సత్యదేవుని అంతరాలయానికి సువర్ణశోభ
-
అంతరాలయంపైకప్పునకు బంగారు తాపడం
-
రూ.40 లక్షలతో చేయించనున్న సీఎంఆర్ అధినేత వెంకటరమణ
అన్నవరం :
సత్యదేవుని అంతరాలయంలోని గోడల పైకప్పును బంగారు రేకుతో తాపడం చే యించడానికి విశాఖ పట్నం సీఎంఆర్ షాపింగ్ మాల్ అధినేత ఎం. వెంకటరమణ సంసిద్ధత వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన సతీసమేతంగా సత్యదేవుని దర్శించి పూజలు చేశా రు. అనంతరం దేవస్థానం ఈఓ కె.నాగేశ్వరరావును కలిసి తన కోరి కను తెలిపారు. గతంలో ఆయన స్వామివారి అంతరాలయం గోడలకు సుమారు రూ.40 లక్షల వ్యయంతో బంగారు రేకు తాపడం చేయించారు. అంతరాలయం పైకప్పునకు కూడా బంగారు తాపడం చేయిస్తాన్నారు. అందుకు అంచనాలు రూపొందించాలని దేవస్థాన అధికారులకు సూచించారు. అలాగే వనదుర్గ అమ్మవారికి బంగారు మకరతోరణం, వింజూమరలు, ఆలయద్వారాలకు బంగారు రేకు తాపడం సమర్పించడానికి కూడా ఆయన అంగీకరించారు. దాత కోరిక మేరకు బంగారు రేకు తాపడం చేయించడానికి అవసరమయ్యే అంచనాలు తయారు చేసి ఇవ్వాలని దేవస్థానం డిప్యూటీ స్థపతి ఐ.ప్రసాద్‌ను ఈఓ ఆదేశించారు.
ఆలయం పైకప్పు మినహా ఆలయమంతా స్వర్ణమయమే..
ఇప్పటికే సత్యదేవుని ఆలయంలో ప్రధాన ద్వారాలకు, ఆలయ గోడలకు దాతల సహకారంతో స్వర్ణరేకు తాపడం చేశారు. ఇపుడు అంతరాలయం పైకప్పు కూ డా స్వర్ణమయం అయితే ఇక మిగిలేది ముఖ మండపం పైకప్పు మాత్రమే.