, నీలంలకు కృతజ్ఞతలు చెబుతూ కనిపించార ఐశ్వర్య-అభిషేక్. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరలవుతోంది. ఆరాధ్య పుట్టిన రోజు వేడుకలో అభిషేక్ కనిపించడంతో వీరిద్దరి విడాకుల వార్తలకు ఇక చెక్ పడినట్లైంది. కాగా.. అభిషేక్ ఇటీవల ఐ వాంట్ టు టాక్ అనే చిత్రంలో కనిపించారు.భార్య మాట వినాలంటూ సలహా..తాజాగా ఫిల్మ్‌ఫేర్ ఓటీటీ అవార్డుల ఈవెంట్‌కు హాజరైన అభిషేక్ బచ్చన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. పెళ్లి చేసుకున్న పురుషులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. పెళ్లి అయిన ప్రతి వ్యక్తి తన భార్య మాటే వినాలని గుర్తు చేశారు. ఇంట్లో నేను ఇదే ఫార్ములా వాడుతుంటా.. నా భార్య ఏం చెప్పినా వింటా అంటూ ముంబయిలో జరిగిన ఓటీటీ అవార్డుల కార్యక్రమంలో సరదాగా కామెంట్స్ చేశారు.అంతేకాకుండా తన కూతురు ఆరాధ్యను సంతోషంగా పెంచినందుకు ఐశ్వర్యకు అభిషేక్ ధన్యవాదాలు తెలిపారు. నేను బయటకు వెళ్లి సినిమాలు చేయడం కూడా నా అదృష్టం.. ఎందుకంటే ఆరాధ్యతో పాటు ఇంట్లోనే ఉండి ఐశ్వర్య చూసుకుంటుందని నాకు తెలుసని అన్నారు. ఈ విషయంలో ఐశ్వర్యకు నా కృతజ్ఞతలు.. మన పిల్లలు ఎప్పటికీ మనల్ని వారి జీవితంలో మొదటి వ్యక్తిగానే చూస్తారని అభిషేక్ తెలిపారు. View this post on Instagram A post shared by Play Time - Jatin Bhimani (@playtimeindia) View this post on Instagram A post shared by Play Time - Jatin Bhimani (@playtimeindia) -
ఇంట్లో కూర్చొని కెరీర్ నాశనం చేసుకుంటున్నావ్
అందమే అసూయపడేంత సొగసు హీరోయిన్ ఐశ్యర్యరాయ్ సొంతం. 1994లో ప్రపంచ సుందరి పోటీల్లో కీరీటాన్ని పొందిన ఐశ్వర్యరాయ్‌ని ఆ తరువాత సినీ అవకాశాలు వరించాయి. దర్శకుడు మణిరత్నం ఇరువర్ చిత్రం ద్వారా ఈమెను కథానాయికగా పరిచయం చేశారు. ఆ చిత్రం విజయంతో ఐశ్వర్యరాయ్‌కు అవకాశాలు వరుసకట్టాయి. అలా హిందీ, తమిళం, బెంగాలీ, ఆంగ్లం భాషల్లో పలు చిత్రాల్లో నటించి బహుళ ప్రాచుర్యం పొందారు. పులి కడుపున పిల్లి పడుతుందా? అగ్ర కథానాయికగా కొనసాగుతున్న సమయంలోనే బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ వారసుడు, నటుడు అభిషేక్ బచ్చన్‌ను పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లి 2007లో జరిగింది. ఈ క్రేజీ జంటకు ఆరాధ్య అనే కూతురు పుట్టింది. ఇప్పుడు అసలు విషయం ఈ అమ్మాయి గురించే. పులి కడుపున పిల్లి పుడుతుందా? అన్న సామెతలా అందానికి పుట్టిన చంద్రం ఈ ఆరాధ్య. ఈ చిన్నారికి పట్టుమని 15 ఏళ్లు కూడా లేవు. అంబానీ పెళ్లిలో హైలైట్ అయితే అచ్చం తల్లి అందాలను పుణికి పుచ్చుకుంది. మొన్నటి వరకూ చిట్టి చిన్నారిగా కనిపించిన ఆరాధ్య ఇప్పుడు యవ్వనవతిగా మారింది. ఈ చిన్నదాని ఫొటో చూస్తుంటే అలానే అనిపిస్తోంది. ఇటీవల ప్రముఖ పారిశ్రామిక వేత్త అంబానీ కొడుకు వివాహ వేడుకకు ఆరాధ్య తన తల్లితో పాటు హాజరై అందరి కంట్లో పడింది. ఆ తరువాత ఐశ్వర్య తన తండ్రి కృష్ణరాజ్‌ను స్మరించుకుంటూ ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేసిన ఫోటోల్లోనూ ఆరాధ్య చిరునవ్వుతో దర్శనమిచ్చింది. కెరీర్ నాశనం చేసుకుంటున్నావ్ ఈ ఫోటోల్లో తల్లిలానే ఆరాధ్య కూడా అందంగా ఉందంటూ నెటిజన్లు పొగుడుతున్నారు. ఓ వ్యక్తి మాత్రం ఐశ్వర్యను తిట్టిపోశాడు. నువ్వు ఇంట్లో కూర్చోని కెరీర్ నాశనం చేసుకుంటున్నావు.. మాలాంటి అభిమానులను అసలు పట్టించుకోవడం లేదని ఫైర్ అయ్యాడు. ఇది చూసిన ఇతర అభిమానులు మొన్నే కదా పొన్నియన్ సెల్వన్‌లో యాక్ట్ చేసింది.. అయినా తన జీవితం.. తనిష్టం.. ఎప్పుడెలా మాట్లాడాలో తెలీదా అని సదరు నెటిజన్ను ఏకిపారేస్తున్నారు. View this post on Instagram A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) చదవండి: మా అక్కను కాపాడండి.. మరోసారి సాయం కోరిన హీరోయిన్ సోదరి -
మరోసారి తెరపైకి స్టార్ కపుల్ విడాకుల రూమర్స్.. అసలేం జరుగుతోంది!
బాలీవుడ్లో మోస్ట్ బ్యూటీఫుల్ జంటల్లో అభిషేక్ బచ్చన్- ఐశ్వర్య రాయ్ ఒకరు. ఇండస్ట్రీలో అమితాబ్ ఫ్యామిలీకి మంచి గుర్తింపు ఉంది. గతంలో ప్రపంచ సుందరి టైటిల్ గెలుచుకున్న ఐశ్వర్యరాయ్ బాలీవుడ్ స్టార్ హీరోలతో సినిమాలు చేసింది. అయితే ఇటీవలే తన పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకుంది. నవంబర్ 2న 50వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ మాజీ ప్రపంచ సుందరి తన పుట్టిన రోజున సియోన్‌లోని జీఎస్బీ సేవా మండల్లో క్యాన్సర్ పేషెంట్లతో కలిసి వేడుక చేసుకుంది. ఇందులో ఆమెతోపాటు కూతురు ఆరాధ్య, తల్లి బృందా రాయ్ ఉన్నారు. అయితే ఇంతవరకు బాగానే ఉన్నా.. భార్య పుట్టిన రోజు వేడుకల్లో భర్త అభిషేక్ బచ్చన్ కనిపించకపోవడం ఫ్యాన్స్‌కు ఆశ్చర్య కలిగించింది. దీంతో సోషల్ మీడియా వేదికగా అభిషేక్‌పై నెటిజన్స్ మండిపడ్డారు. భార్య పుట్టినరోజున విషెస్ చెప్పిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా లేటుగా ఆమెకు విషెస్ చెప్పడమేంటని ప్రశ్నించారు. ఆమె 50వ పుట్టినరోజును అత్యంత ఘనంగా జరుకుంటారని భావించిన ఫ్యాన్స్‌కు నిరాశే ఎదురైంది. దీంతో అభిషేక్ వ్యవహరించిన తీరుపై ఫ్యాన్స్‌తో పాటు నెటిజన్స్ తప్పుబడుతున్నారు. కాగా.. ఇటీవలే ముంబయిలో మనీష్ మల్హోత్రా నిర్వహించిన దీపావళి బాష్‌లో ఐశ్వర్య సింగిల్‌గానే కనిపించింది. పార్టీలో ఆమె భర్త అభిషేక్ బచ్చన్, కుమార్తె ఆరాధ్య బచ్చన్ రాలేదు. దీంతో మరోసారి ఈ జంటపై విడాకుల రూమర్స్ తెరపైకొస్తున్నాయి. ఐశ్వర్య రాయ్ పుట్టిన రోజు వేడుకలకు భర్త దూరంగా ఉండడం, అంతే కాకుండా ఎప్పుడో అర్ధరాత్రి విష్ చేయడం ఈ వార్తలకు మరింత ఆజ్యం పోసింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో మరోసారి డైవర్స్ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అసలు ఈ జంటకు ఏమైందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Abhishek Bachchan (@bachchan) -
ఐశ్వర్య రాయ్ కూతురు ఆరాధ్య ఎంత పెద్దది అయ్యిందో చూడండి!
-
ఎవరికి దక్కని అదృష్టం నా కూతురికి దక్కింది: ఐశ్వర్యరాయ్
అందాల తార ఐశ్వర్య రాయ్ నటించిన తాజా చిత్రం 'పొన్నియన్ సెల్వన్'. డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఐశ్వర్యరాయ్ అందాల యువరాణి నందిని పాత్రలో కనిపించనుంది.రెండు భాగాలుగా రానున్న ఈ చిత్రంపై మొదటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. అనంతరం విడుదలైన పోస్టర్లు, టీజర్, ట్రైలర్ మంచి రెస్పాన్స్ అందుకుని ఆ అంచనాలను ఇంకా పెంచేశాయి. ఈ సిరీస్‌లో మొదటి భాగం సెప్టెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో పాల్గొన్న ఐశ్వర్య తాజాగా ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 'నా కూతురు ఆరాధ్య ఓసారి సెట్స్‌కి వచ్చింది. ఒక పీరియాడికల్ డ్రామా మొదటి సారి చూడడంతో ఆమె చాలా ఎగ్జైట్ అయ్యింది. అదే సమయంలో మణిరత్నం సర్ పిలిచి మరీ ఆరాధ్యకి ఓ సీన్ కోసం కట్ చెప్పేందుకు అవకాశం ఇచ్చారు. ఇప్పటివరకు అలాంటి అవకాశం మాలో ఎవరికీ రాలేదు. కానీ అది ఆరాధ్యకి దక్కింది. అందుకే సెట్లో అందరం ఆశ్చర్యపోయాం. నాకూ, నా కూతురికి అదొక అద్భుతమైన జ్ఞాపకంగా మిగిపోతుంది' అంటూ ఐష్ చెప్పుకొచ్చింది. The perfect choice 🔥 thanks #ManiRatnam 🙏♥️ Nandini Devi is coming on 30 sep 2022#AishwaryaRai#AishwaryaRaiBachchan #PonniyinSelvan #ps1 pic.twitter.com/BnnU7bTXtF — Nandini (@LiveLonly1) September 21, 2022 -
‘అందుకు నా పిల్లల అనుమతి అక్కర్లేదు’
‘పనిలో బిజీగా ఉన్నప్పుడు ఆరాధ్య నా దగ్గరికి పరిగెత్తుకు వస్తుంది. పెన్ కావాలి.. ల్యాప్‌టాప్ కావాలి అంటూ బాగా విసుగు తెప్పిస్తుంది. పని మొత్తం చెడగొట్టాలని చూస్తుంది. ఇవన్నీ నాకు కోపం తెప్పించకపోగా ఎంతో సంతోషాన్నిస్తాయి. తన అల్లరి చేష్టలతో ఆరాధ్య నాకు తీపి ఙ్ఞాపకాలు మిగులుస్తుంది’ అంటూ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తన మనుమరాలు ఆరాధ్యపై మమకారాన్ని చాటుకున్నారు. ఇటీవల ఓ షోకు హాజరైన ఆయన తన కుటుంబం గురించి చెప్పుకొచ్చారు. అమితాబ్ మాట్లాడుతూ.. ‘ ఐశ్వర్య మా ఇంటికొచ్చాక ఏమీ మారలేదు. ఒక కూతురు(శ్వేతా నందా) పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లిపోయింది. మరో కూతురు(ఐశ్వర్యా రాయ్) కోడలిగా ఇంట అడుగుపెట్టింది. ఇక నా మనుమళ్ల అల్లరి గురించి చెప్పక్కర్లేదు. వాళ్లను సగం చెడగొట్టేది నేనే. నవ్య నవేలి- అగస్త్య(శ్వేతా నందా సంతానం), ఆరాధ్య.. ఈ ముగ్గురిని సమంగా ప్రేమిస్తా. వాళ్లతో పాటు నేను కూడా చేరి అల్లరి చేస్తా. నేనుంటే వాళ్లకు పూర్తి స్వేచ్ఛ దొరుకుతుంది. ఎందుకంటే మేము కలిసి అల్లరి చేయాలంటే నాకు నా పిల్లల అనుమతి, వాళ్లకు తల్లిదండ్రుల అనుమతి అక్కర్లేదు కదా’ అంటూ సరదాగా ముచ్చటించారు. కాగా ప్రస్తుతం బాలీవుడ్ మూవీ ‘బ్రహ్మాస్త్ర’ షూటింగ్‌తో బిజీగా ఉన్న బిగ్ బీ ‘ఉయర్నద మనిదన్’ అనే సినిమాతో కోలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. -
ఐష్‌ను ఇంట్లో అలాగే పిలుస్తారు!
ప్రపంచ మాజీ సుందరి ఐశ్వర్యాయ్కు తన పుట్టింటి వారితో ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కుటుంబ సభ్యుల పుట్టిన రోజు వేడుకలు, రాఖీ పండుగ ఇలా ప్రతీ సందర్భంలోనూ అక్కడ ఐష్ సందడి ఉండాల్సిందే. ఆ సమయంలో ఓ సెలబ్రెటీ అనే విషయం మర్చిపోయి మరీ మేనల్లుళ్లతో కలిసి ఐశ్వర్య చిన్నపిల్లగా మారిపోయి అల్లరి చేస్తారట. ఈ విషయాన్ని ఆమె వదిన శ్రిమా రాయ్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా రివీల్ చేశారు. ఫ్యాషన్, లైఫ్‌స్టైల్ బ్లాగర్ మెయింటేన్ చేసే శ్రిమా... ‘మాతృత్వం గురించి నా బ్లాగ్ పోస్ట్‌లో ఎలాంటి వివరాలు తెలుసుకోవాలనుంకుంటున్నారు’ అని తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఫాలోవర్లను అడిగారు. ఈ క్రమంలో.. ‘సెలబ్రిటీ అయిన ఐష్ గురించి మీ పిల్లలకు ఎలా, ఏమని చెబుతారు’ అని ప్రశ్నించగా..‘మా ఇంట్లో అసలు ఆ విషయమే చర్చకు రాదు. తనెప్పుడూ నా పిల్లలకు గులూ మామీనే’ అంటూ ఐశ్వర్యారాయ్‌కు మేనల్లుళ్లు పెట్టిన క్యూట్ నిక్ నేమ్‌ను బయటపెట్టారు. కాగా ఐశ్వర్యారాయ్ సోదరుడు ఆదిత్యా రాయ్‌ను పెళ్లాడిన శ్రిమా 2009లో మిసెస్ ఇండియా టైటిల్‌ను సొంతం చేసుకున్నారు. ఈ జంటకు విహాన్, శివాన్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
ప్రపంచంలోనే బెస్ట్ అమ్మ
1994లో ప్రపంచ సుందరిగా కిరీటం గెలుచుకున్నారు ఐశ్వర్యారాయ్. ఇప్పటికీ అంతే అందంగా ఉన్నారు ఐష్. మళ్లీ 24 సంవత్సరాల తర్వాత మరో కిరీటం ఆమె తలమీద వచ్చి వాలింది. మళ్లీ అందాల పోటీల్లో పాల్గొన్నారా? కాదు.. కాదు. ఈసారి అందిన కిరీటం ఐష్ అందానికి కాదు.. ఐష్లోని అమ్మకు. ప్రపంచంలోనే బెస్ట్ అమ్మ అంటూ ఐష్ కుమార్తె ఆరాధ్య ఆమె కోసం ప్రత్యేకంగా కిరీటం తయారు చేసి ఇచ్చారు. ఆరాధ్య గీసిన బొమ్మలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకుంటుంటారు ఐష్. తాజాగా తన ముద్దుల కుమార్తె ఇచ్చిన కానుక గురించి ప్రస్తావిస్తూ.. ‘‘మా అమ్మాయి నా ప్రపంచం. నా ప్రపంచం ఇచ్చిన సర్ప్రైజ్ గిఫ్ట్ ఇది. ఇప్పటివరకూ నేనందుకున్న కిరీటాల్లో ఇది ఎంతో విలువైంది’’ అని ఐష్ పేర్కొన్నారు. తల్లి కోసం ఆరాధ్య చేసిన గిఫ్ట్ -
సినిమా సెట్లోనే అభి అలా చేశాడు!!
అందానికే అసూయ పుట్టించే అందం ఐశ్వర్యా రాయ్ సొంతం. పెళ్లై, ఓ బిడ్డకు తల్లైన తర్వాత కూడా ఐష్ అందం ఇసుమంత కూడా తగ్గలేదనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అటువంటి అందాన్ని సొంతం చేసుకోవడానికి ఎంతో మంది పోటీ పడినప్పటికీ అభిషేక్ బచ్చన్‌నే ఆ అదృష్టం వరించింది. ఐష్‌ను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న అభిషేక్.. ఆ విషయాన్ని వెంటనే ఆమెకు తెలియజేయాలని నిశ్చయించుకున్నాడట. ఇంకా ఆలస్యం చేయకూడదనే ఉద్దేశంతో ‘గురు’ సినిమాలో సెట్లోనే ప్రపోజ్ చేయాలని భావించాడట. వెంటనే తన దగ్గర ఉన్న రింగ్‌తో ఐష్‌కు ప్రపోజ్ చేశాడు. ఆహ్లాదభరితమైన న్యూయార్క్ నగరంలో.. చెట్లతో నిండిన బాల్కనీలో అభిషేక్ ప్రపోజ్ చేయడంతో ఐష్ కూడా వెంటనే తన అంగీకారం తెలిపారట. అయితే రింగ్ గురించి అభిషేక్ చెప్పిన నిజం విని షాకయ్యారట ఐష్. అది గురు సినిమా షూటింగ్లో ఉపయోగించిన ఫేక్ రింగ్ అని తెలిసినప్పటికీ అభి ప్రేమ మాత్రం నిజమే కదా అని సరిపెట్టుకున్నారట. ఇదంతా పదకొండేళ్ల క్రితం నాటి సంగతి. ఎన్ని రోజులు గడిచిన ప్రేమ తాలూకు అనుభూతులు మాత్రం చెరిగిపోవు కదా. అందుకే ఇటీవలే పెళ్లిరోజు వేడుకలు చేసుకున్న ఈ జంట గత స్మృతులను గుర్తు చేసుకున్నారట. అయితే పదకొండేళ్ల నుంచి కూడా ఈ జంటపై ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంది. ఐశ్వర్య ఇగోయిస్ట్ అనీ, అభిషేక్ ఆమెతో వేగలేకపోతున్నారనీ, త్వరలోనే ఈ కపుల్ విడిపోయే అవకాశాలున్నాయంటూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. పెళ్లయ్యాక కూడా అభిషేక్ తల్లిదండ్రులతోనే కలిసి ఉండటం ఐశ్వర్యకు నచ్చడం లేదని, ఐశ్వర్య తన మాజీ కో స్టార్లతో కలివిడిగా ఉండటం అభిషేక్‌కు చికాకు తెప్పిస్తోందని... ఇలా ఏవేవో పుకార్లు షికార్లు చేస్తున్నా.. అవేమీ పట్టించుకోకుండా తమ గారాల పట్టి ఆరాధ్యతో సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నారు అభీ- ఐష్‌లు. త్వరలోనే ఇద్దరూ కలిసి ‘గులాబ్ జామూన్’ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు కూడా. -
సోషల్ మీడియా వేదికగా ఐశ్వర్యరాయ్‌పై..
ముంబై : సోషల్ మీడియా వేదికగా ఐశ్వర్యరాయ్‌పై ఘాటుగా స్పందిస్తున్నారు కొంతమంది నెటిజన్లు. మదర్స్ డే సందర్భంగా కూతురు ఆరాద్యను పెదాలపై ముద్దాడుతూ ఐశ్వర్యరాయ్ ఆ ఫోటోను ఇన్‌స్టాగ్రాంలో ఉంచిన విషయం తెలిసిందే. అయితే కూతురిని అలా పెదాలపై ముద్దాడటాన్ని నెటిజన్లు తప్పుబడుతున్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ సోషల్ మీడియా వేదికగా ఘాటుగా కామెంట్లు చేస్తున్నారు. అలా పిల్లలను ముద్దాటం లైంగికంగా వేధించటమే అని, పెదాలపై ముద్దాడి భారతదేశ సాంప్రదాయాన్ని చెడగొడుతున్నారని కొందరు స్పందిచగా. 5-6 సంవత్సరాల పిల్లలను బలవంతంగా ముద్దు పెట్టుకోవటం నేరమని మరి కొందరు స్పందించారు. కొందరైతే హద్దులు దాటి ‘‘చిన్న పిల్లలతో సెక్స్ మంచిది కాదని, లెస్బియన్స్’’ అంటూ స్సందించారు. ఇన్‌స్టాగ్రాంలో చేరిన వారంలోనే ఈ రకమైన స్పందన రావటం ఐశ్వర్యరాయ్‌కి ఓ చేదు అనుభవమే. ఐశ్వర్యరాయ్ అభిమానులు మాత్రం తల్లి తన కూతుర్ని అలా పెదాలపై ముద్దాడటంలో తప్పేమిలేదంటున్నారు. తల్లి ప్రేమలో కూడా బూతును వెతుకుతున్న వారిని ఏం చేసినా పాపం లేదంటున్నారు. స్వేచ్ఛ ఉంది కదా అని ఇష్టమొచ్చినట్లు కామెంట్లు చేయటం సరికాదని హితవు పలుకుతున్నారు. -
షారుక్ కొడుకు, ఐశ్వర్య కూతురు కలిసి నటిస్తే!
అందాల తార ఐశ్వర్యారాయ్ నోట్లోంచి ఊడి పడినట్లుండే ఆరాధ్యా బచ్చన్ ఇప్పటికే పెద్ద సెలబ్రిటీ అయిపోయింది. గట్టిగా నాలుగేళ్లు ఉన్నాయో లేవో.. అప్పుడే ఆమె వెండితెర ప్రవేశం గురించిన చర్చలు మొదలైపోయాయి. అలాగే.. షారుక్ ఖాన్ కొడుకు అబ్రామ్ గురించి కూడా వినిపిస్తున్నాయి. నిజానికి బాలీవుడ్లో బాగా సెలబ్రిటీలుగా మారిపోయిన పిల్లలు ఎవరంటే వీళ్లిద్దరే. భవిష్యత్తులో వీళ్లిద్దరూ ఆన్‌స్క్రీన్ మీద మంచి జంట అవుతారని షారుక్ ఇప్పటినుంచే కలలు గంటున్నాడు. సీనియర్ బచ్చన్ అమితాబ్ కూడా దానికి సై అంటున్నారు. ఇటీవల దిల్వాలే సినిమా ప్రమోషన్ సందర్భంగా షారుక్ మాట్లాడుతూ, స్క్రీన్ మీద తాను- కాజోల్ మంచి జంట అని, భవిష్యత్తులో అబ్రామ్ - ఆరాధ్య మంచి జంట అవుతారని అన్నాడు. ఈ మాట విని ఆరాధ్య తాత అమితాబ్ బచ్చన్ ఉప్పొంగిపోయారట. నిజంగా షారుక్ ఆ మాట అని ఉంటే ఆయన నోట్లో నెయ్యి, చక్కెర, పాల మీగడ అన్నీ వెయ్యాలని అన్నారు. అంటే, పెద్దాయన కూడా పచ్చజెండా ఊపేశారన్న మాట. వజీర్ సినిమా గురించి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. కొసమెరుపు: ఐశ్వర్యా రాయ్ కూతురు ఆరాధ్యా బచ్చన్ (4) కంటే.. షారుక్ ఖాన్ కొడుకు అబ్రామ్ (2) రెండేళ్లు చిన్నవాడు.