ప్రతి సోపానానికీ భక్తజన నీరాజనం | steps festival | Sakshi
Sakshi News home page

ప్రతి సోపానానికీ భక్తజన నీరాజనం

Dec 15 2016 11:48 PM | Updated on Sep 4 2017 10:48 PM

రత్నగిరి వాసుడు సత్యదేవుని కోవెలకు దారి తీసే సోపానాలు గు రువారం స్వామి, అమ్మవార్ల సమక్షంలో భక్తుల నీరాజనాలందుకున్నాయి. గురువారం ’మెట్లోత్సవం’ సందర్భంగా ము త్తయిదువులు పూసిన పసుపు, కుంకుమ, పుష్పాల అలంకరణ, ఆపై కర్పూర హార తి, నైవేద్యంతో ప్రత్యేక శోభను సంతరించుకున్నాయి. భక్తులు ప్రతి మెట్టునూ స్వామి వారి అంశగా భావించి పూజించా

  • ఘనంగా సత్యదేవుని మెట్లోత్సవం
  • అన్నవరం : 
    రత్నగిరి వాసుడు సత్యదేవుని కోవెలకు దారి తీసే సోపానాలు గు రువారం స్వామి, అమ్మవార్ల సమక్షంలో భక్తుల నీరాజనాలందుకున్నాయి. గురువారం ’మెట్లోత్సవం’ సందర్భంగా ము త్తయిదువులు పూసిన పసుపు, కుంకుమ, పుష్పాల అలంకరణ, ఆపై కర్పూర హార తి, నైవేద్యంతో ప్రత్యేక శోభను సంతరించుకున్నాయి. భక్తులు ప్రతి మెట్టునూ స్వామి వారి అంశగా భావించి పూజించా రు. ఉదయం 8 గంటలకు సత్యదేవుడు, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను మెట్ల మార్గంలో పల్లకీ మీద ఊరేగిస్తూ కొండ దిగువకు తీసుకువచ్చారు.  ప్రత్యేక పూజ ల అనంతరం వేదపండితుల మంత్రోచ్చారణ, కోలాట నృత్యాల మధ్య గ్రా మంలో  ఊరేగించారు. అనంతరం తొలి పాంచా పాదాల మండపం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. ఉదయం 9.30 గంటలకు  శ్రీకనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద గల తొలి మెట్టును  ముత్తయిదువులు పసుపు, కుంకుమ, పూలతో అలంకరించగా ఈఓ నాగేశ్వరరావు కొబ్బరికాయ కొట్టి, మెట్టు కు హారతి ఇచ్చి మెట్లోత్సవాన్ని ప్రారంభించారు. ఆ హారతి ఇచ్చిన మెట్ల మీదు గా స్వామి,అమ్మవార్లను పల్లకీ మీద ఊరేగించారు. అనంతరం ముత్తయిదువులు ప్రతి మెట్టుకు పసుపు కుంకుమ, పూలతో అలంకరించగా పండితులు ఒక తమలపాకుపై హారతి కర్పూరం, మరో తమలపాకుపై పటికబెల్లం నివేదించగా భక్తులు ఆ హారతి వెలిగించి, స్వామి, అమ్మవార్లను ఆ మెట్ల మీదుగా ఊరేగించారు. ఇలా మొత్తం 450 మెట్లకు పూజలు చేస్తూ కార్యక్రమాన్ని కొనసాగించారు.చివరగా అనివేటి మండపం మెట్ల వద్ద హారతి వెలిగించడంతో కార్యక్రమం ముగిసింది. వేదపండితులు కపిలవాయి రామశాస్త్రి, ముష్టి కామశాస్త్రి, గొల్లపల్లి ఘనాపాఠీ, గొర్తి విశ్వేశ్వర  సుబ్రహ్మణ్య ఘనాపాఠీ, సత్యదేవుని ఆలయ ప్ర«ధానార్చకులు కొండవీటి సత్యనారాయణ, స్పెషల్‌ గ్రేడ్‌ వ్రతపురోహితులు నాగాభట్ల కామేశ్వరశర్మ, ముత్య సత్యనారాయణ, దేవస్థానం ఏసీ ఈరంకి జగన్నాథరావు, దేవస్థానం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement