ఇంట్లో కూర్చొని కెరీర్‌ నాశనం చేసుకుంటున్నావ్‌ | Aishwarya Rai's Daughter Aaradhya Grown Up In New Pic | Sakshi
Sakshi News home page

తండ్రిని తలుచుకుంటూ ఐశ్వర్య పోస్ట్‌.. ఆరాధ్యను చూశారా? ఎలా ఉందో!

Published Fri, Mar 22 2024 12:00 PM | Last Updated on Fri, Mar 22 2024 12:19 PM

Aishwarya Rai Daughter Aaradhya Grown up In New Pic - Sakshi

అందమే అసూయపడేంత సొగసు హీరోయిన్‌ ఐశ్యర్యరాయ్‌ సొంతం. 1994లో ప్రపంచ సుందరి పోటీల్లో కీరీటాన్ని పొందిన ఐశ్వర్యరాయ్‌ని ఆ తరువాత సినీ అవకాశాలు వరించాయి. దర్శకుడు మణిరత్నం ఇరువర్‌ చిత్రం ద్వారా ఈమెను కథానాయికగా పరిచయం చేశారు. ఆ చిత్రం విజయంతో ఐశ్వర్యరాయ్‌కు అవకాశాలు వరుసకట్టాయి. అలా హిందీ, తమిళం, బెంగాలీ, ఆంగ్లం భాషల్లో పలు చిత్రాల్లో నటించి బహుళ ప్రాచుర్యం పొందారు.

పులి కడుపున పిల్లి పడుతుందా?
అగ్ర కథానాయికగా కొనసాగుతున్న సమయంలోనే బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ వారసుడు, నటుడు అభిషేక్‌ బచ్చన్‌ను పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లి 2007లో జరిగింది. ఈ క్రేజీ జంటకు ఆరాధ్య అనే కూతురు పుట్టింది. ఇప్పుడు అసలు విషయం ఈ అమ్మాయి గురించే. పులి కడుపున పిల్లి పుడుతుందా? అన్న సామెతలా అందానికి పుట్టిన చంద్రం ఈ ఆరాధ్య. ఈ చిన్నారికి పట్టుమని 15 ఏళ్లు కూడా లేవు.

అంబానీ పెళ్లిలో హైలైట్‌
అయితే అచ్చం తల్లి అందాలను పుణికి పుచ్చుకుంది. మొన్నటి వరకూ చిట్టి చిన్నారిగా కనిపించిన ఆరాధ్య ఇప్పుడు యవ్వనవతిగా మారింది. ఈ చిన్నదాని ఫొటో చూస్తుంటే అలానే అనిపిస్తోంది. ఇటీవల ప్రముఖ పారిశ్రామిక వేత్త అంబానీ కొడుకు వివాహ వేడుకకు ఆరాధ్య తన తల్లితో పాటు హాజరై అందరి కంట్లో పడింది. ఆ తరువాత  ఐశ్వర్య తన తండ్రి కృష్ణరాజ్‌ను స్మరించుకుంటూ ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్‌ చేసిన ఫోటోల్లోనూ ఆరాధ్య చిరునవ్వుతో దర్శనమిచ్చింది.

కెరీర్‌ నాశనం చేసుకుంటున్నావ్‌
ఈ ఫోటోల్లో తల్లిలానే ఆరాధ్య కూడా అందంగా ఉందంటూ నెటిజన్లు పొగుడుతున్నారు. ఓ వ్యక్తి మాత్రం ఐశ్వర్యను తిట్టిపోశాడు. నువ్వు ఇంట్లో కూర్చోని కెరీర్‌ నాశనం చేసుకుంటున్నావు.. మాలాంటి అభిమానులను అసలు పట్టించుకోవడం లేదని ఫైర్‌ అయ్యాడు. ఇది చూసిన ఇతర అభిమానులు మొన్నే కదా పొన్నియన్‌ సెల్వన్‌లో యాక్ట్‌ చేసింది.. అయినా తన జీవితం.. తనిష్టం.. ఎప్పుడెలా మాట్లాడాలో తెలీదా అని సదరు నెటిజన్‌ను ఏకిపారేస్తున్నారు.

చదవండి: మా అక్కను కాపాడండి.. మరోసారి సాయం కోరిన హీరోయిన్‌ సోదరి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement