సాక్షి స్పెల్‌బీకి అనూహ్య స్పందన | sakshi spell bee good result | Sakshi
Sakshi News home page

సాక్షి స్పెల్‌బీకి అనూహ్య స్పందన

Published Sun, Oct 23 2016 11:20 PM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

సాక్షి స్పెల్‌బీకి అనూహ్య స్పందన - Sakshi

సాక్షి స్పెల్‌బీకి అనూహ్య స్పందన

రాజమహేంద్రవరం ట్రిప్స్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో ఆదివారం జరిగిన ‘సాక్షి’ ఎరీనా వ¯ŒS స్కూల్‌ ఫెస్ట్‌ స్పెల్‌బీ క్వార్టర్‌ ఫైనల్‌ పరీక్షకు అనూహ్య స్పందన లభించింది. నాలుగు కేటగిరీల్లో జరిగిన ఈ పరీక్షలకు 236 మంది విద్యార్థులు హాజరయ్యారు. ‘సాక్షి’ టీవీలో బి–మాస్టర్‌ అడిగిన స్పెల్లింగులను విద్యార్థులు జవాబు పత్రంపై రాశారు. 
 
రాజమహేంద్రవరం రూరల్‌ : 
రాజమహేంద్రవరంలోని త్రిపుర నగర్‌లోని ట్రిప్స్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్లో ఆదివారం జరిగిన ‘సాక్షి’ ఎరీనా వ¯ŒS స్కూల్‌ ఫెస్ట్‌ స్పెల్‌ బీ క్వార్టర్‌ ఫైనల్‌ పరీక్షకు విశేష స్పందన లభించింది. జిల్లాలోని వివిధ పాఠశాలల నుంచి విద్యార్థులు హాజరై ఈ పరీక్షలు రాశారు. ఇందులో ప్రతిభ చూపిన వారు త్వరలో జరిగే సెమీఫైనల్‌ పరీక్షల్లో పాల్గొంటారు. 
 
నాలుగు కేటగిరీల్లో..
నాలుగు కేటగిరీల్లో జరిగిన ఈ పరీక్షకు 236 మంది హాజరయ్యారు. కేటగిరీ–1లో 37 మంది, కేటగిరీ–2లో 54 మంది, కేటగిరీ–3లో 75 మంది, కేటగిరీ–4లో 70 మంది విద్యార్థులు సాక్షి టీవీలో బి–మాస్టర్‌ అడిగిన స్పెల్లింగులను జవాబు పత్రంపై రాశారు. క్వార్టర్‌ ఫైనల్‌ పరీక్షలను సాక్షి రాజమహేంద్రవరం యూనిట్‌ ఇ¯ŒSచార్జి వీవీ శివుడు, ట్రిప్స్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ అధినేత్రి బాలాత్రిపుర సుందరి, యాడ్‌ ఆఫీసర్‌ ఉమాశంకర్‌ పర్యవేక్షించారు. కాగా..స్పెల్‌బీ పరీక్ష ఇంగ్లిషు భాషపై పట్టు సాధించేందుకు ఉపయోగపడుతుందని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అభిప్రాయం వ్యక్తం చేశారు.
 
చాలా ఉపయోగంగా ఉంది
స్పెల్‌బీ పరీక్ష వల్ల ఇంగ్లిషుపై పూర్తిగా అవగాహన కలుగుతోంది. అలాగే ఇతర సబ్జెకులపై కూడా అవగాహన పెరుగుతోంది. చాలా ఉపయోగంగా ఉంది. 
– కార్తీక్, తొమ్మిదో తరగతి, కోనసీమ విద్యాశ్రమం, ముక్తేశ్వరం.
 
ఇంగ్లిషుపై పట్టు పెరిగింది
స్పెల్‌బీ పరీక్షకు సిద్ధం కావడం వల్ల ఇంగ్లిషుపై పట్టు పెరిగింది. అక్షర దోషాలు లేకుండా రాయగలుగుతున్నాను. భాషాదోషాలు తగ్గాయి. 
–  లక్ష్మిప్రసన్న, ఐదోతరగతి, ఆదిత్య స్కూలు, కాకినాడ.
 
విద్యార్థులకు వరం
ప్రతి ఏటా సాక్షి నిర్వహిస్తున్న స్పెల్‌బీ పరీక్ష విద్యార్థులకు వరం అనవచ్చు.ఈ పరీక్ష కారణంగా ఇంగ్లిషుతో పాటు అన్ని సబ్జెక్టుల్లో నైపుణ్యం సాధించాను. 
–  మేఘన భండారీ, పదో తరగతి, ట్రిప్స్‌ఇంటర్నేషనల్‌ స్కూల్, రాజమహేంద్రవరం
 
స్పెల్‌బీ ఒక మంచి వేదిక
ఇంగ్లిషుపై పట్టు సాధించడానికి సాక్షి స్పెల్‌బీని ఒక మంచి వేదికగా తీసుకువచ్చింది. ఏటా సాక్షి స్పెల్‌బీ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూసే పరిస్థితి ఏర్పడింది.దీని కారణంగా విద్యార్థులు ఇంగ్లిషులో మాట్లాడడంతో నైపుణ్యం సాధిస్తున్నాను. 
– సుచిత్ర, విద్యార్థిని తల్లి, రాజమహేంద్రవరం
 
‘సాక్షి’కి హేట్సాఫ్‌
ఇంగ్లిషుపై పట్టుసాధించేందుకు సాక్షి నిర్వహిస్తున్న స్పెల్‌బీ పరీక్ష ప్రాధాన్యతను రెండు తెలుగురాష్ట్రాల్లోని విద్యార్థుల తల్లిదండ్రులు గుర్తించారు. విద్యార్థులు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుని పోటీపడుతున్నారు. ఇలాంటి పరీక్షలు నిర్వహిస్తున్న ‘సాక్షి’కి   హేట్సాఫ్‌. 
– బండి అజయ్‌బాబు, విద్యార్థి తండ్రి, రాజమహేంద్రవరం
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement