Rudrapati Ramana Rao
-
ఇది మంచి పరిణామం
- బాలకృష్ణ ‘‘మంచి చిత్రాలు తీయాలనే సంకల్పంతో రుద్రపాటి రమణారావు ఈ సంస్థ స్థాపించారు. నాతో ఓ సినిమా తీస్తున్నారాయన. ఆ చిత్రవిశేషాలు ఇప్పుడు కాదు.. తర్వాత చెబుతా. ఈ చిత్రం పాటలు విన్నాను. చాలా బాగున్నాయి. పాటలు హిట్టయితే సినిమా హిట్టయినట్లే లెక్క’’ అని నందమూరి బాలకృష్ణ అన్నారు. అభిజిత్, ప్రజ్ఞా జైస్వాల్ జంటగా రుద్రపాటి ప్రేమలత సమర్పణలో రుద్రపాటి రమణారావు నిర్మించిన చిత్రం ‘మిర్చి లాంటి కుర్రాడు’. జయనాగ్ని దర్శకునిగా పరిచయం చేస్తూ రూపొందించిన ఈ చిత్రానికి జేబీ పాటలు స్వరపరిచారు. ఆడియో సీడీని బాలకృష్ణ ఆవిష్కరించి దర్శకుడు బోయపాటి శ్రీనుకి ఇచ్చారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ, ‘‘ప్రస్తుతం చిత్రపరిశ్రమలో ఆరోగ్యకరమైన పోటీ ఉంది. ఇది మంచి పరిణామం. ‘మిర్చి లాంటి కుర్రాడు’ని దర్శకుడు బాగా తెరకెక్కించి ఉంటారని, ఈ చిత్రం ద్వారా మంచి సందేశం ఇచ్చి ఉంటారని అనుకుంటున్నాను’’ అన్నారు. ప్రచార చిత్రాలు చాలా కలర్ఫుల్గా ఉన్నాయని బోయపాటి వ్యాఖ్యానించారు. నిర్మాత మాట్లాడుతూ -‘‘లవ్, కామెడీ, సెంటిమెంట్ నేపథ్యంలో రూపొందించిన ఈ చిత్రం అందర్నీ ఆకట్టుకునే విధంగా ఉంటుంది’’ అని తెలిపారు. వీరబాబు రాసిన సంభాషణలు, జేబీ పాటలు హైలైట్ అవుతాయని దర్శకుడు అన్నారు. అభిజిత్, జేబీ తదితరులు ప్రసంగించారు. -
బాలకృష్ణ సరసన త్రిష!
హీరో నందమూరి బాలకృష్ణ అటు సినిమా రంగంలో, ఇటు రాజకీయ రంగంలో మంచి జోరుమీదున్నారు. 'లెజెండ్' సినిమాతో సూపర్‌హిట్‌ని సొంతం చేసుకున్న బాలయ్య, ఆ వెంటనే ప్రత్యక్ష రాజకీయాలలో అడుగుపెట్టి హిందూపురం శాసనసభ స్థానం నుంచి కూడా గెలుపొందారు. ప్రత్యక్ష రాజకీయాలలోకి ప్రవేశించినా బాలయ్యకు సినిమా రంగాన్ని వదిలిపెట్టే ఉద్దేశం మాత్రంలేదు. ఈ విధంగా వరుస విజయాలు సొంతం చేసుకున్న బాలయ్య అదే జోరు మీద కొత్త దర్శకుడు సత్యదేవ దర్శకత్వంలో తన కొత్త చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇది బాలయ్య 98వ చిత్రం. ఈ సినిమాలో బాలయ్య సరసన త్రిష హీరోయిన్గా నటించబోతోంది. తొలిసారిగా త్రిష బాలకృష్ణతో నటించనుంది. ప్రముఖ వ్యాపారవేత్త రుద్రపతి రమణరావు నిర్మాతగా భారా బడ్జెట్‌తో యువ దర్శకుడు సత్యదేవ్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందబోతోంది. ఈ సినిమాలో త్రిష నటించడం ఖరారైన తరువాత, బాలకృష్ణతో నటించడం తనకెంతో సంతోషంగా ఉందని ఆమె ట్విట్ చేశారు. అంతేకాకుండా బాలయ్య సరసన తొలిసారిగా నటించడం తనకు ఆనందం కలిగిస్తోందని తెలిపారు. ఈ సినిమాలో త్రిషతోపాటు మరో హీరోయిన్గా అంజలి నటిస్తోంది. పూర్తి యాక్షన్, ఎంటర్టైనర్ అయిన ఈ చిత్రం షూటింగ్ తెలంగాణ రాష్ట్ర అవతరణ రోజు జూన్ 2న లాంచనంగా ప్రారంభమవుతుంది. బాలకృష్ణ చాలా పవర్ఫుల్ పాత్ర పోషించే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మాత్రం తన పుట్టిన రోజు జూన్ పది నుంచి మొదలు పెడతారు. ఈ చిత్రానికి 'గాడ్సే' అనే పేరు ఖరారు చేసినట్లు సినీవర్గాల సమాచారం. మణిశర్మ సంగీతం అందిస్తారు. -
ఎంజాయ్మెంట్...
‘‘యూత్ అంటేనే ఎంజాయ్మెంట్. ఆ ఎంజాయ్మెంట్కి నిలువెత్తు నిదర్శనంగా ఈ సినిమా నిలుస్తుంది. ప్రస్తుత సమాజంలో యువతరం మధ్య అనుబంధాలు ఎలా ఉంటున్నాయనే నేపథ్యంలో నాలుగు జంటలపై ఈ చిత్రాన్ని తెరకెక్కించాం’’ అని దర్శకుడు విజయ్ మాదాల చెప్పారు. ఆయన దర్శకత్వంలో మారుతి సమర్పణలో రుద్రపాటి రమణారావు నిర్మించిన ‘గ్రీన్ సిగ్నల్’ ఈ నెల 30న విడుదల కానుంది. ఈ సందర్భంగా మారుతి మాట్లాడుతూ -‘‘బాలీవుడ్ స్థాయిలో విజయ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు’’ అని కితాబిచ్చారు. యువతరంతో పాటు కుటుంబ ప్రేక్షకులనూ ఈ చిత్రం మెప్పిస్తుందని నిర్మాత తెలిపారు. పాటలకు చక్కని స్పందన లభిస్తోందని సంగీత దర్శకు జేబీ పేర్కొన్నారు. రేవంత్, రక్షిత, మానస్, మనాలి, అశుతోష్, డింపుల్ చోపడే, శిల్పిశర్మ, గోపాల్ సాయి ఇందులో ముఖ్యతారలుగా నటించారు. -
అనుబంధాల పచ్చజెండా
సమాజంలో యువతరం మధ్య అనుబంధాలు ఎలా ఉంటున్నాయి అనే కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘గ్రీన్ సిగ్నల్’. రేవంత్, రక్షిత, మానస్, మనాలి, అశుతోశ్ ప్రధాన పాత్రధారులు. విజయ్ మద్దాల దర్శకుడు. రుద్రపాటి రమణరావు నిర్మాత. నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈ నెల 15న గానీ, 17న గానీ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తొలి ప్రయత్నం ఎలా ఉంటుందో అని భయపడ్డానని, టోటల్ అవుట్‌పుట్ చూశాక విజయంపై నమ్మకం బలపడిందని నిర్మాత చెప్పారు. జేబీ స్వరపరిచన పాటలు వినడానికే కాక, చూడ్డానికి కూడా అద్భుతంగా ఉన్నాయని, త్వరలోనే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. ఎక్కడా ద్వంద్వార్థ సంభాషణలు లేకుండా, కుటుంబం మొత్తం చూసి ఆనందించేలా ఈ సినిమా ఉంటుందని, సినిమా విజయవంతమైతే ఆ క్రెడిట్ టీమ్ మొత్తానిదని, ఫలితం వేరేలా ఉంటే బాధ్యుణ్ణి తానేనని దర్శకుడు చెప్పారు. సంగీత దర్శకుడు జేబీ, గోపాలసాయి, మనాలి కూడా మాట్లాడారు.