CM YS Jagan Review on COVID Control Measures - Sakshi
Sakshi News home page

కరోనా కట్టడిపై సీఎం జగన్‌ కీలక ఆదేశాలు

Published Mon, Jan 17 2022 11:53 AM | Last Updated on Mon, Jan 17 2022 4:20 PM

CM YS Jagan Review Meeting On Covid Control Measures - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్‌ పరిస్థితులపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. వివిధ ప్రాంతాల్లో కోవిడ్‌ విస్తరణ పరిస్థితులను అధికారులు వివరించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని అధికారులు తెలిపారు. రెండో వేవ్‌తో పోల్చిచూస్తే.. ఆస్పత్రుల్లో కోవిడ్‌ చికిత్సకోసం పడకల సంఖ్యను కూడా పెంచి సిద్ధం చేశామని అధికారులు పేర్కొన్నారు. అన్నిజిల్లాల్లో కలిపి 53,184 పడకలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. కోవిడ్‌ కేసుల్లో ఆస్పత్రుల్లో దాదాపు 27వేల యాక్టివ్‌ కేసుల్లో కేవలం 1100 మంది మాత్రమే ఆస్పత్రి పాలయ్యారని వివరించారు. ఇందులో ఆక్సిజన్‌ అవసరమైన వారి సంఖ్య సుమారు 600 మంది మాత్రమేనని అధికారులు తెలిపారు.

చదవండి: దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులపైనే అధిక ప్రభావం

ఈమేరకు వైద్య పరంగా అవసరాలను గుర్తించాలని.. ఆ మేరకు ఆక్సిజన్‌ను, మందులను సిద్ధం చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. గతంలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేయాలంటే కనీసం 14 రోజులు ఉండేదని, ఇప్పుడు వారం రోజులకు ముందే డిశ్చార్జి అవుతున్నారని అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గానికి ఒక కోవిడ్‌కేర్‌ సెంటర్‌ను గుర్తించామని.. సుమారు 28 వేల బెడ్లను సిద్ధంచేశామని అధికారులు తెలిపారు.

104 కాల్‌సెంటర్‌పైనా సీఎం సమీక్ష
కాల్‌సెంటర్‌ పటిష్టంగా పనిచేయాలని అదేశం
టెలిమెడిసిన్‌ ద్వారా కాల్‌చేసిన వారికి వైద్యం అందేలా తగిన చర్యలు తీసుకోవాలన్న సీఎం
ప్రికాషన డోస్‌ వేసుకునేందుకు ఇప్పుడున్న 9 నెలల వ్యవధిని 6 నెలల వ్యవధికి తగ్గించాలంటూ కేంద్రానికి లేఖరాయాలని సీఎం నిర్ణయం
ఈ వ్యవధిని 3 నుంచి 4 నెలలు తగ్గించే దిశగా ఆలోచన చేయాలని కేంద్రానికి లేఖరాయాలని సీఎం నిర్ణయం
దీనివల్ల ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు, అత్యవసర సర్వీసులు అందిస్తున్నావారికి ఉపయోగమని సమావేశంలో అభిప్రాయం
అంతేకాకుండా ఆస్పత్రిపాలు కాకుండా చాలామందిని కోవిడ్‌నుంచి రక్షించే అవకాశం ఉంటుందన్న సమావేశంలో నిర్ణయం

రెండో డోస్‌ వ్యాక్సినేషన్‌లో మిగతా జిల్లాలతో పోలిస్తే కాస్త దిగువన ఉన్న ఐదు జిల్లాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలని సీఎం ఆదేశం
తూర్పుగోదావరి, గుంటూరు, వైయస్సార్‌కడప, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో రెండో డోస్‌పైన ప్రత్యేక దృష్టిపెట్టాలని అధికారులకు సీఎం ఆదేశం.
15 నుంచి 18 ఏళ్లవారికీ 100శాతం వ్యాక్సినేషన్‌ను పూర్తిచేసిన నెల్లూరు, ప.గో. జిల్లాలు
మరో 5 జిల్లాల్లో 90శాతానికిపైగా ఈ వయసులవారికి వ్యాక్సినేషన్‌ పూర్తి. మరో నాలుగు జిల్లాల్లో 80శాతానికిపైగా వ్యాక్సినేషన్‌
మిగిలిన జిల్లాల్లోనూ ఉద్ధృతంగా వ్యాక్సినేషన్‌ చేయాలని సీఎం ఆదేశం
మిగిలిన జిల్లాలతో పోలిస్తే తక్కువగా ఉన్న విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ప్రత్యేక దృష్టిపెట్టాలన్న సీఎం

కోవిడ్‌ పరీక్షల్లో కేంద్రం కొత్త మార్గదర్శకాలపైనా సమావేశంలో చర్చ
కోవిడ్‌ లక్షణాలు లేనివారికి ఎలాంటి పరీక్షలు చేయొద్దని ఐసీఎంఆర్‌ కొత్త మార్గదర్శకాల్లో పేర్కొందని తెలిపిన అధికారులు
కోవిడ్‌ పాజిటివ్‌ తేలినవారి కాంటాక్ట్స్‌లో కేవలం హైరిస్క్‌ ఉన్నవారికి పరీక్షలు చేయాలని ఐసీఎంఆర్‌ స్పష్టంచేసిందని తెలిపిన అధికారులు

కొత్త మెడికల్‌కాలేజీల నిర్మాణ ప్రగతిపైనా సీఎం సమీక్ష
ఆరోగ్య శ్రీపై పూర్తి వివరాలు తెలిపేలా విలేజ్, వార్డ్‌ క్లినిక్స్‌లో, ప్రభుత్వ ఆస్పత్రుల్లో పెద్ద హోర్డింగ్‌పెట్టాలని సీఎం ఆదేశం
ఆరోగ్య శ్రీ రిఫరల్‌ పాయింట్‌గా క్లినిక్స్‌ వ్యవహరించాలని, వైద్యంకోసం ఎక్కడకు వెళ్లాలన్నదానిపై పూర్తి వివరాలతో సమాచారం లభించాలని సీఎం ఆదేశం

ఆరోగ్యశ్రీ కింద పేషెంట్‌ రిఫరల్‌వ్యవస్థపై రూపొందించిన స్టాండర్డ్‌ ఆపరేషన్‌ప్రొసీజర్‌ను సమగ్రంగా సమీక్షించిన సీఎం
నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో ఆరోగ్య మిత్రలకు, గ్రామ–వార్డు సచివాలయాల్లో ఆరోగ్య మిత్రలకు, పీహెచ్‌సీ ఆరోగ్య మిత్రలకు, 104 మెడికల్‌ ఆఫీసర్‌కు, 108 మెడికల్‌ ఆఫీసర్‌కు రూపొందించిన ఎస్‌ఓపీలను పరిశీలించిన సీఎం

ఆరోగ్య శ్రీ కింద రోగులకు సమర్థవంతంగా సేవలందించాలన్న సీఎం
విలేజ్‌క్లినిక్‌కు వెళ్లినా, పీహెచ్‌సీకి వెళ్లినా, లేదా నెట్‌వర్క్‌ ఆస్పత్రికి వెళ్లినా... ఇలా పేషెంట్‌ఎక్కడకు వెళ్లినా.. వారి ఆరోగ్య పరిస్థితిని వెంటనే తెలుసుకుని, వైద్యంకోసం ఎక్కడకు పంపాలన్న విధానం చాలా పటిష్టంగా ఉండాలన్న సీఎం
104, 108, పీహెచ్‌సీలు, ఇతర ఆరోగ్య కేంద్రాల్లో ఉండే డాక్టర్లు కూడా ఈ ప్రక్రియలో భాగమయ్యేలా, వారికి మంచి సేవలు అందించేలా ఈ రిఫరెల్‌విధానం ఉండాలన్న సీఎం
ఆరోగ్య మిత్రలు కీలకంగా వ్యవహరించాలన్న సీఎం
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని ఈ సేవల సమన్వయంకోసం యాప్‌ పనిచేయాలన్న సీఎం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement