Giridar
-
సీఎం వైఎస్ జగన్ ను కలిసిన కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి గిరిధర్ అరమణె
-
ఆత్మదర్శనమంటే అదే!
ఆత్మను అనుభవించటం ఇంద్రియాలకు సాధ్యం కాదని మనం చెప్పుకున్నాం. మరి దేనికి సాధ్యమంటే జ్ఞానమనే పునాది మీద నిలబడిన మనసుకి మాత్రమే అది సాధ్యం. జ్ఞానం అనేది హేతువును తెలియజేస్తుంది. దృశ్యమాన ప్రపంచం ఏ విధంగా ఉనికిలోకి వచ్చిందో అర్థం చేయిస్తుంది. ఆ శక్తి ఏవిధంగా పరివ్యాప్తమై ఉండి, సకల చరాచర సృష్టికి ఆధారమై, నిత్యమై, నిశ్చలమై సర్వత్రా ఏ విధంగా నిబిడీకృతమైనదనే విషయాన్ని తెలియజేస్తుంది. అట్టి జ్ఞానాన్ని అవగాహన చేసుకోవడమే మేథకు గొప్ప పని. ఆ మేథను మనసు ఆకళింపు చేసుకోవడం ఓ అంతర్గత సంఘర్షణ. ఆ సంఘర్షణలో అరిషడ్వర్గాల పతనం ప్రారంభమౌతుంది. నిజమేది? నిత్యమేది? జీవమేది? మరణమేది మొదలైన ప్రశ్నలు భౌతిక జీవితాన్ని గడపాల్సి రావడం వలన ఉత్పన్నమౌతాయి. గమ్యమదే ఐనపుడు కర్మసన్యాసం సుఖవంతమనే బలహీనత మనసును తొలుస్తుంది. గీతాపాఠాలు స్ఫురణకు వస్తాయి. ఈ విధమైన మానసిక సంఘర్షణలో నుండే జ్ఞానం ప్రకాశించి, ఆత్మ సందర్శనకు కారణమౌతుంది. జ్ఞానయోగి, కర్మయోగిగా పరిణమిస్తాడు. ప్రతికర్మలోనూ భగవచ్ఛక్తితో రమిస్తాడు. బ్రహ్మజ్ఞానియై బ్రహ్మానందంలో ఓలలాడతాడు. మనసు చేసే నిరంతర చింతన వలన ఆత్మను అనుభవిస్తాడు. ఆ అనుభవమే ఆత్మదర్శనం లేక భగవద్దర్శనం. ‘సమస్తమై విరాజిల్లుతున్న ఆత్మను దర్శిస్తే మానసిక గందరగోళాలు నశిస్తాయి. అన్ని సందేహాలు సమసిపోతాయి. ప్రారబ్ధ కర్మలతో సంబంధం తెగిపోతుంది. ప్రాకృతిక సుఖ సంతోషాల స్థానే నిరంతర ఆత్మానందం ఉదయిస్తుంది. దుఃఖ ద్వేషాదులస్థానే ప్రేమ ఆప్యాయతలు వికసిస్తాయి. శత్రు భయం, కష్టాలు తొలగి విశ్వనరులమై వెలుగొందగలుగుతాం.. ఆత్మప్రకాశం ద్వారానే ఆత్మను చూడగలుగుతామంటుంది ముండకోపనిషత్తు. అక్కడ సూర్య చంద్రాదులు ప్రకాశించడం లేదు, మెరుపులు మెరవడం లేదు, అలాంటప్పుడు ప్రకాశం అంటే ఏంటి? మన మనసులో మనం ఊహించుకునే వెలుతురు కాదు. అది ఒక యోచన. అది ఒక దివ్యానుభూతి. దానివలన మనసులో ఉండే చీకటి సహిత మాలిన్యాలు నశించిపోతాయి. కాబట్టి, ప్రకాశంగా చెప్పబడింది. ‘పెట్రోమాక్సు దీపం నుండి వచ్చే ప్రకాశం లాంటిది కాదు ఆత్మప్రకాశం. అన్నింటినీ మనం తెలుసుకుంటున్నది ఆత్మప్రకాశం చేతనే! అందువల్లనే అది ప్రకాశమని చెప్పబడిందంటారు శ్రీరమణమహర్షి. ఆ ప్రకాశం వైపుగా మనం పయనిద్దాం. మన మేథలో హేతువు మథించి, మనసులో ఆత్మతో రమిద్దాం. ఆత్మ ప్రకాశంలో అద్వైతస్థితిని చేరుకుందాం. అరిషడ్వర్గాలను అణచి, కుల, మత భేదాలకు అతీతులమై ఆనందిద్దాం. మానవ జీవితాన్ని ఆస్వాదించుదాం. – రావుల గిరిధర్ -
అహం బ్రహ్మాస్మి అంటే అదే!
ఆత్మ సర్వాంతర్యామి అన్న విషయం ఎరిగినవారు, ఆత్మ రూపంలో భగవంతుడు సర్వత్రా వ్యాపించి ఉన్నాడని అంగీకరించినవారు, ఆత్మానందాన్ని అనుభవించడానికి మాత్రం మానసికంగా చాలా కృషి చేయాల్సి ఉంటుంది. కనిపించేవన్నీ ఆ ఆత్మ లేక అనంతశక్తిలోనుండే పరిణమిస్తూ ఉద్భవించాయని ఎరిగినవారు నిజజీవితంలో అద్వైత ఆనందాన్ని పొందడం అంత సులభమేమీ కాదు. ఈశావాస్యోపనిషత్తు లో సర్వ భూతాలలో అంతర్యామిని దర్శించిన వారికి మానసిక వైకల్యాలు కలగవు అనడం సులభంగా అనిపించినా, అది నిరంతర చింతన వలననే సాధ్యం. ఆది శంకరులు అద్వైత సిద్ధాంతం ప్రతిపాదించిన అనంతరకాలంలో, గంగా స్నానమాచరించి విశ్వనాథుని దర్శనం కోసం కదులుతూ ఉంటే, ఒక కాటికాపరి ఎదురైనప్పుడు ’పక్కకు తప్పుకో’ అని అనడం విచిత్రం. అద్వైత సిద్ధాంత ప్రతిపాదకుడు, అత్యంత మేథాశక్తి గల మహిమాన్వితుడు, వేదవేదాంతాలను ఔపోసనపట్టిన బ్రహ్మజ్ఞాని ఆచరణ విషయం వచ్చేసరికి భంగపడ్డాడంటే ఎంత ఆశ్చర్యకరమో ఆలోచించండి. సర్వాంతర్యామి అంటే అంతటా ఉన్నవాడు, ఆత్మస్వరూపుడై ఉన్నవాడని తెలిసినా, అంగీకరించినా, అనుభవించడం ఎంత కష్టమో అర్థం చేసుకోవాలి. ఆ అనుభవంతోనే ఆదిశంకరులవారు అప్పటికప్పుడు ‘మనీషాపంచకం’ ప్రవచించి, బ్రహ్మజ్ఞాని ఎవరైననేమి, అతడు నా గురువంటూ నిశ్చయించుకొన్నాడు. ఆత్మజ్ఞానం తెలుసుకుంటే చాలు కదా, ఎందుకు అనుభవించడం? అనే ప్రశ్న ఉదయించవచ్చు. అరిషడ్వర్గరూపంలో ఉన్న మనో మాలిన్యాలు తొలగేందుకు, శ్రీ కృష్ణుని నిష్కామకర్మ సాధించేందుకు, సనాతన ధర్మజీవితం జీవించేందుకు, సుఖదుఃఖాలను నిర్మూలించేందుకు, ముఖ్యంగా మృత్యుంజయ మోక్షస్థితిని జీవితంలో అనుభవించేందుకు, ఆత్మానందంలో రమించేందుకు అద్వైతాన్ని అనుభవించాలి. అదే కదా ‘అహం బ్రహ్మాస్మి’కి నిజమైన తార్కాణం. అన్నమయ్య కలగన్న శ్రీవేంకటేశ్వరుడు ఆయనకు చివరిదశలో ‘అంతర్యామి’గా ద్యోతకమయ్యాడు. భౌతిక దృక్పథం నుండి ఆత్మ దృక్పథంలోకి మారడానికి ఎన్ని సంవత్సరాల కాలం పట్టిందో చూడవచ్చు. అందుకే, ఆత్మజ్ఞాన జిజ్ఞాసులు తొలుత ఆత్మను, జడమును అర్థం చేసుకోవాలి. తద్వారా మాత్రమే ఆత్మను, జడమును వేరుగా చూడటాన్ని మన తలపులలోంచి తీసివేయగలం. ‘మహోపనిషత్’ భేద దృష్టియే అవిద్య అని చెప్పింది. దానిని విసర్జించమని ఆదేశించింది. సర్వమూ బ్రహ్మమేనన్న విషయం తెలుసుకోవడమే విద్య అని, దానిని అనుభవించడమే అక్షయమని తేల్చిచెప్పింది. దీనికి చిన్న ఉదాహరణగా సైన్స్ చెప్పే విషయాన్ని తీసుకోవచ్చు. భూమిమీద, భూమిని మించిన బరువు ఉన్న జీవులు జన్మిస్తే భూమి తన భ్రమణ, పరిభ్రమణ గతులను తప్పుతుందా అనేది ప్రశ్న. సమాధానం ‘గతి తప్పదు’. ఎందుకు గతి తప్పదు? ఎందుకంటే ఆ జీవులన్నీ భూమండలంలోనుండే ఉద్భవించినవి కాబట్టి. ఇదే గమ్మత్తు. ఆశ్చర్యదాయకం. ఇదే చిన్న ఉదాహరణను ఆ సర్వాంతర్యామిలో పుట్టి, గిట్టే ఖగోళ పదార్థాలన్నింటి విషయంలోనూ అన్వయించుకోవచ్చు. ఈ విధంగా అంతర్యామిని దర్శించుకోవచ్చు. ఈ దర్శనం నిరంతర మానసిక చింతనతోనే ఆచరణసాధ్యం. జిజ్ఞాసులకు మనసు అత్యంత కీలక సాధనం. అది మాత్రమే అవిద్యను తొలగించివేసే విద్యకు ఆధారమౌతుంది. ఆ మనసు స్థిరంగా, బలంగా ఆత్మతో మమేకమైతేనే ఆచరణ సాధ్యమౌతుంది. అప్పుడే నిష్కామకర్మ చేస్తూ మోక్ష స్థితిని అనుభవించగలం. తద్వారా, మనచుట్టూ ఉన్న సమాజంలో, ప్రకృతిలో మనల్ని మనమే చూసుకోగలం. అంతటా ప్రేమను నింపగలం. ఆ స్థితియే ‘అహం బ్రహ్మాస్మి’ అప్పుడే భేదభావం వలన ఉత్పన్నమయ్యే అరిషడ్వర్గాలు నశించి, ఆనందమయ జగత్తు సాక్షాత్కారమౌతుంది. – రావుల గిరిధర్ -
మానవ ధర్మమే మన ధర్మం
సాంఖ్యయోగంలో శ్రీ కృష్ణుడు సర్వాంతర్యామియైన ఆత్మ గురించి తెలుసుకున్న వారు కూడా ఆశ్చర్యానికి లోనవుతున్నారని తెలియజేశాడు. అంటే, ఆ ఆత్మ ఒక విచిత్రమైన, అర్థమయ్యీ కానట్టుండే విషయమని అర్థం చేసుకోవచ్చు. కారణం, అది విశ్వవ్యాప్తమై అన్నింటినీ తనలోనే కలిగి ఉంటుంది. నక్షత్రాలు, నక్షత్రమండలాలే కాకుండా వాటి ఉత్పత్తులైన కాంతి, శబ్దం, అంతరిక్షం, ఆకాశం లాంటి వాటన్నింటికీ ఉత్పన్నకారకమై, తిరిగి తానే లయకారకమవడం వింతగా కనిపిస్తుంది. ఈ ఖగోళపదార్థాలేవీ శాశ్వతం కావని ఆధునిక వైజ్ఞానిక శాస్త్రం కూడా నిరూపిస్తోంది. అంటే, ‘యదృశ్యతి తన్నశ్యతి’– కనిపించేవన్నీ నశించేవే! మరి నశించనిది ఏంటంటే మనం చెప్పుకునే ఆత్మ లేక అనంతమైన శక్తి మాత్రమే. ఆధునిక వైజ్ఞానికులు చెప్పిన శక్తి నిత్యత్వ నియమం’ ప్రకారం శక్తిని సృష్టించలేము, నశింప చేయలేము కానీ, శక్తి రూపాలను మాత్రం మార్చగలము. ఇదే విషయాన్ని ఉపనిషత్తులు అనేకమార్లు, అనేక విధాలుగా ఘోషించినా, వాటిల్లో ‘కఠోపనిషత్తు’ రెండవ అధ్యాయం లోని 18 వ శ్లోకాన్ని చక్కని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఆత్మ జన్మించడం లేదు, మరణించడం లేదు. ఇది దేని నుండి రూపొందినది కాదు. ఎన్నటికీ ఉండేది, సనాతనమైనది, శరీరం నశించినా నశించనిది. ఈ శ్లోక భావననే ఆధునిక శాస్త్రజ్ఞులు చెప్పిన ‘శక్తి నిత్యత్వ నియమం’ కూడా చెప్తుంది. ఈ శ్లోకం సిద్ధాంతాల మధ్య భేదం ఏమీ కనిపించదు. ఇక్కడ శరీరమనేదాన్ని కనిపించే అన్ని పదార్థాలుగా చెప్పుకోవచ్చు. అంతటితో ఆగకుండా కఠోపనిషత్తు ఈ ఏకాత్మ గురించి పరిపరివిధాలుగా విశ్లేషించింది. ఇంద్రియాలు గ్రహించగల శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలన్నింటికీ అతీతమైన, అవినాశియైన, ఆద్యంత రహితమైన, బుద్ధికన్నా శ్రేష్ఠమైన, సుస్థిరమైన భగవంతుని లేదా ఏకాత్మను లేదా అనంతమైన శక్తిని అనుభూతితో గ్రహించాలని తెలియజేస్తోంది. ఈ శక్తి అనంతమైనది అంటోంది. అంటే ఈ శక్తి స్థలం మిగల్చకుండా వ్యాపించి ఉంది కాబట్టి, దానికి రూపం లేదు. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాదులన్నింటికీ అతీతమైనది. అంటే ఈ అనంతమైన శక్తికి రంగు, రుచి, వాసన, ఆకృతి, స్పర్శ మొదలైన పదార్థ స్వభావాలు ఏమీ లేవని అర్థం. ఇంద్రియాలు అట్టి శక్తిని చూడలేవు, తెలుసుకోలేవు. అనుభూతి ద్వారా మాత్రమే తెలుసుకోగలం. కాబట్టి, అలాగే అర్థం చేసుకుందాం. దాని నుండి ఉద్భవించిన మనతో కలిపి కనిపించేవన్నీ తిరిగి దానిలోకే వెళ్తాయి. కాబట్టి, అశాశ్వతమైన ఆకృతుల పట్ల ఆశ పెంచుకోవడం, ద్వేషించటం తగనిది. ఇదే విషయాన్ని ఈశావాస్యోపనిషత్తు ఎవరు సకల జీవరాశులను ఆత్మలోను, ఆత్మను సకల జీవరాశులలోనూ దర్శిస్తాడో అతను ఎవరినీ ద్వేషించడని నిర్ధారిస్తోంది. అందుచేత, ఇతర పదార్థాలు అంటే గ్రహాలు, నక్షత్రాలే కాకుండా చెట్టూచేమ, పశుపక్ష్యాదులు ఏవిధంగానైతే తమ తమ ధర్మాల రీత్యా మాత్రమే కర్మలను ఆచరిస్తూ, శాంతియుతంగా మనుగడ సాగిస్తూ ఉన్నాయో అదేవిధంగా మనం మానవధర్మాన్ని మాత్రమే ఆచరించాలి. అదే జీవిత పరమావధి. – రావుల గిరిధర్ -
భయపెడుతూ... నవ్విస్తుంది!
త్రిష ఈ ఏడాది చాలా బిజీ. తెలుగు, తమిళ చిత్రాలతో ఆమె డైరీ ఫుల్ అయిపోయింది. ఇప్పటికే బాలకృష్ణ సరసన ‘లయన్’ చిత్రంలోనూ, తమిళంలో ‘అప్పా టక్కర్’ అనే చిత్రంలోనూ నటిస్తున్నారు. అలాగే ‘భోగి’ అనే చిత్రానికి కూడా పచ్చజెండా ఊపారామె. తాజాగా మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఇది త్రిభాషా చిత్రం కావడం విశేషం. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఏకకాలంలో యం. గిరిధర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ‘లవ్ యు బంగారం’ దర్శకుడు గోవి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. ఈ చిత్రకథ విని చాలా ఉద్వేగానికి గురయ్యాననీ, పాత్ర కూడా చాలా బాగుందనీ, అందుకే మరో ఆలోచనకు తావివ్వకుండా అంగీకరించానని త్రిష పేర్కొన్నారు. గత కొన్నేళ్లుగా తనకు మేనేజర్‌గా వ్యవహరిస్తున్న గిరిధిర్ నిర్మాణ సంస్థలో ఈ చిత్రం చేయడం ఆనందంగా ఉందని ఆమె అన్నారు. ఇది హారర్, కామెడీ మూవీ అనీ, మే నెలలో రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించనున్నామనీ గిరిధర్ తెలిపారు.