
రాజశ్రీ, జుబేదా, అలీ, శ్రీలక్ష్మి, గీత
‘‘బాలనటుడిగా కెరీర్‌ని ప్రారంభించి నలభై ఐదేళ్లుగా అగ్ర హాస్య నటుడుగా కొనసాగుతున్న అలీ కారణజన్ముడు. అతనికి పద్మశ్రీ అవార్డు వస్తే చూడాలని ఉంది’’ అని సీనియర్ నటి రాజశ్రీ అన్నారు. సంగమం ఫౌండేషన్, వివేకానంద హాస్పిటల్స్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ‘కామెడీ ఫెస్టివల్’ నిర్వహించారు. ఇందులో భాగంగా నటుడు అలీని ‘సంగమం– వివేకానంద జీవిత సాఫల్య పురస్కారం’ అవార్డుతో సత్కరించారు.
ముఖ్య అతిథిగా విచ్చేసిన రాజశ్రీ మాట్లాడుతూ–‘‘అలీ ఎంత మంచి నటుడో అంత మంచి వ్యక్తి కూడా. తనలోని సేవాగుణం స్ఫూర్తినిస్తుంది’’ అన్నారు. కాగా అలనాటి హీరో కాంతారావు కుమారుడు రాజా, వ్యాపారవేత్త రాజశేఖర్‌లు హాస్యనటి పాకీజా, కళాకారిణి హేమకుమారిలకు ఒకొక్కరికి రూ. 25000 ఆర్థిక సాయం అందించారు. వివేకానంద హాస్పిటల్స్ అధినేత డా. గీత, నటుడు తనికెళ్ల భరణి, ‘సంగమం’ సంజయ్ కిషోర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment