ఏపీలో సినిమా షూటింగ్‌లకు అనుమతి | Green Signal For Cinema Shootings In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఏపీలో సినిమా షూటింగ్‌లకు అనుమతి

Published Thu, Oct 8 2020 6:02 PM | Last Updated on Thu, Oct 8 2020 6:23 PM

Green Signal For Cinema Shootings In Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి : రాష్ట్రంలో సినిమా షూటింగ్‌లకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు  రాష్ట్ర ఫిల్మ్‌, టీవీ, థియేటర్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. ప్రభుత్వ స్థలాలు, ప్రాంగణాల్లో సినిమా షూటింగ్‌లు నిర్వహించుకొనే అమమతులను తమ సంస్థ మంజూరు చేస్తుందన్నారు. చిత్ర దర్శకులు, నిర్మాతలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కోవిడ్-19 నేపథ్యంలో రాష్ట్రంలో సినిమా షూటింగ్‌లను ప్రభుత్వం నిలిపివేసిన సంగతి తెలిసిందే. అయితే భారత ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆగస్టు 21న జారీచేసిన మార్గదర్శకాలతో పాటు స్టాండర్డ్‌ ఆపరేటింగ్ ప్రొసీజర్‌కు అనుగుణంగా రాష్ట్రంలో సినిమాల చిత్రీకరణకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని ఆయన స్పష్టం చేశారు. సినిమాల చిత్రీకరణ సమయంలోఈ మార్గదర్శకాలతో పాటు స్టాండర్డ్‌ ఆపరేటింగ్ ప్రొసీజర్‌ను తప్పక పాటించాల్సి ఉంటుందని తెలిపారు. 

ఈ మార్గదర్శకాల ప్రకారం టెక్నీషియన్లు అందరూ తప్పక మాస్కులు ధరించాల్సి ఉందని, అయితే షూటింగ్ సమయంలో నటీనటులు మాస్కులు ధరించే విషయంలో కొంత మినహాయింపు ఇవ్వడం జరిగిందన్నారు. సినిమాల చిత్రీకరణ  సమయంలో సినిమా చిత్రీకరణ పరికరాలు, యూనిట్లు, సెట్లు సహా అన్ని తరచుగా శానిటైజ్ చేయాల్సి ఉంటుందన్నారు. షూటింగ్‌లో పాల్గొనే టెక్నీషియన్లు, నటీ నటులు తప్పనిసరిగా హ్యాండ్‌ శానిటైజర్లను వినియోగించాలన్నారు. సినిమాల చిత్రీకరణ సమయంలో సాంకేతికంగా అవకాశం లేని పరిస్థితులు మినహా మిగిలిన సమయాల్లో ఆరు అడుగుల భౌతిక  దూరం పాటించాల్సి ఉంటుందన్నారు.  కరోనా వ్యాప్తి నియంత్రణకై ప్రేక్షకులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియపరిచే బహిరంగ సందేశాలను సినిమా ప్రదర్శన ప్రారంభంతో పాటు విరామ సమయాల్లో తప్పక ప్రదర్శించాల్సి ఉంటుందన్నారు. సినిమాల చిత్రీకరణకు అవసరమైన అనుమతులు, నియమ, నిబందనలకు సంబంధించిన వివరాలకు రాష్ట్ర ఫిల్మ్‌, టీవీ, థియేటర్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ అధికారిక వెబ్‌సైట్‌ www.apsftvtdc.inలో పొందవచ్చని ఆయన తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement