మహిళల మీద వేధింపులపై 'ఐశ్వర్యరాయ్‌' ఆసక్తికర వ్యాఖ్యలు | Aishwarya Rai Condemned Violence Against Women Protection, Watch Video Goes Viral | Sakshi
Sakshi News home page

వేధింపులపై 'ఐశ్వర్యరాయ్‌' ఆసక్తికర వ్యాఖ్యలు

Published Tue, Nov 26 2024 1:19 PM | Last Updated on Tue, Nov 26 2024 1:47 PM

Aishwarya Rai Comments About Women Protect

సమాజంలో చాలామంది మహిళలు వేధింపులకు గురౌతూనే ఉంటారు. వాటిని ఎలా ఎదుర్కొవాలో బాలీవుడ్‌ నటి ఐశ్వర్యరాయ్ పలు సూచనలు చేశారు. తన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఒక బ్యూటీ ప్రొడక్ట్‌ ప్రచారంలో భాగంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఆమె ఇప్పటికే ఆ సంస్థకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా కూడా ఉన్నారు. ప్రస్తుతం ఐశ్వర్యరాయ్‌ విడుదల చేసిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతుంది.

మహిళలపై జరుగుతున్న హింసను ఆమె ఖండించారు. 'సమాజంలో చాలామంది నిత్యం వేధింపులకు గురవుతూనే ఉన్నారు. సమస్య ఎదురు అయినప్పుడు ధైర్యంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. ప్రతికూల పరిస్థితిలు ఎదురైనప్పుడు నేరుగా వారి కళ్లలోకి చూడాలి. మన శరీరం మనకు చాలా విలువైనది. దాని విషయంలో ఎలాంటి రాజీపడకండి. దానిని కాపాడుకునేందుకు ఎట్టి పరిస్థితిల్లోనూ తగ్గకండి. మీ శక్తిని తక్కువ అంచనా వేయకండి.' అని ఐశ్వర్యరాయ్‌ పేర్కొన్నారు. ఆమె వ్యాఖ్యలపై నెటిజన్ల నుంచి పాజిటివ్‌ కామెంట్లు వస్తున్నాయి. చాలామందిలో  స్ఫూర్తినిచ్చే మాటలు చెప్పినందుకు ఆమెను అభినందిస్తున్నారు.

ఐశ్వర్య చివరిగా మణిరత్నం దర్శకత్వం వహించిన పొన్నియిన్ సెల్వన్ 2లో కనిపించింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో దుబాయ్‌లో జరిగిన సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (SIIMA) 2024లో ఆమె ఉత్తమ నటి (క్రిటిక్స్) అవార్డును ఆమె గెలుచుకున్నారు. అయితే, ఆమె తదుపరి సినిమాను ఇంకా ప్రకటించలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement