Green Singal
-
జెట్ ఎయిర్వేస్ యాజమాన్యం బదిలీకి ఎన్సీఎల్టీ ఆమోదం
ముంబై: దివాలా తీసిన జెట్ ఎయిర్వేస్ యాజమాన్య హక్కులను జలాన్ కల్రాక్ కన్సార్షియానికి బదిలీ చేసే ప్రతిపాదనకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఎట్టకేలకు ఆమోదముద్ర వేసింది. అలాగే రుణదాతలు, ఉద్యోగులు మొదలైన వారికి బాకీలు చెల్లించడానికి మరికొంత సమయం ఇచ్చింది. దీంతో బాకీల చెల్లింపునకు కన్సార్షియానికి మే నెల వరకూ వ్యవధి లభించింది. గతంలో ఈ గడువు 2022 నవంబర్ 16గా ఉండేది. కన్సార్షియం, రుణదాతలకు మధ్య విభేదాలు నెలకొన్న నేపథ్యంలో తాజా ఉత్తర్వులు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. దివాలా పరిష్కార ప్రక్రియ కింద జెట్ ఎయిర్వేస్ను జలాన్ కల్రాక్ కన్సార్షియం దక్కించుకున్న సంగతి తెలిసిందే. 2021 జూన్‌లో ఆమోదించిన ప్రణాళిక ప్రకారం బ్యాంకులు రూ. 7,807 కోట్ల మేర బాకీలను వదులుకునేందుకు (హెయిర్‌కట్) అంగీకరించాయి. రుణదాతలకు చెల్లింపులతో పాటు వ్యాపారానికి కన్సార్షియం రూ. 1,375 కోట్ల మొత్తాన్ని సమకూర్చాల్సి ఉంది. ఈ క్రమంలో ఎయిర్‌లైన్ యాజమాన్య హక్ులను తమకు బదిలీ చేయాలని, బాకీల చెల్లింపునకు మ రింత సమయం ఇవ్వాలని ఎన్సీఎల్టీని కన్సార్షి యం ఆశ్రయించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులపై రెండు వారాల పాటు స్టే విధించాలని ప్రతివాదులు కోరినప్పటికీ ఎన్సీఎల్టీ తిరస్కరించింది. -
ఏపీలో సినిమా షూటింగ్‌లకు అనుమతి
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో సినిమా షూటింగ్‌లకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు రాష్ట్ర ఫిల్మ్, టీవీ, థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. ప్రభుత్వ స్థలాలు, ప్రాంగణాల్లో సినిమా షూటింగ్‌లు నిర్వహించుకొనే అమమతులను తమ సంస్థ మంజూరు చేస్తుందన్నారు. చిత్ర దర్శకులు, నిర్మాతలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కోవిడ్-19 నేపథ్యంలో రాష్ట్రంలో సినిమా షూటింగ్‌లను ప్రభుత్వం నిలిపివేసిన సంగతి తెలిసిందే. అయితే భారత ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆగస్టు 21న జారీచేసిన మార్గదర్శకాలతో పాటు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్‌కు అనుగుణంగా రాష్ట్రంలో సినిమాల చిత్రీకరణకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని ఆయన స్పష్టం చేశారు. సినిమాల చిత్రీకరణ సమయంలోఈ మార్గదర్శకాలతో పాటు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్‌ను తప్పక పాటించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ మార్గదర్శకాల ప్రకారం టెక్నీషియన్లు అందరూ తప్పక మాస్కులు ధరించాల్సి ఉందని, అయితే షూటింగ్ సమయంలో నటీనటులు మాస్కులు ధరించే విషయంలో కొంత మినహాయింపు ఇవ్వడం జరిగిందన్నారు. సినిమాల చిత్రీకరణ సమయంలో సినిమా చిత్రీకరణ పరికరాలు, యూనిట్లు, సెట్లు సహా అన్ని తరచుగా శానిటైజ్ చేయాల్సి ఉంటుందన్నారు. షూటింగ్లో పాల్గొనే టెక్నీషియన్లు, నటీ నటులు తప్పనిసరిగా హ్యాండ్ శానిటైజర్లను వినియోగించాలన్నారు. సినిమాల చిత్రీకరణ సమయంలో సాంకేతికంగా అవకాశం లేని పరిస్థితులు మినహా మిగిలిన సమయాల్లో ఆరు అడుగుల భౌతిక దూరం పాటించాల్సి ఉంటుందన్నారు. కరోనా వ్యాప్తి నియంత్రణకై ప్రేక్షకులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియపరిచే బహిరంగ సందేశాలను సినిమా ప్రదర్శన ప్రారంభంతో పాటు విరామ సమయాల్లో తప్పక ప్రదర్శించాల్సి ఉంటుందన్నారు. సినిమాల చిత్రీకరణకు అవసరమైన అనుమతులు, నియమ, నిబందనలకు సంబంధించిన వివరాలకు రాష్ట్ర ఫిల్మ్, టీవీ, థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారిక వెబ్సైట్ www.apsftvtdc.inలో పొందవచ్చని ఆయన తెలిపారు. -
అనుబంధాల పచ్చజెండా
సమాజంలో యువతరం మధ్య అనుబంధాలు ఎలా ఉంటున్నాయి అనే కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘గ్రీన్ సిగ్నల్’. రేవంత్, రక్షిత, మానస్, మనాలి, అశుతోశ్ ప్రధాన పాత్రధారులు. విజయ్ మద్దాల దర్శకుడు. రుద్రపాటి రమణరావు నిర్మాత. నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈ నెల 15న గానీ, 17న గానీ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తొలి ప్రయత్నం ఎలా ఉంటుందో అని భయపడ్డానని, టోటల్ అవుట్‌పుట్ చూశాక విజయంపై నమ్మకం బలపడిందని నిర్మాత చెప్పారు. జేబీ స్వరపరిచన పాటలు వినడానికే కాక, చూడ్డానికి కూడా అద్భుతంగా ఉన్నాయని, త్వరలోనే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. ఎక్కడా ద్వంద్వార్థ సంభాషణలు లేకుండా, కుటుంబం మొత్తం చూసి ఆనందించేలా ఈ సినిమా ఉంటుందని, సినిమా విజయవంతమైతే ఆ క్రెడిట్ టీమ్ మొత్తానిదని, ఫలితం వేరేలా ఉంటే బాధ్యుణ్ణి తానేనని దర్శకుడు చెప్పారు. సంగీత దర్శకుడు జేబీ, గోపాలసాయి, మనాలి కూడా మాట్లాడారు.