అనుబంధాల పచ్చజెండా | Green Singal Is Gearing Up For Release | Sakshi
Sakshi News home page

అనుబంధాల పచ్చజెండా

Published Mon, May 5 2014 10:49 PM | Last Updated on Sat, Sep 2 2017 6:58 AM

అనుబంధాల పచ్చజెండా

అనుబంధాల పచ్చజెండా

సమాజంలో యువతరం మధ్య అనుబంధాలు ఎలా ఉంటున్నాయి అనే కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘గ్రీన్ సిగ్నల్’. రేవంత్, రక్షిత, మానస్, మనాలి, అశుతోశ్ ప్రధాన పాత్రధారులు. విజయ్ మద్దాల దర్శకుడు. రుద్రపాటి రమణరావు నిర్మాత. నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈ నెల 15న గానీ, 17న గానీ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తొలి ప్రయత్నం ఎలా ఉంటుందో అని భయపడ్డానని, టోటల్ అవుట్‌పుట్ చూశాక విజయంపై నమ్మకం బలపడిందని నిర్మాత చెప్పారు. జేబీ స్వరపరిచన పాటలు వినడానికే కాక, చూడ్డానికి కూడా అద్భుతంగా ఉన్నాయని, త్వరలోనే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. ఎక్కడా ద్వంద్వార్థ సంభాషణలు లేకుండా, కుటుంబం మొత్తం చూసి ఆనందించేలా ఈ సినిమా ఉంటుందని, సినిమా విజయవంతమైతే ఆ క్రెడిట్ టీమ్ మొత్తానిదని, ఫలితం వేరేలా ఉంటే బాధ్యుణ్ణి తానేనని దర్శకుడు చెప్పారు. సంగీత దర్శకుడు జేబీ, గోపాలసాయి, మనాలి కూడా మాట్లాడారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement