మార్గదర్శకాలొచ్చిన వెంటనే సన్నాహాలు | AP Govt Will Prepare Precaution Doses When Center Guidelines Releases | Sakshi
Sakshi News home page

మార్గదర్శకాలొచ్చిన వెంటనే సన్నాహాలు

Published Mon, Dec 27 2021 4:40 AM | Last Updated on Mon, Dec 27 2021 5:45 AM

AP Govt Will Prepare Precaution Doses When Center Guidelines Releases - Sakshi

ఫైల్‌ ఫోటో

సాక్షి, అమరావతి: ఒమిక్రాన్‌ వేరియంట్‌ కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ప్రికాషన్‌ డోసు, 15 నుంచి 18 ఏళ్ల లోపు వారికి టీకా అందిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు అందిన వెంటనే టీకా పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేయనుంది. 15 నుంచి 18 ఏళ్ల లోపు వారికి జనవరి 3వ తేదీ నుంచి టీకా పంపిణీ మొదలు పెట్టనున్నట్టు శనివారం ప్రధాని మోదీ ప్రకటించారు.

అదే విధంగా వైద్యులు, వైద్య సిబ్బంది, ఇతర ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు, 60 ఏళ్లు పైబడిన వృద్ధులకు జనవరి 10వ తేదీ నుంచి ప్రికాషన్‌ డోసు అందించనున్నట్టు ఆయన పేర్కొన్నారు. అయితే ప్రికాషన్‌ డోసు, 15–18 ఏళ్లలోపు వారికి టీకా పంపిణీ మార్గదర్శకాల కోసం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ఎదురు చేస్తున్నారు.
 రాష్ట్రంలో ఇదీ పరిస్థితి 

రాష్ట్రంలో హెల్త్‌కేర్‌ వర్కర్లు 4,91,318 మంది, ఇతర శాఖలకు చెందిన ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు 15,53,283 మందికి ప్రభుత్వం రెండు డోసుల టీకా పంపిణీ చేసింది. 

60 ఏళ్లు పైబడిన వృద్ధులు 50 లక్షల మందికి పైగా ఉన్నారు. 15 నుంచి 18 ఏళ్ల లోపు వారు 50 లక్షలకు పైగా ఉండొచ్చని అంచనా. 

మార్గదర్శకాలు రావడమే ఆలస్యం
కేంద్రం నుంచి మార్గదర్శకాలు ఇంకా రాలేదు. మంగళవారం రావొచ్చని అనుకుంటున్నాం. మార్గదర్శకాలు అందిన వెంటనే సన్నాహాలు మొదలు పెడతాం. టీకా లభ్యతలో ఇబ్బందులు లేవు. కాబట్టి పంపిణీ వేగంగా చేపడతాం.  
– కాటమనేని భాస్కర్, వైద్య, ఆరోగ్య శాఖ కమిషనర్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement