మినీలారీ ఢీకొని ఆటో డ్రైవర్ మృతి | auto driver dies in road accident | Sakshi
Sakshi News home page

మినీలారీ ఢీకొని ఆటో డ్రైవర్ మృతి

Aug 16 2014 7:52 AM | Updated on Aug 30 2018 3:58 PM

నెల్లూరు జిల్లా సంగం మండలం శిద్దీపురం వద్ద మినీ లారీ - ఆటో ఢీకొన్న ప్రమాదంలో ఆటో డ్రైవర్ అక్కడికక్కడే మరణించాడు.

నెల్లూరు జిల్లా సంగం మండలం శిద్దీపురం వద్ద మినీ లారీ - ఆటో ఢీకొన్న ప్రమాదంలో ఆటో డ్రైవర్ అక్కడికక్కడే మరణించాడు. ముంబై రహదారిపై తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. ఆటోడ్రైవర్ ప్రకాశం జిల్లా పామూరు ప్రాంతానికి చెందిన వ్యక్తిగా ఆటోలో లభించిన ఆధారాలను బట్టి తెలుస్తోంది.

అతడు ఆటోలో వంట గ్యాస్ సిలిండర్లు తీసుకుని నెల్లూరు వైపు వెళ్తుండగా ఎదురుగా పెళ్లి బృందంతో వస్తున్న మినీ లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. అయితే అదృష్టవశాత్తు గ్యాస్ సిలిండర్లు ఏవీ పేలకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పినట్లయిందని పరిసర ప్రాంతాల వాళ్లు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement