అదే సెంటిమెంట్ | Balakrishna Continues That Sentiment | Sakshi
Sakshi News home page

అదే సెంటిమెంట్

Published Fri, Apr 3 2015 11:06 PM | Last Updated on Wed, Aug 29 2018 1:59 PM

అదే సెంటిమెంట్ - Sakshi

అదే సెంటిమెంట్

నందమూరి బాలకృష్ణ ‘లయన్’గా గర్జించడానికి సిద్ధమవుతున్నారు. శక్తిమంతమైన పాత్రలో ఆయన నటిస్తున్న ఈ చిత్రం ద్వారా సత్యదేవా దర్శకునిగా పరిచయమవుతున్నారు. జవ్వాజి రామాంజనేయులు సమర్పణలో రుద్రపాటి రమణారావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్రిష, రాధికా ఆప్టే కథానాయికలు.

ఇప్పటికే చిత్రీకరణ మొత్తం పూర్తయిన ఈ సినిమా  పాటలను ఈ నెల 9న విడుదల చేయనున్నారు. మణిశర్మ స్వరాలందించిన ఈ చిత్ర ఆడియోను హైదరాబాద్‌లో భారీ ఎత్తున జరపనున్న వేడుకలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయిడు విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ కెరీర్‌లో ఘనవిజయాలైన ‘సమరసింహారెడ్డి’, ‘నరసింహనాయుడు’ పాటల వేడుకల్లోనూ చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలోనే పాల్గొనడాన్ని అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. ఈ చిత్రానికి నిర్మాణ సారథ్యం: రుద్రపాటి ప్రేమలత.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement