సాక్షి, నెల్లూరు : పోలీసులు అకారణంగా తమపై దాడి చేశారంటూ గిరిజనులు చేపట్టిన ఆందోళన సంగంలో ఉద్రిక్తతలకు దారి తీసింది. నెల్లూరు జిల్లా సంగం పరిధిలోని నీలగిరి జలాశయం వద్ద రోజు మాదిరిగానే గిరిజజన మత్సకారులు చేపల వేటకు వెళ్ళారు. అయితే అప్పటికే అక్కడున్న పోలీసులు.. మత్సకారులను తరిమేసే ప్రయత్నం చేశారు.
దీంతో మత్సకారులకు పోలీసులకు గొడవ మొదలైంది. ఏ కారణం లేకుండా పోలీసులు కొట్టడంతో గిరిజనులు తిరగబడ్డారు. ఈ వ్యవహారంలో పోలీసులు 8 మందిని మత్స్యకారులను అరెస్టు చేసి సంగం పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్ళారు. దీనిపై స్థానిక గిరిజన మహిళలు స్టేషన్ ముందు ఆందోళకు దిగారు, ఏ కారణం లేకుండానే వారిని కొట్టారని ఆందోళకు దిగారు. విషయం తెలుసుకున్న మత్సశాఖ అధికారిని వెంటనే పోలీసు స్టేషన్‌కు రావడంతో పోలీసులు అతడిని కూడా అడ్డుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment