సత్యదేవుని సేవల్లో భక్తుల భాగస్వామ్యం | satyadeva sevas | Sakshi
Sakshi News home page

సత్యదేవుని సేవల్లో భక్తుల భాగస్వామ్యం

Published Sun, Jan 8 2017 12:07 AM | Last Updated on Tue, Sep 5 2017 12:41 AM

satyadeva sevas

  •  మూడు విలక్షణ సేవల ప్రారంభానికి పాలకవర్గం నిర్ణయం
  •  ఒక రోజు అన్ని సేవల్లో పాల్గొనేందుకు రూ.పది వేలు
  •  కొద్ది మార్పులతో రూ.8,500, రూ.7,500 టిక్కెట్లు
అన్నవరం:
సత్యదేవుని సన్నిధిలో ఉదయం నుంచి సాయంత్రం వరకూ జరిగే పూజా కార్యక్రమాల్లో భక్తుల్ని భాగస్వాముల్ని చేస్తూ మూడు రకాల టిక్కెట్ల తో ‘ఉదయాస్తమాన సేవలు’ ప్రారంభించాలని అన్నవరం దేవస్థానం పాలకమండలి నిర్ణయించింది. శనివారం సాయంత్రం దేవస్థానంలోని ట్రస్ట్‌బోర్డు సమావేశం హాలులో ఛైర్మ¯ŒS రాజా ఐవీ రోహిత్, ఈఓ కె.నాగేశ్వరరావులతో పాలకమండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని రాత్రి విలేకర్లకు తెలిపారు. సత్యదేవుని సన్నిధిలో తెల్లవారు జామున సుప్రభాత సేవ వద్ద నుంచి రాత్రి పవళింపు సేవ వరకూ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. వీటిలో పాల్గొనేందుకు వివిధ రుసుములున్నాయి. అయితే ఒకే భక్తుడు అన్ని సేవల్లో పాల్గొనే వీలు లేదు. ఇప్పుడు కొన్ని మార్పులతో మూడు రకాల ‘ఉదయాస్తమాన సేవలు ’ ప్రారంభించాలని నిర్ణయించినట్లు ఛైర్మన్, ఈఓ తెలిపారు. ఈ సేవలు రూ.10,000, రూ.8,500, రూ.7,500 టిక్కెట్‌తో ఈ సేవలు ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ సేవల్లో పాల్గొనే భక్తులకు అనేక సదుపాయాలు కల్పించాలని నిర్ణయించారు. భక్తులు వారు కోరుకున్న రోజున ఈ కార్యక్రమాల్లో పాల్గొనే వెసులుబాటు కలిగించారు.
రూ.పది వేల టిక్కెట్‌తో లభించే సదుపాయాలు
నలుగురు భక్తులు(భార్యా భర్త, మరో ఇద్దరు)  స్వామివారి సుప్రభాతసేవ, నిత్యార్చనలో పాల్గొనవచ్చు. వారికి స్వామివారి  నిత్యకల్యాణం, ఏసీ వ్రత మండపంలో వ్రతం నిర్వహిస్తారు. స్వామివారి అంతరాలయంలో దర్శనం, యంత్రాలయంలో లోపల దర్శనం చేయిస్తారు. వేద పండితులతో వేదాశీర్వచనం ఏర్పాటు చేస్తారు. భక్తులు దేవస్థానంలో  రెండ్రోజులు బస చేసేందుకు ఏసీ గది కేటాయిస్తారు. దంపతులకు వస్రా్తలు, స్వామివారి ఫొటో, అన్నదానప«థకంలో ప్రత్యేకంగా భోజనం, స్వామివారి ప్రసాదం ఇస్తారు.
రూ.8,500 టిక్కెట్‌తో...
స్వామివారి సుప్రభాతసేవ, నిత్యార్చన  నిత్య కల్యాణంలో పాల్గొనే అవకాశం తప్ప రూ.పదివేలు టిక్కెట్‌ తీసుకునే వారికి కల్పించే  సదుపాయాలే వీరికి కూడా  కల్పిస్తారు. అదనంగా  వీరు స్వామివారి ఆయుష్యహోమంలో పాల్గొనే అవకాశం కూడా కల్పిస్తారు. వీరికి ఏసీ గదిలో బస ఒకరోజు మాత్రమే కల్పిస్తారు.
రూ.7,500 టిక్కెట్‌తో ...
వీరికి ఒక రోజు ఏసీ గదిలో బస, ఏసీ మండపంలో వ్రతం, నిత్యకల్యాణం, వేదాశీర్వవచనం కల్పిస్తారు. నలుగురు భక్తులకు అంతరాలయ దర్శనం, యంత్రాలయ దర్శనం, దంపతులకు వస్రా్తలు, ప్రసాదం, అన్నదాన పథకంలో భోజనం, స్వామివారి ఫొటో కూడా ఇస్తారు. భక్తులు ఈ అరుదైన అవకాశాలను ఉపయోగించుకోవాలని వారు కోరారు. ఈ ఉదయాస్తమాన సేవలను  భక్తులకు వివరించి టిక్కెట్లు కొనుగోలు చేసేలా చూసేందుకు కొంతమంది పండితులు, అధికారులు, వ్రతపురోహిత ప్రముఖులతో కమిటీలు వేసేందుకు కూడా  అధికారులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement