- ప్రతి శనివారం ఏలేశ్వరం ఆలయంలో వ్రతాల నిర్వహణ
- దేవస్థానం ఛైర్మన్, ఈఓ వెల్లడి
10 నుంచి సత్యదేవునికి ఆయుష్య హోమం
Published Fri, Dec 2 2016 11:53 PM | Last Updated on Mon, Sep 4 2017 9:44 PM
అన్నవరం:
మార్గశిర ఏకాదశి సందర్భగా ఈ నెల పదో తేదీ (శనివారం) నుంచి అన్నవరం దేవస్థానంలో రెండు విశేష కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నట్లు దేవస్థానం ఛైర్మ¯ŒS రాజా ఐవీ రోహిత్, ఈఓ కె.నాగేశ్వరరావు శుక్రవారం సాయంత్రం విలేకర్లకు తెలిపారు.
సత్యదేవునికి నిత్యం ఆయుష్యహోమం...
కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీజయేంద్ర సరస్వతి స్వామి సూచనల ప్రకారం ఈ నెల పదో తేదీ శనివారం నుంచి ప్రతి రోజూ సత్యదేవునికి ఆయుష్య హోమం నిర్వహించడానికి నిర్ణయించారు. ఇప్పటి వరకూ సత్యదేవుని జన్మనక్షత్రం మఖనాడు మాత్రమే అంటే 27 రోజులకు ఒకసారి మాత్రమే ఈ ఆయుష్య హోమం నిర్వహిస్తున్నారు.
ఉదయం తొమ్మిది గంటల నుంచి 11 గంటల వరకూ దేవస్థానంలోని దర్బారు మండపంలో ఈ హోమం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొనాలంటే రూ.రెండు వేలు చెల్లించి టిక్కెట్ తీసుంటే వారి గోత్రనామాలతో ఈ హోమం చేస్తారు. ఒక టిక్కెట్ పై నలుగురు కుటుంభ సభ్యులు హోమంలో పాల్గొనవచ్చు. స్వామివారి అంతరాలయ దర్శనానికి అనుమతిస్తారు. స్వామివారి కల్యాణ భక్తులతో అన్నదానంలో ఉచిత భోజన సౌకర్యం కల్పిస్తారు. ఒకవేళ ఆయుష్య హోమంలో పాల్గొనేందుకు భక్తులు టిక్కెట్లు కొనుగోలు చేయని రోజుల్లో దేవస్థానమే ఈ హోమాన్ని నిర్వహిస్తుందని తెలిపారు. ఆయుష్య హోమానికి సంబంధించిన పూర్తి వివరాల కోసం 9491249982, 9491249989 ఫో¯ŒS నెంబర్లకు ఫో¯ŒS చేయాలని సూచించారు.
ఏలేశ్వరం సత్యదేవుని ఆలయంలో స్వామివారి వ్రతాలు
అన్నవరం దేవస్థానం దత్తత తీసుకున్న ఏలేశ్వరంలోని సత్యదేవుని ఆలయంలో కూడా ఈ నెల పదో తేదీ నుంచి ప్రతి శనివారం ఉదయం ఏడు గంటల నుంచి పది గంటల వరకూ సత్యదేవుని వ్రతాలు నిర్వహిస్తారు. ఇందుకు గాను రూ.150 టిక్కెట్ తీసుకోవాలి. పూర్తి వివరాలకు 9959160432 నెంబర్‌కు ఫో¯ŒS చేయాలని కోరారు.
Advertisement
Advertisement